Wednesday, June 20, 2007

లక్షాధికారి--1963




సంగీతం::T.చలపతి రావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P. సుశీల

పల్లవి:

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక..వదలను..వదలను..వదలనులే

చరణం::1

నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది
నీ నున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది
నీ ఓరచూపులను గని..బంగారు తూపులనుకొని
నీ ఓరచూపులను గని..బంగారు తూపులనుకొని మురిసిపోతానూ
పరవసించేనూ..నీ కన్నులు రమ్మని పిలిచేదాక
కదలను..కదలను..కదలనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక..వదలను..వదలను..వదలనులే

చరణం::2

పొదలలోన వున్నా పూల గంధాలు దాగలేవు
మట్టిలోన వున్నా..మణుల అందాలు మాసిపోవు
నీలోని రూపమును గని..రతనాల దీపమనుకొని
నీలోని రూపమును గని..దీపమనుకొని
మదిని నిలిపేను..జగము మరచేనూ
నీ పెదవుల నవ్వులు విరిసే దాక
విడువను..విడువను..విడువనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక..వదలను..వదలను..వదలనులే

లక్షాధికారి--1963




సంగీతం::T. చలపతి రావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల ,P. సుశీల

మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది
మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు
ఔనా..ఆ..మ్మ్ మ్మ్

తోటలో ఏముంది నా మాటలో ఏముంది నా మాటలో ఏముంది
తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు నీ మాటలో తేనియలు
ఔనా..ఆ..మ్మ్ మ్మ్

తేనెలో ఏముంది నా మేనిలో ఏముంది నా మేనిలో ఏముంది
తేనెలో బంగారం నీ మేనిలో సింగారం నీ మేనిలో సింగారం

ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది నా పాటలో ఏముంది
ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమలు నీ పాటలో సరిగమలు

నేనులో ఏముంది నీవులో ఏముంది నీవులో ఏముంది
నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది

నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది
నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది
ఆ..ఆ..మ్మ్..మ్మ్

ఆరాధన--1962


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::నర్ల చిరంజీవి
గానం::P.సుశీల
నీ చెలిమీ నేడే కోరితినీ
ఈ క్షణమే ఆశవీడితిని...
నీ చెలిమీ..

పూవువలే ప్రేమ దాచితినీ
పూజకునే నోచనైతినీ....
నీ చెలిమీ నేడే కోరితినీ
ఈ క్షణమే ఆశవీడితిని...నీ చెలిమీ..

మనసు తెలిసిన మన్నింతువని
తీయని ఊహలతేలితినేనే....
మనసు తెలిసిన మన్నింతువని
తీయని ఊహలతేలితినేనే
పరుల సొమ్మైపోయినావని
నలిగె నా మనసే...
నీ చెలిమీ నేడే కోరితినీ
ఈ క్షణమే ఆశవీడితిని...నీ చెలిమీ..

చెదరిపోయిన హౄదయములోనా
పదిలపరిచిన మమతలు నీకే...
చెదరిపోయిన హౄదయములోనా
పదిలపరిచిన మమతలు నీకే
భారమైన దూరమైన
బ్రతుకు నీ కొరకే...
నీ చెలిమీ నేడే కోరితినీ
ఈ క్షణమే ఆశవీడితిని...
నీ చెలిమీ..

ఆరాధన--1962::శంకరాభరణం::రాగం


సంగీతం: పెండ్యాల
గానం: ఘంటసాల
రచన: శ్రీ శ్రీ

రాగం::శంకరాభరణం

నా హౄదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హౄదయంలో నిదురించే చెలీ


నీ కన్నులలోనా...
దాగెనులే వెన్నెల సోన
కన్నులలోనా....
దాగెనులే వెన్నెల సోన
చకోరమై నిను వరించి
అనుసరించినానే కలవరించినానే
నా హౄదయంలో నిదురించే చెలీ

నా గానములో నీవే
ప్రాణముగ పులకరించినావే (2)
పల్లవిగా పలుకరించ రావే (2)
నీ వెచ్చని నీడా....
వెలసెను నా వలపుల మేడా
వెచ్చని నీడా...
వెలసెను నా వలపుల మేడా
నివాళితో చేయిసాచి ఎదురు చూచినానే
నిదురకాచినానే..
నా హృదయంలో నిదురించే చెలీ !!

ఆరాధన--1962


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల , S. జానకి

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థము శాదీ

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థము శాదీ
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి
ఆహా . . .ఓహో . . .
ప్రేమించుకున్న పెళ్ళిలోనే హాయి ఉందోయీ
పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమౌతుందోయ్
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ
ఆ మాటకే నా గుండెలు గెంతేను త్రుళ్లి త్రుళ్లి

!!ఇంగ్లీషులోన !!

న్యూఢిల్లినుండి సింగపూరు వెళ్ళిపోదాము
న్యూయార్కులోన డాన్సుచేస్తూ ఉండిపోదాము
కోశావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు (2)
రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు

!! ఇంగ్లీషులోన !!

పొంగేను సోడాగ్యాసు లాగా నేడు నీ మనసు
మా నాన్న ముఖము చూడగానే నువ్వు సైలెన్స్సు
తెస్తానులే లైసెన్స్సు కడదాము ప్రేమ హౌసు
నీమాటలే నిజమైనచో మన లైఫు నైసు నైసు

!! ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థము శాదీ
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి
ఆహా . . .ఓహో . . .ఆహా . . .ఓహో . . . !!

ఆరాధన--1962


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::నర్ల చిరంజీవి
ప్రోడుసర్::జగపతి పిక్చర్స్
డైరెక్టర్:: V.మధుసూదన్ రావ్

వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా
వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈ రేయీ
వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా

వాడని పూవుల తావితో కదలాదే
సుందర వసంతమీ కాలము
కదలాదే సుందర వసంతమీ కాలము
చెలి జోలగ పాడే వినోద రాగాలలో
చెలి జోలగ పాడే వినోద రాగాలలో
తేలేడి కలలా సుఖాలలో నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈ రేయీ
వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా

భానుని వీడని ఛాయగ
నీ భావములోనే తరింతునోయీ సఖా
నీ భావములోనే తరింతునోయీ సఖా
నీ సేవలలోనే తరింతునోయీ సదా
నీ సేవలలోనే తరింతునోయీ సదా
నీ యదలోనే వసింతులే నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈరేయీ

వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈరేయీ