Saturday, May 22, 2010

దేవుడు చేసిన బొమ్మలు--1976



సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,చలం,జయసుధ,ప్రభ,కల్పన,సాక్షి రంగారావు.

పల్లవి::

డబ్బులు బొమ్మలు బొమ్మలు డబ్బులు 
ఇవి మనిషి చేసిన బొమ్మలు మరియివో
యివి నువ్వు..చేసిన బొమ్మలు
బొమ్మలు ఈ మనుషులు అంతా బొమ్మలు
ఆ..దేవుడు చేసిన..బొమ్మలు  
పసితనంలో తల్లి తీపి పడుచుతనంలో ప్రేమ తీపి  
పెరిగేకొద్దీ పెళ్లితీపి చచ్చేదాకా చావని తీపి ఎవరికి..ఎవరికి 
ఈ బొమ్మలకే ఏం బొమ్మలు..పిండి బొమ్మలు పిచ్చి బొమ్మలు
బొమ్మలు ఈ మనుషులు.. అంతా బొమ్మలు ఆ దేవుడు చేసిన బొమ్మలు 

చరణం::1

మూడు ముళ్లు వేయిస్తావు వేసిన ముళ్ళు విడదీస్తావు 
ముద్దు మొజూ పెంచేస్తావు మొగ్గలోనే తుంచేస్తావు
అయినా నీ చుట్టే తిరుగుతుంటాయి ఏమిటి
మట్టి బొమ్మలు..ఈ మనిషి బొమ్మలు
బొమ్మలు ఈ మనుషులు..అంతా బొమ్మలు
ఆ..దేవుడు చేసిన..బొమ్మలు  

చరణం::2

దీపమున్నా వెలుగేలేదు వెలుగువున్నా విలువేలేదు 
మనువువున్నా మనసు లేదు మనసేవున్నా మమతేలేదు
పాపం మూగబొమ్మలు ముష్టి బొమ్మలు సృష్టి పొలంలో దిష్టి బొమ్మలు అంతే
బొమ్మలు ఈ మనుషులు..అంతా బొమ్మలు..ఆ దేవుడు చేసిన బొమ్మలు

అల్లుడొచ్చాడు--1976



సంగీతం::T.చలపతిరావు
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల   
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య

పల్లవి::

ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంపతెగ వాడిపోతే ఎంతో ఎంతో నష్టం
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంపతెగ వాడిపోతే ఎంతో ఎంతో నష్టం
వద్దు వద్దు వద్దు వయస్సు పోనీయొద్దు
వద్దు వద్దు వద్దు వయస్సు పోనీయొద్దు
ఇంత వాలుగా నీకు నాకు మళ్ళీ మళ్ళీ దొరకదు
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం

చరణం::1

కోడె వయసుకున్నవీ కొన్ని గుర్తులు 
ఎన్నో కొత్తగుర్తులు..ఏమిటవి 
కోర్కె పుట్టేది..గుండె చేదిరేది
తోడు వెతికేది..దుడుకు పెరిగేది
ఆ వయసుకే వస్తాయి కొంటెచేష్టలు 
ఎన్నో కొంటెచేష్టలు..ఏమిటవి 
కళ్ళు కలిపేది నీళ్ళు నమిలేది
వొళ్ళు మరిచేది తల్లడిల్లెది
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంపతెగ వాడిపోతే ఎంతో ఎంతో నష్టం
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం

చరణం::2

ప్రేమకే వస్తాయి..పిచ్చి ఊహలు 
ఎన్నో పిచ్చి ఊహలు ఏమిటవి 
మింటి చుక్కల్లో మెరుపు తీగల్లో
మింటి చుక్కల్లో మెరుపు తీగల్లో
కంటిపాపల్లో కలలమాపుల్లో
ఆ ఊహలకోస్తాయి రూపురేఖలు 
ఎన్నో రూపురేఖలు ఏమిటవి 
జగమే మనదని సగమూ సగమని
జన్మజన్మలకు మనదే జంటని
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం
దీన్దుంపతెగ వాడిపోతే ఎంతో ఎంతో నష్టం
ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం

భలే దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::కృష్ణ,నాగభూషణం,పద్మనాభం,మంజుల,జయమాలిని,మోహన్‌బాబు,త్యాగరాజు,మిక్కిలినేని

పల్లవి::

వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు
ప్రేమించినాడు పెళ్ళాడుతాడు
దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు

చరణం::1

ఇన్నాళ్ళవలె కాదు పెళ్ళంటే
మనువాడ వచ్చును మనసుంటే
మనువాడ వచ్చును మనసుంటే
అమ్మాయికి అబ్బాయి నచ్చాలి
అయినోళ్ళు వాళ్ళని మెచ్చాలి
అయినోళ్ళు వాళ్ళని మెచ్చాలి
బాజాలు వద్దు బాకాలు వద్దు
కట్నాలు కానుకలు అసలే వద్దు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు
ప్రేమించినాడు పెళ్ళాడుతాడు
దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు

చరణం::2

దానాల్లో గొప్పది కన్యదానం అది
చేసినోళ్ళకొస్తుంది ఎంతో పుణ్యం
చేసినోళ్ళకొస్తుంది ఎంతో పుణ్యం
ప్రేమించుకున్నోళ్ళ పెళ్ళాపితే
అంతకన్న ఉండదులే మహా పాపం
అంతకన్న ఉండదులే మహా పాపం 
అవునంటే అందరికి ఆనందం
కాదన్నా ఆగదులే కల్యాణం
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు
ప్రేమించినాడు పెళ్ళాడుతాడు
దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు
వచ్చాడు చూడు వరసైనవాడు
ఎగరేసుకు పోతాడు మొనగాడు

ప్రేమ బంధం--1976




సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరి
గానం::S.P.బాలు.P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,వాణిశ్రీ,సత్యనారాయణ,రావికొండలరావు,జయమాలిని,జానకి

పల్లవి::

అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా 
అయ్యో రామా చెపితే వినడమ్మా  
చోటుకాని చోట అల్లరి చేటంటే వినడు 
ఒదిగి వుండమంటే ఎదలో ఎదిగి ఎదిగి పోతాడు  
అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా 
అయ్యోరామా చెపితే వినడమ్మా  
  
చరణం::1

నేనడిగానా ఆ చోటు..ఆహా ఆహా ఆహా 
నీదేనమ్మ పొరపాటు పాపం 
దాచుకున్న సొగసు చూసి దాగని 
నీ వయసు చూసి..ఆ ఆ ఆ 
ఛీ పాడు అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా 
అయ్యోరామా చెపితే వినడమ్మా  

చరణం::2

తీపి తీపిగా పెదవులు తడిపిందెవరమ్మా
తేనె దొంగకు ఏ పూవో తేరగా దొరికిందమ్మా
చెక్కిలిపై గాటేమిటి..చిలకమ్మా  
పోతుటీగ కాటేసింది..ఓయమ్మా 
చిన్నగాటుకే చెదిరిపోతే ఎట్టాగమ్మా రేపెట్టాగమ్మా
తేనెపట్టుకు చేరినప్పుడు చెబుతానమ్మా 
అప్పుడే చెబుతానమ్మా..ఇప్పుడే చెప్పాలి
అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా 
ఊహు..ఊహు..ఆహా..అబ్బబ్బ