Thursday, May 16, 2013

భలే పాప--1971



సంగీతం::R.సుదర్శనం
రచన::దాశరథి
గానం::P.సుశీల 
తారాగణం::S.V.రంగారావు,K.R.విజయ,బేబి రాణి,జ్యోతిలక్ష్మి,పద్మనాభం,రేలంగి. 

పల్లవి::

అందాలా జలపాతం చిందించు జల్లులలో ఆనాడు
ఒంటరిగా జలకాలాడానూ పులకించిపోయానూ

చరణం::1

పొంగారు యదమీది కొంగునే తీసానూ 
పొంగారు యదమీది కొంగునే తీసానూ  
చాటుగా గమనించే కళ్ళనే చూసానూ 
నా ఒళ్ళు జల్లనగా నన్ను నే మరిచానూ
నా ఒళ్ళు జల్లనగా నన్ను నే మరిచానూ
అందాలా జలపాతం చిందించు జల్లులలో ఆనాడు 
ఒంటరిగా జలకాలాడానూ పులకించిపోయానూ

చరణం::2

శ్రీదేవి కోవెలలో సిందూర తిలకమునే 
శ్రీదేవి కోవెలలో సిందూర తిలకమునే 
దీపాల కాంతులలో దిద్దుకొను సమయానా
ఆ కళ్ళే చూసానూ ఆశలో తేలానూ
ఆ కళ్ళే చూసానూ ఆశలో తేలానూ

చరణం::3

మోజుతో రతనాలా గాజులే కొనువేళా
మోజుతో రతనాలా గాజులే కొనువేళా
చేతిలో చైవేసీ చెంతకే చేరాడూ 
అమ్మమ్మ నా మేనూ చెమ్మగిల్లి పోయిందీ
ఓయమ్మొ నా వయసూ ఉరకలె వేసిందీ

చరణం::4

సిరిమల్లె పూలన్నీ చేజారిపొయాయి
పరుగులే తీసాయీ పాదాల వాలాయీ 
మా కళ్ళు కలిశాయీ మనసులే విరిసాయీ
మా కళ్ళు కలిశాయీ మనసులే విరిసాయీ

చిక్కని చీకటి..చిక్కని చీకటిలో చుక్కల్ల వెలుగులలో
చెక్కిళ్ళు ఏకమై మక్కువలు పెరిగాయీ
నా స్వామి కౌగిలిలో నే కరిగిపోయానూ
నన్ను నే కానుకగా అర్పించుకున్నానూ
అందాలా జలపాతం చిందించు జల్లులలో 
ఆనాడు ఒంటరిగా జలకాలాడానూ పులకించిపోయానూ

భలే పాప--1971

సంగీతం::R.సుదర్శనం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల 
తారాగణం::S.V.రంగారావు,K.R.విజయ,బేబి రాణి,జ్యోతిలక్ష్మి,పద్మనాభం,రేలంగి. 

పల్లవి::

అమ్మల్లారా...అయ్యల్లారా 
అమ్మల్లారా..ఓ అయ్యల్లారా 
మాఅమ్మనెవరైనా చూశారా చూశారా

చరణం::1

లాలలు పోసీ జోలలు పాడీ 
పాలబువ్వ తినిపించే మా అమ్మా
నాన్న వస్తాడన్నదీ ముద్దులు ఇస్తాడన్నదీ
నాన్న వస్తాడన్నదీ ముద్దులు ఇస్తాడన్నదీ
ఒక మాటైనా చెప్పకా మాయమైపోయిందీ
అమ్మల్లారా ఓ అయ్యల్లారా
మా అమ్మనెవరైనా చూశారా చూశారా 

చరణం::2

ఓ బుజ్జి తువ్వా్వయి నీకుంది అమ్మా 
ఓ గువ్వ పాపాయి నీకుంది అమ్మా
ఓ బొజ్జ గణపయ్య నీకూ అమ్ముంది
ఓ బొజ్జ గణపయ్య నీకూ అమ్ముంది
మీ అమ్మనడగవా మా అమ్మ ఏదనీ
అమ్మల్లారా..ఓ అయ్యల్లారా
మా అమ్మనెవరైనా చూశారా చూశారా