Monday, August 20, 2012

నాలుగు స్తంబాలాట--1982




సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

హహహహహహహహహహా 
హే..హే..హే..హే..హే..హే..
లలలల..హే..హే..హే..హే
రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా

చరణం::1

సూరీడు చల్లారు నీ చూపూ..చలిగాలిలా వీచే నా వైపూ
పరుగెత్తే పరువంలోనా..పడగెత్తే ప్రణయంలాగ 
సాగిపోవాలి జతగా

నీ కంటిలో ఉన్న చలిమంటా..తొలిగంట కొట్టింది నా కంట
పయనించే జవనంలోనాపలికే ఋతుపవనంలాగా
జల్లు రావాలి వడిగా

ఈ వడిలో..ఉరవడిలో..ముడివడి పోవాలీ
కాలమెంత దూరమో..కలిసి చూడగా

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా

చరణం::2

సందెల్లో మందార బొట్టుందీ..అందాల ముద్దిచ్చి అంటింది
సెలయేటి అలజడిలోనా..చెలరేగే అల్లరిలాగా ఊగిపోవాలి కలిసీ

సిగ్గుల్లో చిగురంత ఎరుపుందీ..వద్దుల్లో వరసైన వలపుందీ
నాజూకు నడకల్లోనా..నలిగేటి మొలకల్లాగా..ఆవిరవ్వాలి అలిసీ

ఆవిరులో..నా విరులే..విర విరలాడాలీ
కౌగిలింత ఇల్లుగా..కలిసి చేరగా 

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో
హ హ నా గుండెలో ఓ కోయిలా
ల ల ల ల..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ 

లాలలా..లలాలలా..హేహెహే..లాలలలా