సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::కోవెల శాంత
తారాగణం::P.భానుమతి,గుమ్మడి,చంద్రమోహన్,పద్మనాభం,రమాప్రభ,ప్రమీల,రామకృష్ణ,రాజబాబు.
ఆనందభైరవి::రాగం
పల్లవి::
చిలకమ్మపాటా..కాకమ్మ నోటా
వింటావా గోరింకా..ఆ..విని చూస్తావా నా వంకా..అ
చిలకమ్మపాటా..కాకమ్మ నోటా
వింటావా గోరింకా..ఆ..విని చూస్తావా నా వంకా..అ
చరణం::1
కాకమ్మ నోటికి..యీ దొండపండూ..ఊ
కాకమ్మ నోటికి..యీ దొండపండూ
ఏ బాబు చేతికో..ఆ పూలచెండూ
ఆ బ్రహ్మ చేసిన..తిరకాసు చూడూ
ఏమేమో చేస్తాడూ..తను ఏదేదో రాస్తాడూ
చిలకమ్మపాటా..కాకమ్మ నోటా
వింటావా గోరింకా..ఆ..విని చూస్తావా నా వంకా..ఆ
చరణం::2
నీకన్న నాకు..వేరెవరు లేరూ..ఊ
నీకన్న నాకు..వేరెవరు లేరూ
కాదన్నావంటే..కథ తారుమారూ
ఆ బ్రహ్మచేసిన..తిరకాసు చూడూ
ఏమేమో చేస్తాడూ తను ఎదేదో రాస్తాడూ
చిలకమ్మపాటా...కాకమ్మ నోటా
వింటావా గోరింకా..ఆ..విని చూస్తావా నా వంకా..ఆ
సంగీతం::సత్యం
రచన::కోసరాజురాఘవయ్య
గానం::S.జానకి
తారాగణం::N.T.రామారావ్,మంజుళ,నాగభూషణం,పద్మనాభం,పండరిబాయ్,కృష్ణంరాజు,లీలారాణి.
పల్లవి::
ఏయ్ ఏమి కావాలోయ్..నీకు ఏది కావాలోయ్
ఏమి కావాలోయ్ నీకు...ఏది కావాలోయ్
మనసుకు హాయి కావాలా..మత్తులో చిత్తు చెయ్యాలా
ఏమి కావాలోయ్ నీకు...ఏది కావాలోయ్
చరణం::1
ఇంద్రుడు నిత్యము రంభా ఊర్వశి నాట్యంతో గుమ్మయ్యాడోయ్
ఇంద్రుడు నిత్యము రంభా ఊర్వశి నాట్యంతో గుమ్మయ్యాడోయ్
చంద్రుడు సైతం తార చూపులతో గురువుకునామం పెట్టాడోయ్
హ్హా..చంద్రుడు సైతం తార చూపులతో గురువుకునామం పెట్టాడోయ్
కాంతదాసులూ కానివారూ ఏ యుగమందున ఎవ్వరూ లేరూ
ఏమి కావాలోయ్ నీకు...ఏది కావాలోయ్
మనసుకు హాయి కావాలా..మత్తులో చిత్తు చెయ్యాలా
ఏమి కావాలోయ్ నీకు...ఏది కావాలోయ్
చరణం::2
మహా మహా మునులందరు గూడ
మగువల పొందు కోరారోయ్
తపస్సు..గంగలోొ కలిపారోయ్
మహా మహా మునులందరు గూడ
మగువల పొందు...కోరారోయ్
మగువల పొందు...కోరారోయ్
తపస్సు..గంగలోొ కలిపారోయ్
ఇనప కచ్చడాల్..విప్పారోయ్
ఇదే స్వర్గమని..చెప్పారోయ్
ఏమి కావాలోయ్ నీకు...ఏది కావాలోయ్
మనసుకు హాయి కావాలా..మత్తులో చిత్తు చెయ్యాలా
ఏమి కావాలోయ్ నీకు...ఏది కావాలోయ్