Sunday, March 22, 2015

సంఘర్షణ--1983


సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చిరంజీవి,నళిని,విజయశాంతి.

పల్లవి::

లలలలలలలా..లలలలలలలా
నిద్దురపోరా..ఓ..వయసా..బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా..ఓ..వయసా..బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఊపను ఉయ్యాల..ఎంతని ఊపను ఉయ్యాల

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 

నిద్దురపోరా..ఓ..వయసా..బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా..ఓ..వయసా..బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఓపను నీ గోల..ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను..వెచ్చని జోలా

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ

చరణం::1

మసకైన పడనీవూ..మల్లె విచ్చుకోనీవూ
హవ్వ..హవ్వ..హవ్వా..
వేళాపాళా లేదాయే..పాలకి ఒకటే గోలాయే
చెపితేనేమో వినవాయే..చెప్పకపోతే గొడవాయే 
బజ్జోమంటే తంటాలా..ఎప్పుడు పడితే అపుడేనా

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ

నిద్దురపోవే ఓ వయసా..బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా..బుద్ధిగ ఈ వేల

చరణం::2

మనసైన పడనీవూ ఊ..మాట చెప్పుకోనీవూ
హవ్వ..హవ్వ..హవ్వా..ఆ
లాల పోసుకోనీవూ..పూలు ముడుచుకోనీవూ
హవ్వ..హ వ్వ..హవ్వా..ఆ
వెడి గిన్నె తేవాయే వెన్నెల బువ్వే కరువాయే
చలిగాలేస్తే సలుపాయే..వెచ్చని గాలికి వలపాయే
తాకంగానే తాపాలా..ఆనక అంటే అల్లరేనా

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ

నిద్దురపోరా ఓ వయసా..బుద్ధిగ ఈ వేల
నిద్దురపోవే ఓ వయసా..బుద్ధిగ ఈ వేళ

ఎంతని ఊపను ఉయ్యలా..ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను..ముద్దుల జోలా..ఆ

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ

Sangharshana--1983
Music::Chakravarti
Lyrics::Veetuuri 
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Chiranjeevi,Nalini,VijayaSaanti.

::::

lalalalalalalaa..lalalalalalalaa
niddurapOraa..O..vayasaa..buddhiga ii vELa
niddurapOraa..O..vayasaa..buddhiga ii vELa
entani Upanu uyyaala..entani Upanu uyyaala

jOjOjOjO laalii..jOjO..O..O 
OjOjOjO laalii..jOjO..O..O 

niddurapOraa..O..vayasaa..buddhiga ii vELa
niddurapOraa..O..vayasaa..buddhiga ii vELa
entani Opanu nee gOla..entani Opanu nee gOla
Emani paaDanu..vechchani jOlaa

jOjOjOjO laalii..jOjO..O..O 
OjOjOjO laalii..jOjO..O..O

::::1

masakaina paDaneevU..malle vichchukOneevU
havva..havva..havvaa..
vELaapaaLaa lEdaayE..paalaki okaTE gOlaayE
chepitEnEmO vinavaayE..cheppakapOtE goDavaayE 
bajjOmanTE tanTaalaa..eppuDu paDitE apuDEnaa

jOjOjOjO laalii..jOjO..O..O 
OjOjOjO laalii..jOjO..O..O

niddurapOvE O vayasaa..buddhiga ii vELa
niddurapOraa O vayasaa..buddhiga ii VEla

::::2

manasaina paDaneev uu..maaTa cheppukOneevuu
havva..havva..havvaa..aa
laala pOsukOneevuu..poolu muDuchukOneevuu
havva..ha vva..havvaa..aa
veDi ginne tEvaayE vennela buvvE karuvaayE
chaligaalEstE salupaayE..vechchani gaaliki valapaayE
taakangaanE taapaalaa..Anaka anTE allarEnaa

jOjOjOjO laalii..jOjO..O..O 
OjOjOjO laalii..jOjO..O..O

niddurapOraa O vayasaa..buddhiga ii VEla
niddurapOvE O vayasaa..buddhiga ii vELa

entani Upanu uyyalaa..entani Opanu nee gOla
Emani paaDanu..muddula jOlaa..aa

jOjOjOjO laalii..jOjO..O..O 

OjOjOjO laalii..jOjO..O..O

కొదమ సింహం--1990



సంగీతం::రాజ్-కోటి 
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,K.S.చిత్ర 

పల్లవి::

చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా

ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా 

సాయంత్ర వేళ..సంపంగి బాల
శృంగార మాల..మెళ్ళోన వేసి 
ఒళ్ళోన చెరగా..య యా యా 

చక్కిలి గింతల రాగం 
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే 
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా యా యా

