Saturday, October 04, 2014

దేవత--1982



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Raghavendra Rao
తారాగణం::శోభన్ బాబు,రావు గోపాలరావు,శ్రీదేవి,జయప్రద,రమాప్రభ,నగేష్ ,
మోహన్ బాబు,నిర్మల.

పల్లవి::

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో 
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో 

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో 
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో
కొండ కోన దాటాలంటే..మనమేం చేయాలి..ఓహో

చెప్పొద్దు చేసేయి..సందె పొద్దుల్లో
ఈ పొద్దు ముంచేయి ముద్దే ముద్దుల్లో

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో 
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో

చరణం::1

హ్హ హ్హ హ్హ హ్హ హ్హ..
చేయి చేయి కలవంగానే..చెరిగే పొలిమేరా..ఆ
కన్ను కన్ను నీలో నన్ను..కలిపేయ్ కసితీరా..ఆ

ప్రేమకు..పెళ్ళీడొస్తుంటే..పెదవులు ముద్దాడేస్తుంటే

కాలం ఆపు కాశేపూ..లోకం రాదు మనవైపు

మల్లెల పందిరి..అల్లరి వయసును..తొందర పెడుతుంటే

సన్నాయి మోర్గాలి..గుండెగొతుల్లో
తువ్వాయి..గెంతాలి..కొండ కోనల్లో

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో 
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో
కొండ కోన దాటాలంటే..మనమేం చేయాలి..ఓహో..ఓఓఓ

చెప్పొద్దు చేసేయి..సందె పొద్దుల్లో..హహ్హా
ఈ పొద్దు ముంచేయి ..ముద్దే ముద్దుల్లో

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో 
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో

చరణం::2

చూపు చూపు..కలవంగానే..పొడిచే చుక్కంటా..ఆ
చుక్కా..ఎన్నెల..పక్కే మనకు..మాపటి దిక్కంటా

ఇంకా దగ్గరకొస్తుంటే..ఏ..అందం అక్కరకొస్తుంటే..ఏ

అలలే ఆపు కాసేపూ..కలలే రేపు నీ చూపు

పొడిచే ఊహల ఊపిరి కబురులు..వడగాలౌతుంటే

వెచ్చంగ నిండాలి..పల్లె పాటల్లో..ఓ 

పచ్చంగ పండాలి..పైరు పంటలూ..ఓ


ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో 
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో
కొండ కోన దాటాలంటే..మనమేం చేయాలి..లోహో..ఓఓఓ

చెప్పొద్దు చేసేయి..సందె పొద్దుల్లో..హహ్హా
ఈ పొద్దు ముంచేయి ..ముద్దే ముద్దుల్లో

ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో 
కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో

Devata--1982
Music::Chakravarti
Lyrics::VeturiSundaraRamaMoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Raghavendra Rao
Cast::Sobhanbabu,Sreedevi,Jayaprada,RaoGopalRao,Mohanbabu,Ramaprabha,Rajabaabu.

::::::::::

enDaavaanaa neeLLaaDaayi..konDakOnallO 
kommaa remmaa..peLLaaDaayi..kOnaseemallO 

enDaavaanaa neeLLaaDaayi..konDakOnallO 
kommaa remmaa..peLLaaDaayi..kOnaseemallO
konDa kOna daaTaalanTE..manamEm chEyaali..OhO

cheppoddu chEsEyi..sande poddullO
ii poddu munchEyi muddE muddullO

enDaavaanaa neeLLaaDaayi..konDakOnallO 
kommaa remmaa..peLLaaDaayi..kOnaseemallO

:::1

hha hha hha hha hha..
chEyi chEyi kalavngaanE..cherigE polimEraa..aa
kannu kannu neelO nannu..kalipEy kasiteeraa..aa

prEmaku..peLLeeDostunTE..pedavulu muddaaDEstunTE

kaalam Apu kaaSEpuu..lOkam raadu manavaipu

mallela pandiri..allari vayasunu..tondara peDutunTE

sannaayi mOrgaali..gunDegotullO
tuvvaayi..gentaali..konDa kOnallO

enDaavaanaa neeLLaaDaayi..konDakOnallO 
kommaa remmaa..peLLaaDaayi..kOnaseemallO
konDa kOna daaTaalanTE..manamEm chEyaali..OhO..OOO

cheppoddu chEsEyi..sande poddullO..hahhaa
ii poddu munchEyi ..muddE muddullO

enDaavaanaa neeLLaaDaayi..konDakOnallO 
kommaa remmaa..peLLaaDaayi..kOnaseemallO

::::2

choopu choopu..kalavangaanE..poDichE chukkanTaa..aa
chukkaa..ennela..pakkE manaku..maapaTi dikkanTaa

inkaa daggarakostunTE..E..andam akkarakostunTE..E

alalE aapu kaasEpuu..kalalE rEpu nee choopu

poDichE Uhala Upari kaburulu..vaDagaaloutunTE

vechchanga ninDaali..palle paaTallO..O 

pachchanga panDaali..pairu panTaloo..O


enDaavaanaa neeLLaaDaayi..konDakOnallO 
kommaa remmaa..peLLaaDaayi..kOnaseemallO
konDa kOna daaTaalanTE..manamEm chEyaali..lOhO..OOO

cheppoddu chEsEyi..sande poddullO..hahhaa
ii poddu munchEyi ..muddE muddullO

enDaavaanaa neeLLaaDaayi..konDakOnallO 
kommaa remmaa..peLLaaDaayi..kOnaseemallO

కిలాడి బుల్లోడు--1972




సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి 
Directed By Ravi Raja Pinisetty 
తారాగణం::శోభన్‌బాబు,చంద్రకళ,సత్యనారాయణ,ముక్కామల,జ్యోతిలక్ష్మి,విజయభాను,రాజబాబు 

పల్లవి::

happy birthday to you
happy birthday to you 
happy birthday to you
Leela..happy birthday to you

ప్రతి పుట్టినరోజు..పండుగకాదు
ప్రతి రేయి..ఈ..వెన్నెలరాదు
వలచినవాడే..కలిసిననాడే
వనితకు..పండుగరోజు..ఊ
అదే అసలైన..పుట్టినరోజు

ప్రతి పుట్టినరోజు..పండుగకాదు
ప్రతి రేయి..వెన్నెలరాదు
వలచినవాడే..కలిసిననాడే
వనితకు..పండుగరోజు..ఊ
అదే అసలైన..పుట్టినరోజు

చరణం::1

చెలికన్నుల..లేఖలు చదువుకొనీ
తొలి వలపుల..బాసలు తెలుసుకొనీ
చెలికన్నుల..లేఖలు చదువుకొనీ
తొలి వలపుల..బాసలు తెలుసుకొనీ
వలచినవాడే...పిలచిననాడే
వలచినవాడే...పిలచిననాడే 
పెదవులు చిందును..మధురిమలు
మదిలో మ్రోగును..సరిగమలు 

ప్రతి పుట్టినరోజు..పండుగకాదు
ప్రతి రేయి..వెన్నెలరాదు
వలచినవాడే..కలిసిననాడే
వనితకు..పండుగరోజు..ఊ
అదే అసలైన..పుట్టినరోజు

చరణం::2

ఒకరేయి మురిపెం..చాలదనీ
ఒకనాటితో..అది తీరదనీ
ఒకరేయి మురిపెం..చాలదనీ
ఒకనాటితో..అది తీరదనీ
వలచినవాడే...ఎరిగిననాడే
వలచినవాడే...ఎరిగిననాడే 
తరగక నిలుచును..అనురాగం
కలలే పండును..కలకాలం

ప్రతి పుట్టినరోజు..పండుగకాదు
ప్రతి రేయి..వెన్నెలరాదు
వలచినవాడే..కలిసిననాడే
వనితకు..పండుగరోజు..ఊ
అదే అసలైన..పుట్టినరోజు

Kilaadi Bullodu--1972
Music::T.ChalapatiRao
Lyrics::D.C.NarayanaReddi
Singer::S.Janaki
Directed By Ravi Raja Pinisetty 
Cast::SobhanBabu,Chandrakala,Kaikala Satyanarayana,Mukkaamala,Jyotilakshmii,Vijayabhanu,RajaBabu.

:::::

Happy Birthday to you
Happy Birthday to you 
Happy Birthday to you
Leela..Happy Birthday to you

prati puTTinarOju..panDugakaadu
prati rEyii..vennelaraadu
valachinavaaDe..kalisinanaaDe
vanitaku..panDugarOju..uu
adE asalaina..puTTinarOjuu

prati puTTinarOju..panDugakaadu
prati rEyii..vennelaraadu
valachinavaaDe..kalisinanaaDe
vanitaku..panDugarOju..uu
adE asalaina..puTTinarOju

::::1

chelikannula..lEkhalu chaduvukonee
toli valapula..baasalu telusukonee
chelikannula..lEkhalu chaduvukonee
toli valapula..baasalu telusukonee
valachinavaaDE...pilachinanaaDE
valachinavaaDE...pilachinanaaDE 
pedavulu chindunu..madhurimalu
madilO mrOgunu..sarigamalu 

prati puTTinarOju..panDugakaadu
prati rEyii..vennelaraadu
valachinavaaDe..kalisinanaaDe
vanitaku..panDugarOju..uu
adE asalaina..puTTinarOju

::::2

okarEyi muripem..chaaladanee
okanaaTitO..adi teeradanee
okarEyi muripem..chaaladanee
okanaaTitO..adi teeradanee
valachinavaaDE...eriginanaaDE
valachinavaaDE...eriginanaaDE 
taragaka niluchunu..anuraagam
kalalE panDunu..kalakaalam

prati puTTinarOju..panDugakaadu
prati rEyii..vennelaraadu
valachinavaaDe..kalisinanaaDe
vanitaku..panDugarOju..uu
adE asalaina..puTTinarOju


శ్రీ గౌరీ మహత్యం--1956



సంగీతం::ఓగిరాల రామచంద్రరావు,, టి.వి.రాజు
రచన::మల్లాది
గానం::లీల 
Film Directed By::D.Yogaanand
తారాగణం::N.T. రామారావు, శ్రీరంజని,కాంతారావు,C.S.R..ఆంజనేయులు,రేలంగి వెంకట్రామయ్య,సూర్యకాంతం,వల్లూరి బాలకృష్ణ. 

పల్లవి::

అమ్మా నీవు..కన్నవారింట 
అల్లారు ముద్దుగ..వెలగే తీరు 
అమ్మా నీవు..కన్నవారింట 
అల్లారు ముద్దుగ..వెలగే తీరు 
వేలుపు కొమ్మలు..పూజించగ నీవు 
వేలుపు కొమ్మలు..పూజించగ నీవు 
చూపే ఠీవీ..చూసే చూపు 
చూడాలమ్మా..కనుపండువుగా 
చూసి తరించాలమ్మా అమ్మా 
చూడాలమ్మా..కనుపండువుగా 
చూసి..తరించాలమ్మా

చరణం::1

అమ్మా నీవు అంగజ వైరీ..ఈఈఈఈ
అమ్మా నీవు..అంగజ వైరీ 
కైలాసంలో..కొలువు తీరి 
అమ్మా నీవు..అంగజ వైరీ 
కైలాసంలో..కొలువు తీరి
లీలగ మేలుగా..లోకాలన్నీ 
లీలగ మేలుగా..లోకాలన్నీ
ఏలే..ఆ..చిద్విలాసం

చూడాలమ్మా..కనుపండువగా 
చూసి తరించాలమ్మా..అమ్మా
చూడాలమ్మా..కనుపండువగా 
చూసి..తరించాలమ్మా

చరణం::2

అమ్మా నీవు..హరుడూ కూడి 
హిమాలయం..పై శిఖరం పైన 
అమ్మా నీవు..హరుడూ కూడి 
హిమాలయం..పై శిఖరం పైన
మేనులొకటై..ఆదమరచి 
మేనులొకటై..ఆదమరచి 
వేడుకగా చేసే..నాట్యం 

చూడాలమ్మా..కనుపండువుగా

దత్తపుత్రుడు--1972



సంగీతం::T.చలపతిరావు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,నాగభూషణం,రామకృష్ణ,పద్మనాభం,కైకాల సత్యనారాయణ,అల్లురామలింగయ్య,వెన్నిరాడైనిర్మల,రమాప్రభ,సూర్యకాంతం. 

పల్లవి::

గౌరమ్మ తల్లికి బోనాలు..దుర్గమ్మ తల్లికి జేజేలు
ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ
గౌరమ్మ తల్లికి బోనాలు..దుర్గమ్మ తల్లికి జేజేలు

చరణం::1

అన్నం పెట్టే రైతుకే సున్నం రాసే పెద్దలు
గౌరమ్మ తల్లీ...ఇనుకో
నోటికి అందే...ముద్దనే 
తన్నుకుపోయే గద్దలు..ఆ ఆ ఆ ఆ
రోజు రోజుకు ముదురుతువుంటే
ఊళ్ళకు ఊళ్ళే ముంచుతు వుంటే
ఎరుగనట్టు చూస్తున్నావా..ఏమమ్మా తల్లీ             
గౌరమ్మ తల్లికి...బోనాలు
దుర్గమ్మ తల్లికి జేజేలు..ఆ ఆ ఆ ఆ

చరణం::2

చావు దెబ్బలు...తింటున్నా
పొగరు తగ్గని పొట్టేళ్ళు..ఇనుకోమ్మా ఇనుకో
దమ్మిడీకీ...కొరగాకున్నా
డాబులు చూసే సోగ్గాళ్ళు..ఆ ఆ ఆ ఆ
తిమ్మిరెక్కి తెగ తిరుగుతు వుంటే
తిమ్మిరెక్కి తెగ తిరుగుతు వుంటే 
ఎరగనట్టు చూస్తున్నావా ఏమమ్మా తల్లీ 
గౌరమ్మ తల్లికి బోనాలు
దుర్గమ్మ తల్లికి జేజేలు..ఆ ఆ ఆ ఆ

చరణం::3

పైరు పచ్చగా వుంటే
మా వూరు చల్లగా వుంటే  
పైరు పచ్చగా వుంటే
మా వూరు చల్లగా వుంటే 
బావ తోడుగా వుంటే
మా మరదలు నీడగ వుంటే..ఆ ఆ ఆ ఆ
ఆపై నీదయ మాపై వుంటే
రేపో మాపో మా పెళ్ళైతే
వచ్చే ఏటికి పాపనెత్తుకొని..వస్తాము తల్లీ   
గౌరమ్మ తల్లికి బోనాలు
దుర్గమ్మ తల్లికి జేజేలు..ఆ ఆ ఆ ఆ