Saturday, May 14, 2011

ఆనంద నిలయం--1971

సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరి,మాధవపెద్ది సత్యం,పిఠాపురం నాగేశ్వరరావు
తారాగణం::కాంతారావు, కృష్ణకుమారి, చలం, రాజనాల, రేలంగి, వాణిశ్రీ,రమణారెడ్డి,
సూర్యకాంతం, హేమలత

పల్లవి::

మ్మ్..మ్మ్ హు..మ్మ్..
రానీ రానీ మైకం రానీ..పోనీ పోనీ బిడియం పోనీ 
రానీ రానీ మైకం రానీ..పోనీ పోనీ బిడియం పోనీ 
కానీ కానీ త్వరగా కానీ కమ్మని విందుల బోణీ..కానీ..కానీ

చరణం::1

జవరాలి సొగసూ పొంగాలీ..చినవాడి కోరిక తీరాలీ 
జవరాలి సొగసూ పొంగాలీ..చినవాడి కోరిక తీరాలీ 
ఆడదానికి అందగాడి పొందుకావాలి పులకరించాలీ..ఓహొహ్హొ 
హ్హా..ఆ..రానీ రానీ మైకం రానీ..పోనీ పోనీ బిడియం పోనీ 
కానీ కానీ త్వరగా కానీ కమ్మని విందుల బోణీ..కానీ..కానీ

చరణం::2

అందాలు నాకే ఇవ్వాలీ..బందరు లడ్డులా ఉండాలీ 
అందాలు నాకే ఇవ్వాలీ..బందరు లడ్డులా ఉండాలీ 
గండిపేట చెరువులాగా..గండిపేట చెరువులాగా 
గుండెపొంగాలి కులుకు చూడాలీ..ఓ హొహ్హొహ్హొ..ఈహిహిహీ 
జల్దీ జల్దీ జల్సా చెద్దాం..జాలీ జాలీ జతగా ఉందాం
కానీ కానీ త్వరగా కానీ కమ్మని లవ్వుల బోణీ..కానీ..కానీ

చరణం::3

బెజవాడ ఎండల చూడకూ..వైజాగు బీచిలా కోయకూ 
బెజవాడ ఎండల చూడకూ..వైజాగు బీచిలా కోయకూ 
అందముందీ..ఓహో..ఆశ ఉందీ..అనుభవించాలి..ఆహా..తనివితీరాలీ..ఓ హొహ్హొహ్హొ     
జల్దీ జల్దీ జల్సా చెద్దాం..జాలీ జాలీ జతగా ఉందాం
కానీ కానీ త్వరగా కానీ కమ్మని లవ్వుల బోణీ..కానీ..కానీ

ఆనంద నిలయం--1971

సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::K.G.R.శర్మ
గానం::P.సుశీల
తారాగణం::కాంతారావు, కృష్ణకుమారి, చలం, రాజనాల, రేలంగి, వాణిశ్రీ,రమణారెడ్డి,
సూర్యకాంతం, హేమలత

పల్లవి::

గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది
తాళలేక చిన్నది పాపం తల్లడిల్లుచున్నది..హ..హ          
లాలిలాల..లాలిలాల..లాలిలాలల
గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది

మూగనోము పడితే మాత్రం..మొగము చెప్పడం లేదా
మాయదారి వయసోయమ్మా..మాట వినదు లేవమ్మా         
గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది

దిక్కుమాలిన సిగ్గొకటి..యెక్కడిదో మరి వచ్చిందమ్మా
తమలపాకు యీ లేతచెక్కిలి కందగడ్డగా కందిందమ్మా         
గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది

కొంటెతనంతో మెరిసే కళ్ళు..బరువుగా వాలినవమ్మా
ఒళ్ళు మసిలిపోతోందమ్మా..ప్రేమ జ్వరము యే మోనమ్మా    
గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది

అమాయకురాలు--1971

సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు
తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,చలం,అల్లురామలింగయ్య.

పల్లవి::

ఓ దేవా ! ఆనందరావా!
వందిమాగధుల బోధలనుండి బైటపడి
ఈ కష్టజీవుల గోడు వినిపించుకోవయ్య..ఆఆఆఆఆఆ  
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది
భక్తులు చేసే పాపాలకు యిక హద్దూ పద్దూలేకుంది    
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది

చరణం::1

కష్టపడి రోజంతా పనిచేయడం మావంతు 
క్లబ్బుల్లో తాగి తందనాలాడడం మీవంతు
ఇదేనాన్యాయం..ఊఊఊఊఊఉ
రాబందుల్లా మీదళారులు రక్తంపీలుస్తున్నారు
రక్తంపీలుస్తున్నారు
కడుపులుగొట్టి గుంటనక్కలై కమీషన్లుతీస్తున్నారు 
ఆహా..కమీషన్లుతీస్తున్నారు 
భక్తులు చేసే పాపాలకు యిక హద్దూ పద్దూలేకుంది  
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది

చరణం::2
ఆఆఆఆఆఆఆఆఆఆ 
నోరూ వాయీలేని..పశువులము కాము
ఉడుకు నెత్తురువున్న..మనుషులం మేము
ఇన్నాళ్ళు ఏలాగో..ఓర్సుకున్నాము
ఇక మీపప్పులుడకవని..చెపుతున్నాము
లేనివాళ్ళ...యీ ఆకలి చిచ్చు 
రేగిందంటే...తిప్పలు తెచ్చు
కపట భక్తులా..గెంటకపోతే
మూలవిరాట్టుకే..మోసం వచ్చు         

భక్తులు చేసే పాపాలకు యిక హద్దూ పద్దూలేకుంది  
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది
గుళ్లో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని వుంటే ఏముంది