Thursday, September 09, 2010

జీవితం--1973


















సంగీతం::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,రామకృష్ణ
తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి

పల్లవి::

ఓఓఓఓ ఓహో..అహా..ఆఆ..అహా..ఒహోహో..ఆఆఆ అహా 
ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము
ఏ జన్మలోనో..ఏ జన్మలోనో..ఎన్నెన్ని జన్మలలోనో 
ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము

చరణం::1

నీలనీల గగనాల మేఘ..తల్పాలప్తెన 
పారిజాత సుమసౌరభాల..కెరటాలలోన 
నీచేయి నా పండువెన్నెల..దిండుగా 
నీ రూపమే నా గుండెలో..నిండగా   
కలలన్నీ వడబోసి..కలలన్నీ వడబోసి 
కౌగిలిలో చవిచూసి..
ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము

చరణం::2

నాటిజన్మలో ఓ చెలీ..నా చరణాలవ్రాలి ఎమన్నావు?  
జన్మజన్మలకు నా స్వామీ..నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి..మరి నేనేమన్నాను
ఓ సఖీ నా ఊపిరిలోనే..వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం..యీనాటి మనబంధం 
ఆనాటి అనుబంధం..యీనాటి మనబంధం
ఇక్కడే కలుసుకొన్నాము..ఎప్పుడో కలుసుకున్నాము 

జీవితం--1973




సంగీతం::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P. సుశీల
తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి

పల్లవి::

చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు  
అమ్మా నాన్నా దీవనలంది..వర్థిల్లాలి అల అల నవ్వు   
చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు          
హో..బలే బలే బాబూ..వరాల బాబు

చరణం::1

మీ అమ్మ మోము చూడ..మిసిమినవ్వు విరిసేను మిసిమినవ్వు విరిసేను
మీ నాన్న కళ్ళు చూడ..ముత్యాలై మెరిసేను ముత్యాలై మెరిసేను
ఆఆఆ..నవ్వుల పువ్వుగా..ఆఆఆ..కన్నుల దెవ్వెగా 
ఉదయించిన నిన్నుగని నా మనసే మురిసేను
మ్మ్ హూ అహా అహా ఓ హో హో మ్మ్ హూ మ్మ్ హూ         
చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు  
హో..బలే బలే బాబూ..వరాల బాబు  

చరణం::2
   
బాబూ నిన్నెత్తుకుంటే..పసిడికొండనౌతాను పసిడికొండనౌతాను
పాపా నిను హత్తుకుంటే..పాలవెల్లినౌతాను పాలవెల్లినౌతాను 
పాపా నిను హత్తుకుంటే..పాలవెల్లినౌతాను పాలవెల్లినౌతాను
మీ ఇద్దరూ వుండగా..నా ముద్దులు పండగా 
ఏ తల్లీ పొందలేని ఆనందం..పొందేను
మ్మ్ హూ అహా అహా ఓ హో హో మ్మ్ హూ మ్మ్ హూ         
చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు
అమ్మా నాన్నా దీవనలంది వర్థిల్లాలి..అల అల నవ్వు   
చిన్నారి ఓ బాబూ..బలే బలే బాబూ..వరాల బాబు 

జీవితం--1973




















సంగీతం::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,రామకృష్ణ
తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి

పల్లవి::

అమ్మో..అమ్మో..ఈవేళ మనసే అదోలా
కువకువమన్నది..ఎందుకో..ఎందుకో..ఓ
నిను నేను తాకితే..నన్ను నీవు తాకితే
అంతేనేమో అది..గిలిగింతేనేమో   
అంతేనేమో అది..ఒక వింతేనేమో 
అంతేనేమో అది..గిలిగింతేనేమో  
అంతేనేమో అది..ఒక వింతేనేమో 

చరణం::1

పండుమీదే రామచిలక పదేపదే వాలుతుంది 
ఎందుకో..ఓఓఓఓఓ..ఎందుకో
పండుమీదే రామచిలక పదేపదే వాలుతుంది
ఎందుకో..ఓఓఓఓఓ..ఎందుకో
పండులోనే రసముందని..గండుచిలక గమనించింది 
అందుకేనేమో రుచులను..అందుకోనేమో
అంతేనేమో అది..ఒక వింతేనేమో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
ఆహా..ఓహో..ఆహా..మ్మ్..ఆ ఆ ఆ ఆ అహ అహ అహ

