Tuesday, June 09, 2009

పసివాడి ప్రాణం --1987



సంగీతం::రాజ్‌కోటి
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి


స్వీటీ..స్వీటీ..ఓహో..
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చకిలిగింతల చాటున షేక్ ద్యాన్స్
నీ చిట్టినడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్
నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్
ఇద్దరి బరువుకు మద్యన బ్రేక్ డ్యాన్స్

బ్రేక్ బ్రేక్ బ్రేక్ బ్రేక్...స్వీటీ..స్వీటీ..య్యా..య్యా

హే..నీ అందం అరువిస్తావా..నా సొంతం కానిస్తావా
నీ సత్తా చూపుస్తావా..సరికొత్త ఊపిస్తావా
హోయ్..పిల్లా నిన్నల్లాడిస్తా..పిడుగంటి అడువిల్లో
తైతాళం పరుగిల్లో..

బ్రేక్ బ్రేక్ బ్రేక్ బ్రేక్...స్వీటీ..స్వీటీ..
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చకిలిగింతల చాటున షేక్ డ్యాన్స్

నా ముద్దును శ్రుతి చేస్తావా..హాయ్
నా మువ్వకు లయలిస్తవా..
నా చిందుకు చిటికేస్తావా
నా పొందుకు చీక్కౌతావా
పిల్లోడా నిన్నోడిస్తా..కడగంటి చూపులతో..ఏహే..
హే..హే..కైపెక్కె తైతక్కల్లో..
బ్రేక్ బ్రేక్ బ్రేక్..నాటీ..నాటీ..హేయ్..నాటీ..

చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చకిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నీ చిట్టినడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్
నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్
ఇద్దరి బరువుకు మద్యన బ్రేక్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ బ్రేక్...స్వీటీ..స్వీటీ..య్యా

యముడికి మొగుడు --1988



సంగీతం::రాజ్‌కోటి
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి

తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రాధ,కైకాలసత్యనారాయణ,కోటాశ్రీనివాస్‌రావు,అల్లురామలింగయ్య.

పల్లవి::

సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ..అందాలనేది..అందగనే..సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెను లే

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం

చరణం::1

చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో
చలిగా ముచ్చటలాడిన ఉక్కిరిగుంటలలో
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మెళ్ళెకాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే..రుచితెలిపే..తొలివలపే..హా
ఓడివలపై మొగమెరుపై జతకలిపే..హా
తీయనిది..తెర తీయనిది
తీరా అది చేజిక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే..హోయ్

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం..అ..ఆహ
అధరం తాంబూలం..అ..ఆహ
అసలే చలికాలం త..త్తర
తగిలే సుమ బాణం త..త్తర

కువవకువవా..కువవకువవా

సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్

చరణం::2

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై..హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ..హై
ఇచ్చినదీ..కడు నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే..హే

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అ..ఆహ
అధరం తాంబూలం..అ..ఆహ
అసలే చలికాలం..ఎ..ఎహే
తగిలే సుమ బాణం..అ..ఆహా

సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ..అందాలనేది..అందగనే..సందేళకది

నా శృతి మించెను నీ లయ పెంచెను లే

పసివాడి ప్రాణం --1987



పసివాడి ప్రాణం 1987
సంగీతం::చక్రవర్తి
రచన::?
గానం::SP.బాలు,S.జానకి

ఇదేదో గోలగావుందీ..ఎదంతా వేడిగావుందీ
అదేం గుబులు..ఇదేం తెగులు..ఇదేనా ఈడంటే....హోయ్

ఇదేదో గోలగావుందీ..నీమీదే..గాలిమళ్ళింది
ఒకే చొరవా..ఒకే గోడవా..అదేలే ఈడంటే....హ్హ

ఒంటిగా పండుకో మీరు..కంటికే మత్తురానీరూ
అదేధ్యాసా..అదే ఆశ..నే నాగేదెట్టాగా..
పువ్వులే పెట్టుకోనీరూ..బువ్వనే ముట్టుకోనీరూ
అదేం పాడో..ఇదేం గోడో..నే నేగేదెట్టాగా..
కోరికే తహతహ మంటాది..ఊపిరే చలి చలి గుంటాది
అదేం సెగలో..ఇదేం పొగలో..అదేలే ఈడంటే....హాయ్

ఇదేదో గోలగావుందీ..ఎదంతా వేడిగావుందీ
ఒకే చొరవా..హోయ్..ఒకే గోడవా..ఆ..అదేలే ఈడంటే..హ్హ

గుడ్డకే సిగ్గురాదాయే..మనసుకే బుద్ధిలేదాయే
అదే రాత్రి..అదే పగలు..నే చచ్చేదెట్టాగా..
చెప్పినా ఊరుకోదాయే..వాయిదా వేయనీదాయే
అదేం చిలకో..అదేం పులకో..నే బతికేదెట్టాగా..
రెప్పలో రెపరెపగుంటాది..రేతిరే కాల్చుకో తింటాది
అవేం కలలో..అదేం కథలో..అదేలే ప్రేమంటే..హాయ్

ఇదేదో గోలగావుందీ..నీమీదే..గాలిమళ్ళింది
ఒకే చొరవా..ఒకే గోడవా..అదేలే ఈడంటే....హ్హ
ఇదేదో గోలగావుందీ..ఎదంతా వేడిగావుందీ
అదేం గుబులు..ఇదేం తెగులు..ఇదేనా ఈడంటే....హోయ్..హోయ్..హహహ