Friday, December 13, 2013

అనూరాధ--1971

సంగీతం::K.V.మహాదేవన్
రచన::అప్పలాచార్య 
గానం::పిఠాపురం,స్వర్ణలత 
తారాగణం::S.V.రంగారావు,కృష్ణ, కృష్ణంరాజు,చంద్రమోహన్,రాజబాబు,విజయనిర్మల,రాజశ్రీ,విజయ లలిత

పల్లవి::

యాదయ్య యాదయ్య జాజిరీ..ఆ యదలోన బాధయ్య జాజిరీ
బాధకు మందెయ్యి జాజిరీ..నా బాధకు మందెయ్యి జాజిరీ
ఓరయ్యో ఓరయ్యో ఓరయ్యో ఇస్తాను ఇస్తాను జాజిరీ 
అహ...తీయగా ఇస్తాను...జాజిరీ
తీసుకున్నాక వుంటుంది లాహిరీ మందు తీసుకున్నాక వుంటుంది లాహిరీ 
ఓలమ్మి..ఓలమ్మి..ఓలమ్మీ..ఈఈ  
యాదయ్య యాదయ్య జాజిరీ..వేస్తాను వేస్తాను జాజిరీ

చరణం::1

చూపులే సూదులై గుచ్చుకున్నవీ..లేత అందాలే కందిపోయి పొంగుతున్నవీ అహ
చూపులే సూదులై గుచ్చుకున్నవీ..లేత అందాలే కందిపోయి పొంగుతున్నవీ
షోకులే షాకులై తగులుతున్నవీ..ఆశ లేవేవో నాలోన రగులుతున్నవీ ఓహో
షోకులే షాకులై తగులుతున్నవీ..ఆశ లేవేవో నాలోన రగులుతున్నవీ
యాదయ్య యాదయ్య జాజిరీ...వేస్తాను వేస్తాను జాజిరీ

చరణం::2

గడ్డపెరుగులా మనము తోడుకుందామా..జంటపక్షులై ఎగిరి ఆడుకుందామా
గడ్డపెరుగులా మనము తోడుకుందామా..జంటపక్షులై ఎగిరి ఆడుకుందామా
వేడిమాటలతో నా ప్రేమ పెంచవద్దూ..వాడి గునపమై గుండెల్లో గెంతవద్దూ
వేడిమాటలతో నా ప్రేమ పెంచవద్దూ..వాడి గునపమై గుండెల్లో గెంతవద్దూ
వేస్తాను వేస్తాను జాజిరీ...యాదయ్య యాదయ్య జాజిరీ

చరణం::3

పశువుగాడొస్తాడు పరువుదీస్తాడు..పళ్ళు రాలాగొట్టి పంపించుతా
పశువుగాడొస్తాడు పరువుదీస్తాడు..పళ్ళు రాలాగొట్టి పంపించుతా
అబ్బో..అబ్బ పశువుకన్నా నీకు బలమెక్కువ..అయ్యొ పరువుకన్నా ప్రేమ విలువెక్కువ
అబ్బ..పశువుకన్నా నీకు బలమెక్కువ అయ్యొ పరువుకన్నా ప్రేమ విలువెక్కువ
హెయ్..జాజిరి..హెయ్..లాహిరీ..హెయ్ జాజిరి..హెయ్ లాహిరి
యాదయ్య యాదయ్య జాజిరీ..ఆ యదలోన బాధయ్య జాజిరీ
ఏసుకున్నాక వుంటుంది లాహిరీ..మందేసుకున్నాక వుంటుంది లాహిరీ 
ఓలమ్మి...ఓలమ్మి...ఓలమ్మీ...ఈఈ 
యాదయ్య యాదయ్య జాజిరీ..ఆ యదలోన బాధయ్య జాజిరీ
ఏస్తాను ఏస్తాను జాజిరీ అహ..ఘాటుగా ఏస్తాను జాజిరీ