చరణం::1

కౌగిట్లో ఆ కళ్ళు..కవ్వించే పోకళ్ళు
మొత్తంగ కోరిందమ్మ..మోజు
పాలల్లో మీగడ్లు..పరువాల ఎంగిళ్ళు 
మెత్తంగ దోచాడమ్మ..లౌజు
వచ్చాక వయసు..వద్దంటే ఓ యస్సు 
బుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ..అంటే తంట..ఊపందుకుంటా
నీ ఎండ కన్నేసి..నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీరోజు
యా..యా..యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చెక్కిలిగుంటల..గీతం
ఓ ప్రియ యా యా యా యా యా

చరణం::2

చూపుల్లో బాణాలు..సుఖమైన గాయలు
కోరింది కోలాటాల..ఈడు
నీ ప్రేమ గానాలు..లేలేత దానాలు
దక్కందే పోనే పోడు..వీడు
గిలిగింత గిచ్చుళ్ళు..పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే..నాకు మనసు
సై..అంటే జంట..చెయ్..అందుకుంట
బుడమేటి పొంగంటి..బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే..చూడు
య..యా..య

చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలిగుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా యా

ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా  యా

సాయంత్ర వేళ..సంపంగి బాల
శృంగార మాల..మెళ్ళోన వేసి 
ఒళ్ళోన చెరగా..య..యా..య

కొదమ సింహం--1990


సంగీతం::రాజ్-కోటి 
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,K.S.చిత్ర

పల్లవి::

star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star starr

star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star 

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసరితో తదిగిణతోం ఇహం పరం నిరంతరం
star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star 

చరణం::1

వేయ్ వేయ్ మరో స్టెప్పు వేయ్
ఒకే లిప్పువై జోరుగా నా జోడుగా
చేయ్ చేయ్ ఇలా బ్రేక్ చేయ్
ఎదే షేక్ చేయ్ సోకుగా నాజూకుగా
ఇస్పేటు రాజు అరె కిస్ పెట్టుకుంటే
ఆయ్ డైమండు రాణి డంగౌతు ఉంటే
లవ్వుబాయ్ లబ్జులన్ని చూపనా 
కౌబాయ్ కౌగిలింత గరం గరం గరం గరం
star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star 

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం

చరణం::2

వేయ్ వేయ్ అలా గాలమేయ్
ఇలా శూలమేయ్ రాజులా నటరాజులా
చేయ్ చేయ్ భలే ట్యాప్ చేయ్
సరే ట్విస్టు చేయ్ మోతగా తొలి మోజుగా
నువ్వేరా కాసు certainly baby 
నీతోనే ఊసు sure my love
అందాల గూసే ఆటీను ఆసు
హార్టు బీటుతోటి తాళమేయనా
అరె వాటమైన బతుకు ఎంత సుఖం సుఖం సుఖం సుఖం 

star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star 

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
అరె నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసిరితో తదిగిణతో ఇహం పరం నిరంతరం 

star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star

వీరాభిమన్యు--1965




సంగీతం::K.V.మహదేవన్
రచన::సముద్రాల సీనియర్ (senior)
గానం::S.జానకి,బృందం
Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి

పల్లవి::

కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా 
చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా 
కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా 
చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా 
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా

చరణం::1

ద్వారక వీడి నీరధి లోనా దాగిన వీరా రా 
చెఱలో పుట్టీ చెఱలో పెరిగిన మాయలమారీ రా 
ద్వారక వీడి నీరధి లోనా దాగిన వీరా రా 
చెఱలో పుట్టీ చెఱలో పెరిగిన మాయలమారీ రా
గొర్రెలు బర్రెలు మేపే వానికి రాజ్యము ఏలయ్యా
అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా 
గొర్రెలు బర్రెలు మేపే వానికి రాజ్యము ఏలయ్యా
అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా 

నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా

చరణం::2

అష్టమి పుట్టినవాడా ముదిపామును కొట్టిన వాడా 
అష్టమి పుట్టినవాడా ముదిపామును కొట్టిన వాడా 
మద్దుల గూల్చిన వాడా ముసలెద్దుని చంపిన వాడా
కొంటె కృష్ణా రారా గోపీ కృష్ణా రా రా అనాథ కృష్ణా 
కృష్ణా రా కృష్ణా రా రారారా 
కన్నెల దొంగ వెన్నల దొంగ దారుల దొంగ చీరల దొంగా 
అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా 

కల్లాకపటం కానరాని చల్లని స్వామీ రా 
ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామీ రా
కల్లాకపటం కానరాని చల్లని స్వామీ రా 
ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామీ రా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

చరణం::3

వైరినైన కరుణనేలు పరమాత్మా రా 
సభలో ద్రౌపదిని దయగనిన ప్రభూరా 
వైరినైన కరుణనేలు పరమాత్మా రా 
సభలో ద్రౌపదిని దయగనిన ప్రభూరా 

చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే
భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే
నిందజేయు నోటితోనే పొగడజేతు మీ మహిమ 
నిందజేయు నోటితోనే పొగడజేతు మీ మహిమ 
భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే

చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా