Monday, March 19, 2012

సర్దార్ పాపారాయుడు--1980



సంగీతం::చక్రవర్తి
రచన::దాసరినారాయణ రావ్
గానం::S.P.బాలు,P.సుశీల

Film Directed By::DasariNarayanaRaoతారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,శారద,రావుగోపాల్రావు,మోహన్‌బాబు,కైకాల సత్యనారాయణ,గుమ్మడి,ప్రభాకర్‌రెడ్డి,పండరీబాయి,అల్లురామలింగయ్య,జ్యోతిలక్ష్మీ. 

పల్లవి::


పందొమ్మిదివందల ఎనభై వరకు
ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు
పడినా నే వెంటపడలేదు

ఓ..బంగారక్కా చూపే శృంగారక్కా
ఓ..బంగారక్కా చూపే శృంగారక్కా

పందొమ్మిదివందల ఎనభై వరకు
ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు
పడినా నే వెంటపడలేదు

ఓ..అందాలయ్యా చూపే దండాలయ్యా
ఓ..అందాలయ్యా చూపే దండాలయ్యా

చరణం::1

ఆరేళ్ళ ముందు చూస్తే చిన్నపిల్ల
పదహారేళ్ళ వయసునాడు కుర్రపిల్ల
ఆరేళ్ళ ముందు చూస్తే చిన్నపిల్ల
పదహారేళ్ళ వయసునాడు కుర్రపిల్ల
ఏడు పెరుగుతుంటే ఈడు పెరుగుతుంది
ఈడు పెరుగుతుంటే జోడు కుదురుతుంది

ప్రేమకు ఈడెందుకూ పెళ్ళికి ప్రేమెందుకు
ప్రేమకు పెళ్లితోడు పెళ్ళికి ప్రేమతోడు
అమ్మతోడు అయ్యతోడు నీకు నాకు ఈడుజోడు

హోయ్పం..దొమ్మిదివందల ఎనభై వరకు..హోయ్
ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు
పడినా నే వెంటపడలేదు
ఓ..అందాలయ్యా చూపే దండాలయ్యా
ఓ..బంగారక్కా చూపే శృంగారక్కా

చరణం::2

మొదటిసారి చూచినపుడు అగ్గిరాముడు
మరి మూడేళ్ల ముందుచూస్తే అడవిరాముడు
మొదటిసారి చూచినపుడు అగ్గిరాముడు
మరి మూడేళ్ల ముందుచూస్తే అడవిరాముడు
ఏడు పెరుగుతుంటే వయసు తరుగుతుంది
వయసు తరుగుతుంటే సోకు పెరుగుతుంది

మనసుకు సోకెందుకు వయసుకు మనసెందుకు
మనిషికి మనసు అందం మనసుకు ప్రేమబంధం
ఈ అందం ఆ బంధం ఇద్దరిది వివాహబంధం

హోయ్పం..దొమ్మిదివందల ఎనభై వరకు..హ్హా
ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు
పడినా నే వెంటపడలేదు
ఓ..అందాలయ్యా చూపే దండాలయ్యా
ఓ..అందాలయ్యా చూపే దండాలయ్యా

పందొమ్మిదివందల ఎనభై వరకు
ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు..హోయ్
పడినా నే వెంటపడలేదు

ఓ..బంగారక్కా చూపే శృంగారక్కా..హోయ్
ఓ..బంగారక్కా చూపే శృంగారక్కా అహా..
ఓ..బంగారక్కా చూపే శృంగారక్కా అహా..