సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::SPబాలు,S.జానకి
Film DirecTed By::Dasari Narayana Rao
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,జయసుధ,గుమ్మడి,రాజబాబు,రమాప్రభప్రభకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,రాజసులోచన,నిర్మల.
పల్లవి::
ఆ...ఆ...ఆ...ఆ...
ఉదయకిరణ రేఖలో
హౄదయ వీణ తీగలో
ఉదయకిరణ రేఖలో
హౄదయ వీణ తీగలో
పాడిందీ...ఒక రాధికా
పలికిందీ...రాగమాలికా
ఇదే..ఇదే..ఇదే..నా అభినందన గీతికా
ఉదయకిరణ రేఖలో
హౄదయ వీణ తీగలో...
సరిసరిసరిసరి మమమమ
సరిసరిసరిసరి..ససససస
రిరిరిరిరిరి..రీరీరీరీరీ
గగరిరిగగరిరిగగరిరి..సనిస
స..నినినిని..స..ససససస..
నిసనిసనిస..గగరిరిసనిస..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ......
కాశ్మీర అందాలు బాలభారతి నుదుట తిలకాలు దిద్దగా
పురివిప్పునాట్యాలు నాట్యభారతి పాదాలా పారాణి అద్దగా
కాశ్మీర అందాలు బాలభారతి నుదుట తిలకాలు దిద్దగా
పురివిప్పునాట్యాలు నాట్యభారతి పాదాలా పారాణి అద్దగా
అడుగున అడుగిడి స్వరముల ముడివడి
అడుగే పైపడి మనసే తడబడి
మయూరివై కదలాడగా వయ్యారివై...
నడయాడగా..ఇదే ఇదే ఇదే నా అభినందనగీతికా..
ఉదయకిరణ రేఖలో
హౄదయ వీణ తీగలో...
సనిసరి దని సరిసా...మదనిరిసా
సనిసరి దని సగరీ...దని సగరీ
సరిమపనిపమరినిపమపమరి నపమరి
దనిసరిసరి..దనిసరిసరిసా..ఆ..
నిసనిసరీ..నిసనిసరీ..నిసరిమరిమరిసరి
సనిస దనిసరిసా.. మదనిసగమగమనిదమ
పయనించు మేఘాలు నిదురించుసౄష్టినే మేలుకొలుపగా
రవళించు మువ్వలు నటరాజు ఆశీస్సుకై హారతివ్వగా..
పయనించు మేఘాలు నిదురించుసౄష్టినే మేలుకొలుపగా
రవళించు మువ్వలు నటరాజు ఆశీస్సుకై హారతివ్వగా..
స్వరముల స్వరమై పదముల పదమై
పదమే స్వరమై స్వరమే వరమై దేవతవై..అగుపించగా..
జీవితమే..అర్పించగా...
ఇదే ఇదే ఇదే...నా అభినందన గీతికా..
ఉదయకిరణ రేఖలో..ఆ
హౄదయ వీణ తీగలో..ఆ
ఉదయకిరణ రేఖలో..ఆ
హౄదయ వీణ తీగలో..ఆ
పాడిందీ...ఒక రాధికా..ఆ..ఆ
పలికిందీ...రాగమాలికా..ఆ..ఆ
ఇదే..ఇదే..ఇదే..నా అభినందన గీతికా
ఉదయకిరణ రేఖలో..ఆ
హౄదయ వీణ తీగలో...ఆ..ఆ..లో...