సంగీతం::రమేష్‌నాయుడు రచన::ఆరుద్ర గానం::S.P.బాలు తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య పల్లవి:: జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ అంతే జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ అంతే వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది అవును జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ చరణం::1 మనసు విరిగి తునకలైతే..ఏఏఏ తునక తునకలో..నరకమున్నది లేదు లేదనుకున్న శాంతి చేదులోనే ఉన్నది ఈ చేదులోనే ఉన్నది..హాహాహా,, జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ చరణం::2 రామచిలక ఎగిరిపోతే..ఏఏఏ..రాగబంధం సడలిపోతే రామచిలక ఎగిరిపోతే..ఏఏఏ..రాగబంధం సడలిపోతే మూగ హృదయం..మ్మూఊ..గాయమైనది ఆ గాయమే ఒక గేయమైనది..ఆ గాయమే ఒక గేయమైనది జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ వెలుతురంతా చీకటైతే అందులోనే సుఖము ఉన్నది జీవితం ఏమిటీ వెలుతురూ చీకటీ వెలుతురూ చీకటీ
చిమ్మటలోని ఈ పాట వినండి సంగీతం::ఘంటసాల రచన::D.C. నారాయణ గానం::P.సుశీల సినిమా దర్శకత్వం::K.బాబురావు తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని, పల్లవి:: కృష్ణా..ఆ ఆ..కృష్ణా..ఆఆ..కృష్ణా.. ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ రాణించునా..ఆ
కృష్ణా..ఆ ఆ..కృష్ణా..ఆఆ..కృష్ణా.. ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా ..ఆ ఆ ఆ రాణించునా..ఆ
చరణం::1 నిను చేరి నా కధ వినిపించలేను యదలోని వేదన ఎలా తెలుపను నిను చేరి నా కధ వినిపించలేను యదలోని వేదన ఎలా తెలుపను మనసేమో తెలిపి మనసార పిలిచి మనసేమో తెలిపి మనసార పిలిచి నీ లోన నన్నే నిలుపుము స్వామి
ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ రాణించునా..ఆ
చరణం::2 ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు నా స్వామి మెడలో నటియిన్చున ఏ వన్నె లేని ఈ చిన్ని పూవు నా స్వామి మెడలో నటియిన్చున ఎలాటి కానుక తీలేదు నేను ఎలాటి కానుక తీలేదు నేను కన్నీట పాదాలు కడిగెను స్వామి
ఏనాటి కైన ఈ మూగ వీణా రాగాలు పలికి రాణించునా..ఆ ఆ ఆ రాణించునా..ఆ కృష్ణా..ఆఆకృష్ణా..ఆఆఅకృష్ణా..ఆఆ
సంగీతం::రాజేశ్వర రావు రచన::C.నారాయణ రెడ్డి గానం::P.సుశీల
ఏ దేశమేగినా..ఎందుకాలిడినా ఏ దేశమేగినా..ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా..పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి..నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడు పుట్టింది ఈ మట్టిలో సీత,రూపు కట్టింది దివ్య భగవత్గీత వేదాలు వెలసిన ధరణిరా..వేదాలు వెలసిన ధరణిరా ఓంకార నాదాలు..పలికిన అవనిరా ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవనినాడు..వికసించె మననేల విజ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము
వెన్నెలది ఏ మతమురా,కోకిలది ఏ కులమురా గాలికి ఏ భాష ఉందిరా,నీటికి ఏ ప్రాంతముందిరా గాలికి,నీటికి లేవు భేదాలు మనుషుల్లో ఎందుకీ..తగాదాలు,కులమత విభేదాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము
గౌతమబుద్ధుని భోదలు మరవద్దు..గాంధీ చూపిన మార్గం విడవద్దు గౌతమబుద్ధుని భోదలు మరవద్దు.గాంధీ చూపిన మార్గం విడవద్దు దేశాల చీకట్లు తొలగించు..స్నేహగీతాలు ఇంటింటా వెలిగించు ఇకమత్యమే జాతికి శ్రీరామరక్ష..అందుకే నిరంతరం సాగాలి దీక్ష అందుకే నిరంతరం సాగాలి దీక్ష...