Monday, December 08, 2014

అమ్మా రాజీనామా--1991



సంగీతం::K.చక్రవర్తి
రచన::సిరివెన్నెల
గానం::ఏసుదాస్ 
Film Directed By::Dasari Narayana Rao
తారాగణం::శారద,కైకాల సత్యనారాయణ,బ్రహ్మానందం,సాయ్‌కుమార్,ప్రసాద్‌బాబు,బాబుమోహన్,కవిత,రజిత,తులసి.

పల్లవి::
    
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

ఆ అమ్మకే.. తెలియని.. చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

బొట్టు పెట్టి పూజ చేసి..గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే..గోవు తల్లే కోత కోత
బొట్టు పెట్టి పూజ చేసి  గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే గోవు తల్లే కోత కోత

విత్తు నాటి చెట్టు పెంచితే
చెట్టు పెరిగి పళ్ళు పంచితే
తిన్న తీపి మరిచిపోయి
చెట్టు కొట్టి కట్టెలమ్మితే

లోకమా ఇది న్యాయమా
లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

ఆకు చాటు పిందె ముద్దు..తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే..కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు

ఉగ్గు పోసి ఊసు నేర్పితే
చేయి పట్టి నడక నేర్పితే
పరుగు తీసి పారిపోతే
చేయి మార్చి చిందులేస్తే

లోకమా ఇది న్యాయమా
లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

అమ్మా రాజీనామా--1991



సంగీతం::K.చక్రవర్తి
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు
Film Directed By::Dasari Narayana Rao
తారాగణం::శారద,కైకాల సత్యనారాయణ,బ్రహ్మానందం,సాయ్‌కుమార్,ప్రసాద్‌బాబు,బాబుమోహన్,కవిత,రజిత,తులసి.

పల్లవి::
    
ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు

చరణం::1

పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు బార్యయై
బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా
నవ్వులు ఏడుపులు కలిపి దిగమింగి ఇంటినే గుడిచేసిన దేవతా
శలవిమ్మని అడిగితే 
ఇక శలవిమ్మని అడిగితే 
ఇది కనని వినని సంఘటన..అపూర్వ సంఘటన
ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై
నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి
బ్రతుకే హారతి ఇచ్చిన దేవతా
శలవిమ్మని అడిగితే...
ఇక శలవిమ్మని అడిగితే...
ఇది కనని వినని సంఘటన..అపూర్వ సంఘటన

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు