Monday, May 14, 2007

రాజు వెడలె--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు 
తారాగణం::శోభన్ బాబు,జయసుధ,మురళీ మోహన్,జయప్రద,పండరీబాయి

పల్లవి::

రాజు వెడలె రభసకు 
రాజు వెడలె రవితేజము లలరగ
కుడి ఎడమల డాల్‌ కత్తులు మెరయగ 
రాబందుల గుండెలు దడదడలాడగ దడదడలాడగ  
దడదడలాడగ టట డాయ్ టడట డాయ్   

చరణం::1

చట్టం నేనే న్యాయం నేనే అట్టే వాగితే దేశం నాదే 
చట్టం నేనే న్యాయం నేనే  అట్టే వాగితే దేశం నాదే 
నేనంటే మీరేమనుకున్నారు మీకందరికి నేనుమ్మడి 
పేరు టట డాయ్ టడట డాయ్..రాజు వెడలె రభసకు  

చరణం::2

మేకవన్నె పులులందరిచేత ఆకులు మేయిస్తా 
ఆకలి మేసే పేద మేకను పులిగా మారుస్తా 
మేకవన్నె పులులందరిచేత ఆకులు మేయిస్తా 
ఆకలి మేసే పేద మేకను పులిగా మారుస్తా
 పని నెగ్గొట్టే సోమరిపోతుల భరతం పట్టిస్తా 
మనిషి చెమటకు మంచి మెదడుకు ఖరీదు పెంచేస్తా 
మనిషి చెమటకు మంచి మెదడుకు ఖరీదు పెంచేస్తా 
టట డాయ్ టడట డాయ్  
రాజు వెడలె రభసకు టట డాయ్ టడట డాయ్  

చరణం::3

గద్దెను డబ్బుతో కొనేవాళ్ళను గాడిద నెక్కిస్తా 
గాడిదనైనా నిజాయితీవుంటే గద్దెకు రప్పిస్తా 
గద్దెను డబ్బుతో కొనేవాళ్ళను గాడిద నెక్కిస్తా 
గాడిదనైనా నిజాయితీవుంటే గద్దెకు రప్పిస్తా 
కడుపున దాచిన నలుపంతా కక్కించేస్తా 
తలుపులు తాళాల్లేని యిళ్ళను కట్టించేస్తా  
తలుపులు తాళాల్లేని యిళ్ళను కట్టించేస్తా  
టట డాయ్ టడట డాయ్ 

టట డాయ్ రాజు వెడలె రభసకు  
టట డాయ్ టడట డాయ్ 
రాజు వెడలె రవితేజము లలరగ
కుడి ఎడమల డాల్‌ కత్తులు మెరయగ 
రాబందుల గుండెలు దడదడలాడగ దడదడలాడగ  
దడదడలాడగ దడదడలాడగ టట డాయ్ టడట డాయ్ 
రాజు వెడలె రభసకు టట డాయ్ టడట డాయ్