చరణం::2

మన మేనులూ ఒకలాగే..ఏ..
పెనవేసుకుపోతున్నాయి..ఎందుకో..ఓఓఓఓ..ఎందుకో
మన మేనులూ ఒకలాగే..ఏఏఏఏఏ..
పెనవేసుకుపోతున్నాయి..ఎందుకో..ఓఓఓఓ..ఎందుకో 
ఇద్దరు ఒకరౌతారంటే..ఇదేనేమో..ఇదేనేమో
అంతెనేమో అది ఒక వింతేనేమో..అంతెనేమో అది మరి అంతేనేమో 
మ్మ్ హూ మ్మ్ హూ మ్మ్ హూ లలలాలలా మ్మ్ హూ హూ లలలలలాలలలా 

జీవన తరంగాలు--1973
























సంగీతం::J.V. రాఘవులు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్ 

పల్లవి::

ఉడతా ఉడతా హూత్
ఎక్కడికెళతావ్ హూత్ 
కొమ్మ మీది జాంపండు
కోసుకొస్తావా..బేబీకిస్తావా     
ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్
కొమ్మ మీది..జాంపండు
కోసుకొస్తావా..మా..బేబీకిస్తావా

చరణం::1
     
చిలకమ్మా..ఓ చిలకమ్మా
చెప్పేది కాస్తా  వినవమ్మా
చిలకమ్మా..ఓ చిలకమ్మా
చెప్పేది కాస్తా  వినవమ్మా
నీ పంచదార పలుకులన్నీ
బేబీకిస్తావా..మా..బేబీకిస్తావా
   
ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్
ఎక్కడికెళతావ్ హూత్    

చరణం::2

ఉరకలేసే ఓ జింకా
పరుగులాపవె నీవింకా
ఉరకలేసే ఓ జింకా
పరుగులాపవె నీవింకా
నువు నేర్చుకున్న పరుగులన్నీ  
నువు నేర్చుకున్న పరుగులన్నీ 
బేబీకిస్తావా..మా..బేబీకిస్తావా 
  
ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్ 
ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్    

చరణం::3
   
చిలకల్లారా..కోకిలలారా  
చెంగున దూకే..జింకల్లారా 
చిలకల్లారా..కోకిలలారా   
చెంగున దూకే..జింకల్లారా 
చిన్నరి..పాపలముందు 
మా చిన్నరి..పాపలముందు
మీరెంత..మీ జోరేంత  
మీరెంత..మీ జోరేంత  

ఉడతా ఉడతా హూత్ 
ఎక్కడికెళతావ్ హూత్  
ఉడతా ఉడతా హూత్
ఎక్కడికెళతావ్ హూత్

జీవన తరంగాలు--1973




సంగీతం::J.V.రాఘవులు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్ 

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
పుట్టిన రోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి 

పుట్టిన రోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి..ఎందరికి

చరణం::1

కలిమికేమి వలసినంత వున్నా
మనసు చెలిమి కొరకు..చేయి సాచుతుంది
ఆ మనసే ఎంత..పేదదైనా..aa
అనురాగపు సిరులు..పంచుతుంది
మమత కొరకు తపియించే..జీవనం
మమత కొరకు తపియించే..జీవనం
దైవ మందిరంలా..పరమ పావనం 

పుట్టిన రోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి..ఎందరికి

చరణం::2

పువ్వెందుకు తీగపై..పుడుతుంది ? 
జడలోనో గుడిలోనో..నిలవాలని!
ముత్యమేల కడలిలో..పుడుతుంది ? 
ముచ్చటైన హారంలో..మెరవాలని! 
ప్రతి మనిషీ తన జన్మకు..పరమార్థం తెలుసుకుని
తన కోసమే కాదు..పరుల కొరకు బతకాలి 
తన కోసమే కాదు..పరుల కొరకు బతకాలి
తానున్నా లేకున్నా..తానున్నా లేకున్నా..తన పేరు మిగాలి 
        
పుట్టిన రోజు పండగే అందరికీ
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి..ఎందరికి