Monday, December 19, 2011

మేఘసందేశం--1982::కాఫీ::రాగం




సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వేటూరి
గానం::K.J.ఏసుదాస్ 

Film Directed By::DasariNarayana Rao
అక్కినేని నాగేశ్వరరావు,కొంగర జగ్గయ్య,
బాలమురళికృష్ణ,జయసుధ,జయప్రద,
సుభాషిని,సలీమ. 

పల్లవి:: 

కాఫీ::రాగం 

( పీలూ హిందుస్తానీ~కాఫీ కర్ణాటక దేవగాంధారి)

నవరససుమమాలికా..నా జీవనాధార నవరాగ మాలికా
నవరససుమమాలికా..
సని సరి గరి సరి మపని పనిస గరి
గరి సనిద దని దపమ గరి నిసగ
నవరససుమమాలికా..
సగమ గమప గమ గప మగసగ సని
పనిసగ సగమ గమప నిని పమప

త్యాగయ్య..క్షేత్రయ్య..అన్నమయ్య తెలుగింటిలోన వెలిగించిన
తెలుగింటిలోన వెలిగించిన..నాదసుధామయ..రసగీతికా
నవరససుమమాలికా..

చరణం::1

అందాలు అలలైన మందాకినీ..మందార మకరంద రసవాహినీ
ఆమె చరణాలు అరుణకిరణాలు..ఆమె నయనాలు నీల గగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన..నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక..
ఆ చిరునవ్వు లేత నెలవంక..దిగివచ్చెనేమో ఇలవంక!

నవరససుమమాలికా..నవరససుమమాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరససుమమాలికా..నవరససుమమాలికా.

చరణం::2

శృంగార రసరాజ కల్లోలినీ..కార్తీకపూర్ణేందు కలహారిణి
ఆమె అధరాలు ప్రణయమధురాలు..ఆమె చలనాలు శిల్పగమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు..మిగిలిన సుందర సుఖ తరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక..
ఆ కనుచూపు నాకు కడదాక..పిలుపైన లేని ప్రియలేఖ!

నవరససుమమాలికా..నవరససుమమాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరససుమమాలికా..నవరససుమమాలికా.


Megha Sandesam::1982
Music::Ramesh Nayudu
Lyrics::VeturiSundararaammoorti
Singer::K.J.Yesudas
Film Directed By::DasariNarayana Rao
Cast::AkkinEni NaageswaraRao,Konkara Jaggayya,
Baalamuralikrshna,Jayasudha,Jayaprada,Subhaasini,Saleema.

::::::::::::::::::::::::::::::

navarasasumamaalikaa..naa jeevanaadhaara navaraaga maalikaa
navarasasumamaalikaa..

sani sari gari sari mapani panisa gari
gari sanida dani dapama gari nisaga
navarasasumamaalikaa..
sagama gamapa gama gapa magasaga sani 
panisaga sagama gamapa nini pamapa

tyaagayya..kshEtrayya..annamayya teluginTilOna veliginchina
teluginTilOna veliginchina..naadasudhaamaya..rasageetikaa
navarasasumamaalikaa..

::::1

andaalu alalaina mandaakinii..mandaara makaranda rasavaahinii
Ame charaNaalu aruNakiraNaalu..Ame nayanaalu neela gaganaalu
aa javvanaalu naa janmaku dorikina..nairuti Rtupavanaalu
aa chirunavvu lEta nelavanka..
aa chirunavvu lEta nelavanka..digivachchenEmO ilavanka! 

navarasasumamaalikaa..navarasasumamaalikaa
naa jeevanaadhaara navaraaga maalikaa
navarasasumamaalikaa..navarasasumamaalikaa.

::::2

SRngaara rasaraaja kallOlinii..kaarteekapoorNEndu kalahaariNi 
Ame adharaalu praNayamadhuraalu..Ame chalanaalu Silpagamanaalu
aa darSanaalu naa janmaku..migilina sundara sukha taruNaalu
aa kanuchoopu naaku kaDadaaka..
aa kanuchoopu naaku kaDadaaka..pilupaina lEni priyalEkha!

navarasasumamaalikaa..navarasasumamaalikaa
naa jeevanaadhaara navaraaga maalikaa

navarasasumamaalikaa..navarasasumamaalikaa. 

నమ్మినబంటు--1960








సంగీతం::S. రాజేశ్వరరావు 
రచన::కోసరాజు
గానం::జిక్కి అండ్‌ పార్టీ

పల్లవి::

లక్ష్మి::ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ 
తెల తెలవారెను లేవండమ్మా 
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా..ఆఆఆఆఆఆ
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా

ఏ..కామాక్షీ ..ఓ..మీనాక్షీ 
ఓ..విశాలాక్షీ..ఓఓఓఓఓఓఓ 

ముద్దులు జిలికే ముచ్చట గొలిపే
ముగ్గులు తీరిచి దిద్దండమ్మా
ముద్దులు జిలికే ముచ్చట గొలిపే
ముగ్గులు తీరిచి దిద్దండమ్మా
చేయి దిరిగిన ఈ విద్యల్లో మన స్త్రీజాతికి సరి ఎవరమ్మా 

తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా

చరణం::1

ఓఓఓఓఓఓఓఓఓఓఓ..ఓ..ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ

రెక్కలు తటతట కొట్టుచు కొళ్ళూ
'కొక్కొరొకొ' యని కూసినవి...
రెక్కలు తటతట కొట్టుచు కొళ్ళూ
'కొక్కొరొకొ' యని కూసినవి...
అంబా అంటూ తల్లిపాలకై ఆవుదూడలల్లాడు చున్నవి 

తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా

చరణం::2

హరి! హరిలోరంగ ! హరే - హరే హరేలోరంగ హరే హరే
హరి! హరిలోరంగ ! హరే - హరే హరేలోరంగ హరే హరే
అందెలు మోయగా..బిందెలతో నీలాటి రేవునకు తరాలండి
నీలాటి రేవునకు తరాలండి...
అందెలు మోయగా..బిందెలతో నీలాటి రేవునకు తరాలండి
 నీలాటి రేవునకు తరాలండి...
పందెం వేసి నేనూ..నేనని..పనిపాటలకై మరలండి 

తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా

చరణం::3

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
తూరుపు దిక్కున బాల సూర్యుడు తొంగి తొంగి చూసేనమ్మ 
దొంగచూపు చూసేనమ్మా
తూరుపు దిక్కున బాల సూర్యుడు తొంగి తొంగి చూసేనమ్మ 
దొంగచూపు చూసేనమ్మా! కలవరపాటున దాగియున్న
ఆ కథయేమో అడగండమ్మా 

తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా
అ అ అ ఆఆఆఅ 
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా

నమ్మినబంటు--1960::మోహన::రాగం







సంగీతం::S. రాజేశ్వరరావు 
రచన::కోసరాజు
గానం::Pసుశీల 

మోహన::రాగం

పల్లవి::

లక్ష్మి::చెంగు చెంగునా!!!...
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా 
చెంగు చెంగునా....
చెంగు చెంగునా గంతులు వేయండి

చరణం:;1

రంగురంగుల మోపురాలతో..రంకెలు వేసే రోజెపుడో
చెకచెకమంటూ అంగలువేసీ..నేలనుదున్నే అదనెపుడో
కూలిపోయినా సంసారానికి..గోగాకింతా పెట్టే దెపుడో
ఓ..ఓఓఓఓఓఓఓఓఓఓ.. ఓ..ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
కూలిపోయినా సంసారానికి..గోగాకింతా పెట్టే దెపుడో
ఆశలన్ని మీమీద బెట్టుకొని..తిరిగే మా వెత లణగే దెపుడో 

చెంగు చెంగునా గంతులు వేయండి

చరణం::2

పంచభక్ష్య పరమాన్నం తెమ్మని
బంతిని గూర్చుని అలగరుగా..
పట్టుపరుపులను వేయించండని..పట్టుబట్టి వేధించరుగా
గుప్పెడు గడ్డితో గ్రుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ
జాలిలేని నరపశువుల కన్న..మీరే మేలనిపిస్తారూ 

చెంగు చెంగునా గంతులు వేయండి

చరణం::3

పగలనకుండా రేయినకుండా..పరోపకారం చేస్తారూ
వెన్నుగాచి మీ యజమానులపై విశ్వాసం జూపిస్తారూ
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
మా ఇలవేల్పులు మీరు లేనిదే..మానవజాతికి బ్రతుకే లేదు

చెంగు చెంగునా 
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా 
చెంగు చెంగునా గంతులు వేయండి

కొండవీటి సింహం--1981




సంగీత్రం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed by::K.Raghavendra Rao 
తారాగణం::N.T.రామారావు,జయంతి,శ్రీదేవి కపూర్,మోహన్‌బాబు,గీత,రావ్‌గోపాల్‌రావ్,

కైకాల.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నాగేష్,చలపతిరావ్,సుత్తివీరభద్రరావ్,జగ్గారావ్. 

పల్లవి::

NTR::
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా

జయంతి::
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా

చరణం::1

NTR::
ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం

జయంతి::
అ గీతం పలికిన నా జీవితమే సంగీతం
సంగమించు ప్రణయంలొ ఉదయరాగ సిందూరం

NTR::
ప్రేమే పెన్నిధిగా

జయంతి::
దైవం సన్నిధిగా
సమశ్రుతిలో జతకలిసి

జయంతి::
ప్రియలయలొ అదమరచి
అనురాగాలు పలికించు వేళ

చరణం::2

జయంతి::
అందమైన మన యిల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు

NTR::
తెలవారిన సంజెలలొ తేనెనీటి వడగళ్ళు
జ్ఞాపకాల నీడలలొ కరుగుతున్న కన్నీళ్ళు

జయంతి::
ఒకటే ఊపిరిగా

NTR::కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి

NTR::
మమతలనే మధువొలికె
శుభయోగాలు తిలకించు వేళ

జయంతి::
ఈ మధుమాసంలో

NTE::ఈ దరహాసంలో

జయంతి::మదిలో

NTR::కదిలి

ఇద్దరు::పలికే కోయిల..బ్రతుకే హాయిగా
ఆ అహహా అహ హా హహహా..ఓ హొహొహో..హో..