సంగీతం::రమేష్ నాయుడు
రచన::D.C. నారాయణరెడ్డి
గానం::రామకృష్ణ,M.రమేష్
తారాగణం::మురళిమోహన్,మోహన్ బాబు,ఈశ్వర రావు,జయసుధ,నిర్మల
పల్లవి::
బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
ఆ బండి మీద..ఆహ బండి మీద
ఆ బండి మీద పోదమా..ఓ సిన్నారి లచ్చు
ఆ బండి దాటి పోదమా..ఓ సిన్నారి లచ్చు
నువు బండి కట్టవద్దు..ఏ బండి దాటవద్దు
బండి కట్టవద్దు..ఏ బండి దాటవద్దు
నీ ఇంట వుంటె..నీ ఇంటవుంటే తప్పురో
ఓ కిలాడి కిట్టు..ఎవరైన చూస్తే ముప్పురో
ఓ కిలాడి కిట్టు..
చరణం::1
పొగబండి మీద తీసుకెలతాను
పట్నం సొగసంతా..దోసిట్లో పెడతాను
పొగబండి మీద తీసుకెలతాను
పట్నం సొగసంతా..దోసిట్లో పెడతాను
కాసుల పేరిచ్చి..వన్నె గాజులు తొడిగిచ్చి
కాసుల పేరిచ్చి..వన్నె గాజులు తొడిగిచ్చి
ఊరంతా సరదాగా ఊరేగిస్తాను
అహ..అహ..అహ..ఉహు..ఉహు..ఉహు
అహ..అహ..అహ..ఉహు..ఉహు..ఉహు
అటు తిప్పి ఇటు తిప్పి..ఆపైన కనుగప్పి
అటు తిప్పి ఇటు తిప్పి..ఆపైన కనుగప్పి
మటుమాయమౌతవొ..మదిలో వదిలేస్తవో
బండి నాకు వద్దు..ఒక బండి అసలు వద్దు
బండి నాకు వద్దు..ఒక బండి అసలు వద్దు
అహ నిన్ను నమ్మలేనురో..ఓ చలాకి చందు
నేనున్న ఊరు వదలనోయ్..ఓ చలాకి చందు
బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
ఆ బండి మీద..ఆహ బండి మీద
ఆ బండి మీద పోదమా..ఓ సిన్నారి లచ్చు
ఆ బండి దాటి పోదమా..ఓ సిన్నారి లచ్చు
చరణం::2
ఏటి గట్టు మీద..గూడు కడతాను
ఆ గూటి చుట్టు..మల్లెపూలు చుడతాను
ఏటి గట్టు మీద..గూడు కడతాను
ఆ గూటి చుట్టు..మల్లెపూలు చుడతాను
నురగల్లో నురుగులా..పువ్వుల్లో పువ్వులా
సందిట్లో నినుదాచ..సంబరపడతాను
అహ..అహ..అహ..ఉహు..ఉహు..ఉహు
అహ..అహ..అహ..ఉహు..ఉహు..ఉహు
ఏదొద్దు ఏమొద్దు..ఈ సరసాలిపుడొద్దు
ఏదొద్దు ఏమొద్దు..ఈ సరసాలిపుడొద్దు
మొదటతాళి కట్టరా..పిదప చేయి పట్టరా
బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
ఆ బండి మీద..ఆహ బండి మీద
ఆ బండి మీద పోదమా..ఓ సిన్నారి లచ్చు
ఆ బండి దాటి పోదమా..ఓ సిన్నారి లచ్చు