Friday, February 22, 2008

మనుషులు మారాలి--1969గానం::SP. బాలు,P.సుశీల
రచన::C.నారాయణరెడ్డి
సంగీతం::KV.మహదేవన్

పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు
పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు
పాపాయి నవ్వినా పండగే వచ్చినా పేదల కన్నుల కన్నీరే..
పాపాయి నవ్వినా పండగే వచ్చినా పేదల కన్నుల కన్నీరే
నిరు పేదల కన్నుల కన్నీరే ...

!! పాపాయి నవ్వాలి పండగే రావాలి !!

కార్తీక మాసాన ఆకాశ మార్గాన కనువిందు చేసేను జాబిల్లి
కార్తీక మాసాన ఆకాశ మార్గాన కనువిందు చేసేను జాబిల్లి
ఆషాఢ మాసాన మేఘాల చెరలోన అల్లాడి పోయెను జాబిల్లి
ఆషాఢ మాసాన మేఘాల చెరలోన అల్లాడి పోయెను జాబిల్లి
అల్లాడి పోయెను జాబిల్లి
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో

!! పాపాయి నవ్వాలి పండగే రావాలి !!

వైశాఖ మాసాన భూదేవి సిగలోన మరుమల్లెచెండౌను జాబిల్లి
శ్రావణ మాసాన జడివాన ఒడిలోన కన్నీటి కడవౌను జాబిల్లి
కన్నీటి కడవౌను జాబిల్లి
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో
నిద్దురపో ...నిద్దురపో ముద్దుల పాపా నిద్దురపో

!! పాపాయి నవ్వాలి పండగే రావాలి !!

lotta champaldana