Wednesday, September 08, 2010

జగమే మాయ--1973




సంగీతం::సత్యం
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,సునందిని,విజయ, విజయలలిత,రాజబాబు 

పల్లవి::

జగమే మాయ..మనిషే మాయ
చెప్పేదంతా..మాయ
అరె..చెసేదంతా..మాయ
దేవుడైన ఈ మర్మం..చెప్పలేడు ఛాలెంజ్ 

జగమే మాయ..మనిషే మాయ
చెప్పేదంతా..మాయ
అరె..చెసేదంతా..మాయ
దేవుడైన ఈ మర్మం..చెప్పలేడు ఛాలెంజ్ 
జగమే మాయ..మనిషే మాయ

చరణం::1

డబ్బులకోసం అడ్డమైనగడ్డి కరుస్తున్నారు..ఔను
న్యాయాన్ని గొయ్యితీసి పాతేస్తున్నారు..నిజం
డబ్బులకోసం అడ్డమైన గడ్డి..కరుస్తున్నారు
న్యాయాన్ని గొయ్యితీసి..పాతేస్తున్నారు 
రేయ్..ఈ మాయదారి పెద్ద మనుషులెక్కడున్నారు
మాయదారి పెద్ద మనుషులెక్కడున్నారు
చిత్రగుప్తుడి చిట్టాలో..కెక్కుతున్నారు..హ్హా 
తిప్పలు..తెచ్చుకుంటారు  
        
జగమే మాయ..మనిషే మాయ
చెప్పేదంతా..మాయ
అరె..చెసేదంతా మాయ
దేవుడైన ఈ మర్మం..చెప్పలేడు ఛాలెంజ్ 
జగమే మాయ..మనిషే మాయ

చరణం::2

తాగినోడు చచ్చినాసరే అబద్దమాడడు..ఆడడు 
తలక్రిందులైపోయినగాన..నిజాన్ని దాచడు..ఆ
తాగినోడు చచ్చినాసరే..అబద్ద..మాడడు..ఆ
తలక్రిందులైపోయినగాన..నిజాన్ని దాచడు
ఏయ్..నీ యవ్వ ఈ ఓబులయ్యతో..ఒకటి రెండు యేస్కుంటేను 
ఈ ఓబులయ్యతో ఒకటి..రెండు యేస్కుంటేను
లోనవున్న అసలురంగు..బైటకొచ్చేను
ఆయ్ బాబోయ్..మన ఆటకట్టేను..ఆ..ధూ          

జగమే మాయ..మనిషే మాయ
వీడు చెప్పేదంతా..మాయ
అరె..చెసేదంతా..మాయ
దేవుడైన ఈ మర్మం..చెప్పలేడు ఛాలెంజ్..హాక్ ధూ  

ఇదా లోకం--1973

















సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,B. వసంత
File Director::K.S. Prakash Rao
తారాగణం::శోభన్‌బాబు, శారద,నాగభూషణం,చంద్ర మోహన్, జ్యోతిలక్ష్మి.సుమ.

పల్లవి::

నిత్యసుమంగళి..నీవమ్మా
నిత్యసుమంగళి..నీవమ్మా
నీ పసుపు కుంకుమ..చెదరనిదమ్మా 
ఇది లోకులు ఎరుగని..నిజమమ్మా 
నీ యిన్నేళ్ళ కన్నీళ్ళే..ఋజువమ్మా 
నిత్యసుమంగళి..నీవమ్మా 
   
నిత్యసుమంగళి..నీవమ్మా
నీ పసుపు కుంకుమ..చెదరనిదమ్మా 
ఇది లోకులు ఎరుగని..నిజమమ్మా 
నీ యిన్నేళ్ళ కన్నీళ్ళే..ఋజువమ్మా 
నిత్యసుమంగళి..నీవమ్మా     

చరణం::1

అమ్మా..నాన్న వచ్చారు నీకు పూలు గాజులు తెచ్చారు
అమ్మా..నాన్న వచ్చారు నీకు పూలు గాజులు తెచ్చారు
మోడు చిగురులు వేసిందీ..కాడు పూతోట అయ్యింది
మోడు చిగురులు వేసిందీ..కాడు పూతోట అయ్యింది
విధి ఓడిపోయి జరుగని వింతే జరిగింది
నిత్యసుమంగళి నీవమ్మా          

చరణం::2

మీ పెళ్ళికి యిరవై ఏళ్ళ వయసట 
మీ పెళ్ళికి యిరవై ఏళ్ళ వయసట 
పండుగ చేయాలనుకున్నాము 
పీటలపైనా కూర్చొండి మాలలు ఇద్దరు మార్చండి 
పీటలపైనా కూర్చొండి మాలలు ఇద్దరు మార్చండి  
ఎన్నాళ్ళకమ్మా..ఎన్నేళ్ళకమ్మా..ఆఆ
ఎన్నాళ్ళకమ్మా..ఎన్నేళ్ళకమ్మా
కన్నుల కింతటి పండుగ..మా కన్నుల కింతటి పండుగ
నిన్నూ..నాన్నను 
నిన్నూ..నాన్నను..చూశామొకటిగ 
అనురాగం త్యాగం..ఆలుమగలుగ  
    
నిత్యసుమంగళి..నీవమ్మా
నీ పసుపు కుంకుమ..చెదరనిదమ్మా 
ఇది లోకులు ఎరుగని..నిజమమ్మా 
నీ యిన్నేళ్ళ కన్నీళ్ళే..ఋజువమ్మా 
నిత్యసుమంగళి..నీవమ్మా

ఇదా లోకం--1973




సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
File Director::K.S. Prakash Rao
తారాగణం::శోభన్‌బాబు, శారద,నాగభూషణం,చంద్ర మోహన్, జ్యోతిలక్ష్మి.సుమ.

పల్లవి::

హా హా హా హా హా హా హా 
మనసా..ఆ..మనసా
ఎందుకు ఎందుకు ఎందుకు నవ్వావంటే
నువ్వేమని చెప్పేవు లోకులకు
ఎందుకు నవ్వావంటే..నువ్వేమని చెప్పేవు లోకులకు 
ఏడవలేక నవ్వావా..నీగోడు నవ్వులో దాచావా
ఏడవలేక నవ్వావా..నీగోడు నవ్వులో దాచావా  
ఎందుకు నవ్వావంటే..నువ్వేమని చెప్పేవు లోకులకు
మనసా..ఆ..నా మనసా 

చరణం::1

సీతను కోరెను నీచుడు..నా సీతను కోరెను నీచుడు
సాయపడెను మారీచుడు..తారుమారుగా కధమారిందా
కారుచీకటి కమ్మేస్తుందని చెప్పకపోతివే మనసా 
ఎంత ముప్పుతెస్తివే మనసా..చెప్పకపోతివే మనసా 
ఎంత ముప్పుతెస్తివే..మనసా

చరణం::2

ఆడది దేవతరూపం..ఆమె ఉసురే తీరనిశాపం
అమ్మా తల్లీ దాసోహం అమ్మా..దాసోహం
ఆడది దేవతరూపం..ఆమె ఉసురే తీరనిశాపం
చెంప ఎప్పుడు చెళ్ళుమన్నదో..ఓఓఓఓఓఓఓఓ 
కొంప అప్పుడే గుల్లవుతుందని 
తెలుపకపోతివే మనసా..ఇల్లు నిలుపకపోతివె మనసా
తెలుపకపోతివే మనసా ఇల్లు నిలుపకపోతివె మనసా
ఎందుకు నవ్వావంటే..నువ్వేమని చెప్పేవు లోకులకు
మనసా..ఆ..నా మనసా 

చరణం::3

గడ్డిని కతికే మనుషులు..కారా చివరకు పశువులు
గడ్డిని కతికే మనుషులు..కారా చివరకు పశువులు
చెరపకురా నువు చెడేవు అన్న..పరమరహస్యం మరువరాదని 
పెద్దలు చెప్పిరి మనసా..ఆ సుద్దులు మరిచావ్ మనసా
పెద్దలు చెప్పిరి మనసా..ఆ సుద్దులు మరిచావ్ మనసా
ఎందుకు నవ్వావంటే..నువ్వేమని చెప్పేవు లోకులకు 
ఏడవలేక నవ్వావా..నీగోడు నవ్వులో దాచావా
ఏడవలేక నవ్వావా..నీగోడు నవ్వులో దాచావా  
ఎందుకు నవ్వావంటే..నువ్వేమని చెప్పేవు లోకులకు
మనసా..ఆ..నా మనసా

ఇదా లోకం--1973




సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి
గానం::S.P.బాలు,జయదేవ్,B వసంత
తారాగణం::శోభన్‌బాబు, శారద,నాగభూషణం,చంద్ర మోహన్, జ్యోతిలక్ష్మి.సుమ.

పల్లవి::

ఇదా లోకం..ఇదా లోకం..ఇదా..ఆఆ..లోకం
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
ఉన్నమాట అంటాము..ఓహో..ఉలికి పడక వింటారా 
గంగిరెద్దులా తల ఆడించక..గమ్యం ఏదో చూపిస్తారా   
ఉన్నమాట అంటాము..ఓహో..ఉలికి పడక వింటారా
గంగిరెద్దులా తల ఆడించక..గమ్యం ఏదో చూపిస్తారా   
ఉన్నమాట అంటాము..ఓహో..ఉలికి పడక వింటారా 

చరణం::1

బాబూ..ఇవిగో డిగ్రీలు..బయస్సీలూ..బియ్యేలు
యమ్మెస్సీలూ, యమ్మేలు
వేలకు వేలూ పోశాము..ఎన్నో యేళ్ళు బతికాము
ఈ పట్టాలకు తెలివే లేదా..ఆఆ..పట్టభద్రులకు విలువేలేదా..ఆఆ
ఇదా లోకం..ఇదా లోకం..ఇదా..ఆఆ..లోకం

చరణం::2

ఉడుకు రక్తము..ఉరకలు వేసే 
యువకుల్లారా..యువతుల్లారా 
కళాశాలలు వదలండి..కదన రంగమున దూకండి
కళాశాలలు వదలండి..కదన రంగమున దూకండి

భావి పౌరులు మీరేనండి..రాజకీయములు మాకొదలండి 
కాలం వ్యర్థం చేయొద్దండి..కళాశాలలకు వెళ్ళండి
కళాశాలలకు వెళ్ళండి

స్వార్థంకోసం విద్యార్థులను..వాడుకునే 
నాయకులారా..వినాయకులారా..వినాయకులారా
పదవులు మీకు కావాలా..చదువులు మాకు పోవాలా
పదవులు మీకు కావాలా..చదువులు మాకు పోవాలా
ఇదా లోకం..ఇదా లోకం..ఇదా..ఆఆ..లోకం

చరణం::3

బడి కట్టిస్తాం  గుడి కట్టిస్తాం..ఆసుపత్రులు పెట్టిస్తాం 
వందలు వేలూ చందాలిస్తే..ప్రజా సేవలు మేమే చేస్తాం
బడి కట్టిస్తాం  గుడి కట్టిస్తాం ప్రజా సంస్థలను వశపరచుకొని 
ప్రజల ధనాన్ని భోంచేస్తారా..బేవ్.. 
గద్దెలెక్కిన పెద్దలు మీరు..మే గమ్మత్తులు యిక సాగవులే
సాగవులే యిక సాగవులే..సాగవులే యిక సాగవులే
ఇదా లోకం..ఇదా లోకం..ఇదా..ఆఆ..లోకం

దేశం కోసం నాడూ నేడూ పోరాడింది విద్యార్థులే
పోరాడింది విద్యార్థులే
యువతీ యువకులు నడుము బిగించి 
అందరికంటే ముందుంటారు..ముందుంటారు 
ఇక అందరికంటే ముందుంటారు..ముందుంటారు

ఇదా లోకం--1973


















సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.జానకి, L.R.ఈశ్వరి
తారాగణం::శోభన్‌బాబు, శారద,నాగభూషణం,చంద్ర మోహన్, జ్యోతిలక్ష్మి.సుమ.

పల్లవి::

గుడిలోన నా స్వామి..కొలువై వున్నాడు
సేవకు వేళాయెనే..చెలియా సేవకు వేళాయనే 

గుడిలోన నా స్వామి కొలువై వున్నాడు
సేవకు వేళాయెనే..చెలియా సేవకు వేళాయనే  
    
గుడియెనక నా సామి..గుడియెనక నా సామి 
గుర్రమెక్కి కూసున్నాడు
వాడి సోకు సూసి గుండెల్లో గుబులాయెనే
అబ్బబ్బబ్బబ్బ ఒళ్ళంత ఏడెక్కెనే  
అయ్యయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెనే 
అయ్యయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెనే

చరణం::1

సోగ కన్నులవాడు చక్కనైనవాడు 
సోగ కన్నులవాడు చక్కనైనవాడు  
మొలక నవ్వులే నవ్వుతూ 
వలపు చూపులే రువ్వుతూ 
సకల చరాచర జగతికి నాధుడు 
నిఖిల సురాసుర మునిగణ వంధ్యుడు 
నీల జలద మోహనుడు..మాధవుడు 
         
గుడిలోన నా స్వామి కొలువై వున్నాడు 
సేవకు వేళాయెనే..ఏఏఏఏ..సేవకు వేళాయనే 

చరణం::2

నాల్గు కన్నులవాడు నాడెమైనవాడు 
కులుకు నవ్వులే నవ్వుతూ 
కొంటి చూపులే రువ్వుతూ 
కులుకు నవ్వులే నవ్వుతూ 
కొంటి చూపులే రువ్వుతూ  
కైపుమీద ఉన్నాడమ్మో 
కొంగు పట్టి లాగాడమ్మో
కైపుమీద ఉన్నాడమ్మో 
కొంగు పట్టి లాగాడమ్మో
ఎగాదిగా చూసి చూసి  
ఏమేమో అన్నాడమ్మో
               
గుడియెనక నా సామి 
గుర్రమెక్కి కూసున్నాడు

చరణం::3

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
గట్టునున్న చీరలే దాచినాడమ్మా 
కన్నెల మనసులే దోచినాడమ్మా 
కన్నెల మనసులే దోచినాడమ్మా

ఒంపు సొంపుల్లు దాచుకుంటే ఊరుకోడమ్మా 
ఒంపు సొంపుల్లు దాచుకుంటే ఊరుకోడమ్మా 
ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా 
ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా

వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా  
వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా 
వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా 
వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా

హోయ్..య్యా..
బంగారు ముద్దలె మింగుతాడమ్మా 
బంగారు ముద్దలె మింగుతాడమ్మా 
పడుచుపిల్ల ముద్దులంటే పడిచస్తాడమ్మా 
పడుచుపిల్ల ముద్దులంటే పడిచస్తాడమ్మా 

గంగ-మంగ--1973






సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

గడసాని దొరసాని ఒడుపు చూడండి 
ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి 
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 
గడసాని..ఈఈ..దొరసాని..ఈ  

చరణం::1

అరెరెరె నడకంటె నడక కాదు 
చలాకి నడక..బల్ కిలాడి నడక 
నవ్వంటే నవ్వుగాదు తారాజువ్వ 
అది వడిసెల రువ్వ 
ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా
వగలంటె వగలు కాదు వలపుల సెగలు 
చూపంటె చూపు కాదు మదనుడి తూపు 
ఆ నడక ఆ నవ్వు ఆ వగలు ఆ చూపు
అన్ని కలిపి యిసిరితే గుమ్మైపోతారు తల దిమ్మైపోతారండి
   
గడసాని..హేయ్..గడసాని దొరసాని  
ఒడుపు చూడండి..ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి 
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 
గడసాని..ఈఈ..దొరసాని..ఈ  

చరణం::2

మాటలతోటే నన్ను..మురిపించకురా 
ఏమేమో పొగిడేసి..బులిపించకురా
మాటలతోటే నన్ను..మురిపించకురా 
ఏమేమో పొగిడేసి..బులిపించకురా
ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా
కవ్వించాలని నువ్వు..కలలు కనకురా 
కత్తితోటి చెలగాడి..చిత్తు గాకురా 
గడఎక్కి తాడెక్కి గంతేసి చిందేసి 
అందరు మెచ్చేలాగ ఆడీ చూపాలిరా 
గడసాని..హేయ్..హేయ్..గడసాని దొరసాని  
ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి 
సొగసు చూడండి అబ్బొదాని ఒడుపు చూడండి
గడసాని..ఈఈ..దొరసాని..ఈ      

చరణం::3

తళుకు బెళుకు చూపిస్తా..ఆ
గజ్జె ఘల్లు మనిపిస్తా..ఆ
తళుకు బెళుకు చూపిస్తే తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లు మనిపిస్తే..గిలగిల గిలగిలగిల లాడాలి
ఆ తళుకు ఆ బెళుకు ఆ బిగువు ఆ బింకం 
అన్నికలిపి చూపితే ఐసై పోవాలండీ..పైసలు రాలాలండీ
గడసాని..ఆహా..గడసాని దొరసాని ఒడుపు చూడండి 
ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి 
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 
గడసాని..ఈఈ..దొరసాని..ఈ