Tuesday, December 25, 2012

కళ్యాణి--1979


సంగీతం::రమేశ్ నాయుడు
రచన::దాసం గోపాలకృష్ణ
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి::

నవరాగానికీ..నడకలు వచ్చెనూ
మధుమాసానికీ..మాటలు వచ్చెనూ
నడకలు కలిపీ..నడవాలీ
మాటలూ కలిపీ..మసలాలీ

నవరాగానికీ..నడకలు వచ్చెనూ
మధుమాసానికీ..మాటలు వచ్చెనూ

చరణం::1

సరసాల ఆటలో..సరాగాల తోటలో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సరసాల పాటలో..సరాగాల తోటలో
అనురాగానికీ..అంటులు కట్టాలీ
అనురాగానికీ..అంటులు కట్టాలీ

మొలకెత్తిన ఆశకూ..చిగురించిన ఊసుకూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మొలకెత్తిన ఆశకూ..చిగురించిన ఊసుకూ
తొలకరి నాటులు..నాటాలీ
తొలకరి నాటులు..నాటాలీ

నవరాగానికీ..నడకలు వచ్చెనూ
మధుమాసానికీ..మాటలు వచ్చెనూ

చరణం::2

కులుకులకు..కుదురులు కట్టీ
పరువాలకు..పందిరి వేయాలీ
పున్నమి నాటికి..పువ్వులు పూయించాలీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కులుకులకు కుదురులు కట్టీ
పరువాలకు పందిరి వేయాలీ
పున్నమి నాటికి పువ్వులు పూయించాలీ
పువ్వులు పూయించాలీ

పూట పూటకు తోటకు వెళ్ళి
పువ్వుల మాలలు కట్టాలీ
అమర కళలకూ అర్పణ చేయాలీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పూట పూటకు తోటకు వెళ్ళి
పువ్వుల మాలలు కట్టాలీ
అమర కళలకూ అర్పణ చేయాలీ
అర్పణ చేయాలీ


నవరాగానికీ నడకలు..వచ్చెనూ
మధుమాసానికీ మాటలు..వచ్చెనూ
నడకలు కలిపీ నడవాలీ
మాటలూ కలిపీ మసలాలీ
నవరాగానికీ నడకలు..వచ్చెనూ
మధుమాసానికీ మాటలు..వచ్చెనూ

కీలుగుఱ్ఱం--1949









సంగీతం::ఘంటసాల
రచన::తాపీ ధర్మారావు 
గానం::ఘంటసాల , శ్రీదేవి

పల్లవి::

ఎంత కృపామతివే..భవాని..ఎంత దయానిధివే
ఎంత కృపామతివే..భవాని..ఎంత దయానిధివే

చరణం::1

కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా
కన్యకు గూర్చితి కళ్యాణ మహా

ఎంత కృపామతివే..భవాని..ఎంత దయానిధివే

చరణం::2

ఏదో పనిపై ఏగే వానికి..ఈ ఈ ఈ ఈ ఈ ఈ  
ఏదో పనిపై ఏగే వానికి..ఈవిద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివా..హహ..విద్యావతి..

ఎంత కృపామతివే..భవాని..ఎంత దయానిధివే

చరణం::3

నూతనముగై లేత మారుతము
నూతనముగై ఈ లేత మారుతము 
గీతా గానము చేయుగదా
హృదయ తంత్రులను కదలించుటచే
హృదయ తంత్రులను కదలించుటచే
వదలిన గానమో..ఏమో
వదలిన గానమో..ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే సామ గానమే ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే 
సామ గానమే ఏమో..సామ గానమే ఏమో

కుంకుమ తిలకం--1983





కుంకుమ తిలకం--1983
సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి 
గానం::S.P.బాలు,P.సుశీల 

పల్లవి::

ఆలనగా పాలనగా..అలసిన గుండెకు ఆలంబనగా
లాలించు నీదానిగా..స్వామీ..పాలించు నీ దాసిగా 

ఆలనగా పాలనగా..అలసిన గుండెకు ఆలంబనగా
లాలించు నీదానిగా..స్వామీ..పాలించు నీ సాటిగా

చరణం::1

పున్నమి కోరే రేయిని నేను..పూజకు వేచిన పువ్వును నేను
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
పున్నమి కోరే రేయిని నేను..పూజకు వేచిన పువ్వును నేను

నిన్నటి దాకా..నాలో నేను..ఈ నిమిషానా..నీతో నేను
లాలించు నీ దానిగా..స్వామీ పాలించు నీ దాసిగా

చరణం::2

నీ హృదయం ఒక సాగరమైతే..బిందువునైనా చాలును నేను
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ హృదయం ఒక సాగరమైతే..బిందువునైనా చాలును నేను
నీ ఒడిలో పసిపాపను కానా..నీ పాదాల రేణువు కానా
లాలించు నీ దానిగా.. స్వామీ..పాలించు నీ దాసిగా

ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా
ఆహాహ హా ఆహహా ఆ ఆ ఆ ఆ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్