Saturday, November 27, 2010

జగత్ కిలాడీలు--1969

సంగీతం::S.P.కోదండపాణి
రచన::దేవులపల్లి
గానం::S.P.బాలు ,P.సుశీల 
నటీ,నటులు::కృష్ణ,వాణిశ్రీ, S.V.రంగారావ్ 

పల్లవి::

వేళ చూస్తే సందె వేళా..గాలి విస్తే పైరగాలి
వేళ చూస్తే సందె వేళా..గాలి విస్తే పైరగాలి
ఏల ఒంటరి తోటకడకు ఎందుకొరకు..
ఎందుకొరకూ..ఊ..ఎందుకొరకూ..

కళ్ళు కప్పే రాత్రివేళ..ఒళ్ళునిమిరే పిల్లగాలి
మెల్ల మెల్లన తోటపిలిచే అందుకొరకే..అందుకొరకే..

చరణం::1

అచ్చంగా వసంత మాసం..వచ్చేదాకా
వెచ్చన్ని పూదేనియలు..తెచ్చేదాకా
అచ్చంగా వసంత మాసం..వచ్చేదాకా
వెచ్చన్ని పూదేనియలు..తెచ్చేదాకా
పెదవి పెదవి..ఎదురై ఎదురై..
పెదవి పెదవి..ఎదురై ఎదురై..
మధువులు వెదికే వేళా..మగువా అదియే వసంత వేళా

వేళ చూస్తే సందె వేళా..గా వీస్తే పైరగాలి
ఏల ఒంటరి తోటకడకు..ఎందుకొరకూ..ఊ..ఎందుకొరకూ

చరణం::2

రెప్పల్లో దాగిన..చూపులు చెప్పేదేమిటో
గుండెల్లో గుస గుస లాడే..కోరిక లేమిటో
రెప్పల్లో దాగిన..చూపులు చెప్పేదేమిటో
గుండెల్లో గుస గుస లాడే..కోరిక లేమిటో
రారా..వెంటనే..రారా వెంటనే పొదరింటికి
ఇక రాదురా నిదుర..నా కంటికి..

కళ్ళు కప్పే రాత్రివేళ..ఒళ్ళునిమిరే పిల్లగాలి
మెల్ల మెల్లన తోటపిలిచే అందుకొరకే..అందుకొరకే..

వేళ చూస్తే సందె వేళా..గా వీస్తే పైరగాలి
ఏల ఒంటరి తోటకడకు..ఎందుకొరకూ..ఊ..ఎందుకొరకూ

No comments: