Monday, August 05, 2013

బహుదూరపు బాటసారి--1983



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1910

సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

ఎవరు ఎవరో తెలియకుండా
ఒకరినొకరు కలుసుకొనుట..ఆ..ఆ
చిత్రం..విచిత్రం..చిత్రం.. విచిత్రం

చిత్రమైన సృష్టిలో..ఆడమగ కలయికే
చిత్రమైన సృష్టిలో..ఆడమగ కలయికే
చిత్రం..విచిత్రం..చిత్రం..విచిత్రం

చరణం::1

కన్ను కన్ను కలిసినాక..పిచ్చిపట్టి తిగురుతుంటే
దాహం..దాహం..దాహం..దాహం..దాహం..దాహం
దిక్కులన్నీ పూలు పరచి పిల్లలల్లే ఎగిరిపడితే
సరసం..సరసం..సరసం..సరసం..సరసం..సరసం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ఎదురు చూసి కనులు రెండూ..తెల్లవారి ఎర్రబారితే
విరహం..విరహం..విరహం..విరహం..విరహం..విరహం..విరహం

చనువు పెరిగి అలకలేసి..అలిగి అలిగి పారిపోతే
కలహం..కలహం..కలహం..కలహం..కలహం..కలహం
లల్లలల్లలా..ఆహహా..ఆహహా..ఓహో..ఆహహా

దాహాల చెరువుల్లో..సరసాల వానల్లో
విరహాలు..కలహాలు..కమ్మని ప్రేమకు చిగురులు
ఎవరు ఎవరో తెలియకుండా..ఒకరినొకరు కలుసుకొనుట

చరణం::2

అడుగులోన అడుగు వేసి..ఏడడుగులు నడుస్తుంటే
ధన్యం..జన్మ ధన్యం..ధన్యం..జన్మ ధన్యం..ధన్యం..జన్మ ధన్యం

ఆరుబయట చందమామ రారమ్మని పిలుస్తుంటే
ధ్యానం..పరధ్యానం..ధ్యానం..పరధ్యానం..ధ్యానం..పరధ్యానం

తారలన్ని తోరణాలై..తొలి రాతిరి కాపు కాస్తే
మైకం..మైకం..మైకం..మైకం..మైకం..మైకం
సిగ్గు విడిచి చీకటంత..నవ్వి నవ్వి తెల్లవార్చితే
స్వర్గం..స్వర్గం..

స్వప్నాల మైకం లో..స్వర్గాల ఊయలలో
రాగాలు..భావాలు..కమ్మని కాపురాన కబురుళ్లు

ఎవరు ఎవరో తెలియకుండా
ఒకరినొకరు కలుసుకొనుట..ఆ..ఆ
చిత్రం..విచిత్రం..చిత్రం..విచిత్రం
చిత్రమైన సృష్టిలో ఆడమగ కలయికే
చిత్రం..విచిత్రం..చిత్రం..విచిత్రం

బహుదూరపు బాటసారి--1983



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1386

సంగీతం::చక్రవర్తి
రచన:: దాసరి
గానం::P.సుశీల

పల్లవి::

మేఘమా..ఆ..నీలి మేఘమా
మేఘమా..నీలి మేఘమా
ఉరమకే..మెరవకే నీలి నీలి మేఘమా
మేఘమా..నీలి మేఘమా
ఉన్న రూపం మార్చుకుని
నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై కరగకే
మేఘమా..నీలి మేఘమా

చరణం::1

ఫ్రతి ప్రసవం గండమని
ప్రతి నిముషం మరణమని
తెలిసి కూడ కన్నతల్లులు
ఫ్రతి ప్రసవం గండమని
ప్రతి నిముషం మరణమని
తెలిసి కూడ కన్నతల్లులు
మరల మరల కంటారు
పగటి కలలు కంటారు
బిడ్డ దైవం అంటారు
దైవమే రాయి అని ఉలుకు పలుకు లేనిదని 
తెలుసుకోరు పిచ్చి తల్లులు
మేఘమా..నీలి మేఘమా 
ఉరమకే..మెరవకే..నీలి నీలి మేఘమా
మేఘమా..నీలి మేఘమా

చరణం::2

సాగరమే సంసారమని
ఈదటమే కష్టమని
మరచిపోయి కన్న తండ్రులు
సాగరాన పయనిస్తారు
మునిగి తేలుతుంటారు
మునకే మిగులునని 
కన్నందుకు ఫలితమని 
తెలుసుకోరు పిచ్చి తండ్రులు
మేఘమా నీలి మేఘమా
ఉరమకే మెరవకే..నీలి నీలి మేఘమా
మేఘమా..నీలి మేఘమా
ఉన్న రూపం మార్చుకుని
నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై కరగకే
మేఘమా..నీలి మేఘమా

శుభోదయం--1980



సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::P.సుశీల

పల్లవి::

మందార మకరంద మాధుర్యమునదేలు
మధుపంబు పోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునే తరంగిణులకూ

ప్చ్..అదిగాదు వాడక్కడ చేరి మొత్తం

ఆ..ఆ చింత నీకేలరా
ఆ..చింత నీకేలరా
ఆ..చింత నీకేలరా
స్వామీ నీ చెంత నేనుండగా
ఆ..చింత నీకేలరా

చరణం::1

సొంతమైన ఈ సొగసులేలక   
పంతమేల పూబంతి వేడగ
సొంతమైన ఈ సొగసులేలక   
పంతమేల పూబంతి వేడగ
ఆ..చింత నీకేలరాఆఆ 

చరణం::2

సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్ని
కరిగించి కౌగిళ్ళ తినిపించగా

ఆ..ఆ చింత నీకేలరా
నీ..చెంత నేనుండగా
ఆ..చింత నీకేలరా

చరణం::3

ఆవంక..ఆ వెన్నెలమ్మ
ఈ వంక..ఈ వన్నెలమ్మా
ఆవంక..ఆ వెన్నెలమ్మా
ఈ వంక..ఈ వన్నెలమ్మా
ఏ వంక లేని నెలవంక నేనమ్మ 
నీకింక అలకెందుకమ్మా 

చ్చ్..చ్చ్..చ్చ్..అయ్యో 
లలిత రసాల పల్లవకారియైచొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరమరుగునే
సాంద్ర నిహారములకు
వినుత గుణశీల మాటలు వేయునేలాఆఆ 

ఆ..చింత నీకేలరా
స్వామీ నీ..చెంత నేనుండగా
ఆ..చింత నీకేలరా

ప్రేమమందిరం--1981



సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు 
తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్

సాకి::

ఉదయమా ఉదయమా..ఉదయించకు ఉదయించకు

పల్లవి:: 

ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో
చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో 

ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో
చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో
ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో

చరణం::1 

ఉదయమా నాకు తెలుసు వెలుగే నీ ప్రేమ అనీ
అది లోకానికి దీపమనీ 
ఉదయమా నాకు తెలుసు వెలుగే నీ ప్రేమ అనీ
అది లోకానికి దీపమనీ
కన్నీటి ప్రమిదలో..కరిగే కర్పూరమై
వంచించిన దేవతకే..హారతులే పడుతుంటే..ఏ
పేరుకామె ప్రేయసీ..ప్రేమకామె రాక్షసీ
అందుకే..అందుకే
ప్రేమకి నే కడుతున్నా నీ కడుపున సమాధి 

ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో
చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో
ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో

ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో

చరణం::2 

ఉదయమా నీకు తెలుసు ప్రేమ చచ్చిపోదనీ 
నీకు తెలుసు అది చావుకన్నా బాధ అని 
ఉదయమా నీకు తెలుసు ప్రేమ చచ్చిపోదనీ
అది చావుకన్నా బాధ అని
ప్రేమకై చచ్చేదీ..చచ్చీ ప్రేమించేదీ 
మనసిచ్చిన పాపానికి..బలిపశువై పోయేది
చరిత్రలో మగవాడే..చిరంజీవి మానవుడే
అందుకే అందుకే ప్రేమికులారా వినండి
ప్రేమంటే...ఆత్మబలీ 

ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో
చితికిన నా హృదయమనే..చితిలో మృతిలో

ఉదయించకు..ఉదయించకు
ఉదయిస్తే చూడలేను..ప్రేమనే వల్లకాటిలో