Sunday, July 29, 2007

కాలం మారింది--1972

సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరధి
గానం::S.P.బాలు ,L.R.ఈశ్వరీ

తారాగణం::శోభన్‌బాబు,శారద,గుమ్మడి,అంజలీదేవి,చంద్రమోహన్,సూర్యకాంతం,గీతాంజలి,అల్లురామలింగయ్య.
పల్లవి::

ఏమిటయ్యా సరసాలు..ఎందుకయ్యా జలసాలు
ఏమిటయ్యా సరసాలు..ఎందుకయ్యా జలసాలు
ఓ సోగ్గాడా ఆపవయ్య..నీ అల్లరి చిల్లరి వేషాలు
అహా..అహా..అహా..అహా..అహా..అహా..

ఏమిటి పిల్లా నా తప్పు..అవునో కాదో నువ్వు చెప్పు
ఏమిటి పిల్లా నా తప్పు..అవునో కాదో నువ్వు చెప్పు
అదరగొట్టినా బెదరగొట్టినా..వదిలిపోదులే మన వలపు
ఏమిటయ్యా సరసాలు..ఎందుకయ్యా జలసాలు

చరణం::1

ఒళ్ళు ముద్దగా తడిసిపోయి..చలిచలిగా ఉన్నదిలే
ఈ నీళ్ళల్లోన ఏముందో..సిగ్గేస్తూ ఉన్నదిలే
అహా..అందులో మజా ఉన్నదిలే అనుభవించితే తెలుసునులే
అందులో మజా ఉన్నదిలే అనుభవించితే తెలుసునులే
నిండా మునిగిన వాళ్లకు మనకు చలి ఏమున్నదిలే
ఏమిటయ్యా సరసాలు..ఎందుకయ్యా జలసాలు
ఏమిటి పిల్లా నా తప్పు..అవునో కాదో నువ్వు చెప్పు

చరణం::2

రంగులు మార్చే అబ్బాయిలు చదరంగపుటెత్తులు వేస్తారు
మాయలు తెలియని అమ్మాయిలను మైకంలో ముంచేస్తారు
ఆడవాళ్లిలా అంటారు నాటకమాడుతూ ఉంటారు
ఆడవాళ్లిలా అంటారు నాటకమాడుతూ ఉంటారు
సందు చూచుకుని ఎంత వాణ్ణైన కొంగుకు ముడేసుకుంటారు
ఏమిటయ్యా సరసాలు..ఎందుకయ్యా జలసాలు
ఏమిటి పిల్లా నా తప్పు..అవునో కాదో నువ్వు చెప్పు

చరణం::3

అత్త కొడుకని అలుసిస్తే ఈ ఆగడమంతా ఏల
అత్త కొడుకని అలుసిస్తే ఈ ఆగడమంతా ఏల
మా వాళ్ళిప్పుడు చూసారంటే అబ్బో మిర్చి మసాలా
ఓ మావా కూతురమ్మా..ఆహా..అందాల ముద్దుగుమ్మా..హ్హా..
ఓ మావా కూతురమ్మా అందాల ముద్దుగుమ్మా
మనకేనాడో రాసినాడు ఆ మాయదారి బ్రహ్మ

ఏమిటయ్యా సరసాలు..ఎందుకయ్యా జలసాలు
ఓ సోగ్గాడా ఆపవయ్య..నీ అల్లరి చిల్లరి వేషాలు

ఏమిటి పిల్లా నా తప్పు..అవునో కాదో నువ్వు చెప్పు
అదరగొట్టినా బెదరగొట్టినా..వదిలిపోదులే మన వలపు
ల్లాలలాలలల్లాలలలాల్లాలలల్లా..

Kaalam Maarindi--1972
Music::S.Rajeswara rao
Lyricis::Kosaraju 
Singer's::S.P.Balu,L.R.Iswarii

::::::

yemitayyaa sarasaalu yendukayyaa jalsaalu
yemitayyaa sarasaalu yendukayyaa jalsaal
oo soggaadaa ne allari chillari veshaalu
yemiti pillaa na tappu avunoo kaadoo nuvu cheppu
yemiti pillaa na tappu avunoo kaadoo nuvu cheppu
adaragottinaa bedaragottinaa vadilipodule mana valapu

::::1

ollu muddagaa tadisipoyi chalichaligaa unnadile
ee neellallona yemundo siggestu unnadile
andulo majaa unnadile anubhavinchite telusunule
andulo majaa unnadile anubhavinchite telusunule
nindaa munigina vaallaku manaku chali yemunnadile

::::2

rangulu marche abbayilu chadarangaputettulu vestaru
mayalu teliyani ammayilanu maikamlo munchestaru
aadavaallilaa antaru natakamaadutu untaru
aadavaallilaa antaru natakamaadutu untaru
sandu chuchukuni yenta vaannaina konguku mudesukuntaru

:::::3

atta kodukani alusiste ee aagadamantaa yela
atta kodukani alusiste ee aagadamantaa yela
maa vallippudu chusarante abbo mirchi masaalaa
oo mava kuturammaa andaala muddugummaa
oo mava kuturammaa andaala muddugummaa

manakenado rasinaadu aa mayadari brahma