Monday, September 13, 2010

మేము మనుషులమే--1973




సంగీతం::M S విశ్వనాథన్
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::కృష్ణంరాజు,జమున, చంద్రమోహన్,జగ్గయ్య,సత్యనారాయణ,
జ్యొతిలక్ష్మి,అల్లు రామలింగయ్య

పల్లవి::

సిగ్గోలే సిగ్గు సిగ్గు..సెప్పుకుంటే సెడ్డ సిగ్గు
ఆ..ఓ..షషషషషషా 
సిగ్గోలే సిగ్గు సిగ్గు..సెప్పుకుంటే సెడ్డ సిగ్గు
కిందసూసి పైనసూసి ముందుసూసి యనకసూసి కన్నుగీటి
మందిలోన సందుసూసి..బుగ్గమీద ముద్దరేసి ఎల్లాడే
కిందసూసి పైనసూసి ముందుసూసి యనకసూసి కన్నుగీటి
మందిలోన సందుసూసి..బుగ్గమీద ముద్దరేసి ఎల్లాడే

చరణం::1

లాలరీ లాలరీ
తప్పునాది కాదయ్యో..నేనొప్పుకోనూ లేదయ్యో
ఓర ఓరకెల్లి నేను ఒంటిగా..నిలుసుంటే సచ్చినోడూ
ఓర ఓరకెల్లి నేను ఒంటిగా..నిలుసుంటే సచ్చినోడూ
వచ్చి వచ్చి వళ్ళు వళ్ళు తగిలించి ఎచ్చచేసిపోయాడే
సిగ్గోలే సిగ్గు సిగ్గు..సెప్పుకుంటే సెడ్డ సిగ్గు

చరణం::2

గుంపువదలి వచ్చాను..నా గుడిసె తెరిసీ వుంచాను
బొట్టుపెట్టి కాటుకెట్టి కొప్పెట్టి పూలెట్టి కూసున్నా
బొట్టుపెట్టి కాటుకెట్టి కొప్పెట్టి పూలెట్టి కూసున్నా
మీదికేసి సూసి సూసి యిసుగేసి సాపేసి తొంగున్నా
సిగ్గోలే సిగ్గు సిగ్గు సెప్పుకుంటే సెడ్డ సిగ్గు

చరణం::3

రాతిరంతా మేల్కొన్నా నా రాతయింతేననుకున్నా
సాపమీద దొర్లి దొర్లి సల్లంగ నిదరొస్తే సోగ్గాడూ
సాపమీద దొర్లి దొర్లి సల్లంగ నిదరొస్తే సోగ్గాడూ
పిలిసినట్టు తోసి నేను..ఉలికిపడిలేసి సూస్తే ఉత్తిదేనే
ఉలికిపడిలేసి సూస్తే ఉత్తిదేనే

సిగ్గోలే సిగ్గు సిగ్గు సెప్పుకుంటే సెడ్డ సిగ్గు 
ఆ..ఓ..షషషషషషా 
కిందసూసి పైనసూసి ముందుసూసి యనకసూసి కన్నుగీటి
మందిలోన సందుసూసి..బుగ్గమీద ముద్దరేసి ఎల్లాడే

శివరంజని--1978::రాగం:::కల్యాణి





సంగీతం::రమేష్ నాయుడు
రచన::C.నారాయణ రెడ్డి
డైరెక్టర్::నారాయణ రావ్ దాసరి
ప్రోడ్యుసర్::దాసరి పద్మ
గానం::P.సుశీల
Actors::Jayasudha,Mohan Babu


రాగం:::కల్యాణి
(యమున్ భూప్ -- మోహనకల్యాణి)



జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా

ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీవళ్ళు జాగరతే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీవళ్ళు జాగరతే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా

ముస్తాబు అయ్యావు తుమ్మెదా
కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా
మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా
ఆ మాలెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా

మెత్తన్ని పరుపూలు తుమ్మెదా
గుత్తంగ కుట్టావు తుమ్మెదా
వత్తైన పరుపుపై తుమ్మెదా
అత్తర్లు చల్లావు తుమ్మెదా
పక్క వేసి ఉంచావు తుమ్మెదా
ఆ పక్కెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీవళ్ళు జాగరతే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికొసమే తుమ్మెదా

శివరంజని--1978::శివరంజని::రాగం







సంగీతం::రమేష్ నాయుడు
రచన::C.నారాయణ రెడ్డి
డైరెక్టర్::నారాయణ రావ్ దాసరి
ప్రోడ్యుసర్::దాసరి పద్మ
గానం::S.P.బాలు
Actors::Jayasudha,Mohan Babu


అభినవ తారవో...నా...అభిమాన తారవో...
అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుళ మధుకర శింజాల
సుమసరశింజినీ...శివరంజని శివరంజనీ...

అది దరహాసమా మరి మధురమాసమా
అది దరహాసమా మరి మధురమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చెరణమ్ములా శశికిరణమ్ములా..2
నా తరుణభావన హరినమ్ములా

అభినవ తారవో...నా...అభిమాన తారవో...
అభినవ తారవో...శివరంజని శివరంజనీ...

ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడినచాలు.....
ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రభందాలు

అభినవ తారవో...నా...అభిమాన తారవో...
అభినవ తారవో...శివరంజని శివరంజనీ..

నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన
నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
వీరమా...నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ
ఆ................ఆ.....
నె ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తడను..నీ ప్రియభక్తడను

అభినవ తారవో...నా...అభిమాన తారవో...
అభినవ తారవో...శివరంజని శివరంజనీ..