సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::పింగళి ఆత్రేయ
గానం::P.శాంతకుమారి
రాగం:పీలు
ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా
ఎంతపిలచినా ఎంత వేడినా
ఈనాటికి దయ రాదేలా
గోపాలా నంద గోపాలా గోపాలా నంద గోపాలా
వీనులవిందుగ వేణుగానమూ
వినితరించగా వేచితిరా ఆ....ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
వీనులవిందుగ వేణుగానమూ వినితరించగా వేచితిరా
వేచి వేచి వెన్నముద్దవలే
కరిగిపోయరా నా బ్రతుకు
కరిగి పోయరా నాబ్రతుకూ....
ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా
వెన్నమీగడలు జున్నుపాలకు
ఏమి కొరతరా మనఇంటా
..ఆ....ఆ....ఆ..ఆ..ఆ.ఆ..ఆ....
వెన్నమీగడలు జున్నుపాలకు
ఏమి కొరతరా మన ఇంటా..
పాలను ముచ్చిలి పరుల చేతిలో
దెబ్బలు తినకురా కన్నయ్యా
ఈ తల్లి హౄదయమూ ఓర్వలేదయా
ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా
వెన్నమీగడలు జున్నుపాలకు
ఏమి కొరతరా మన ఇంటా..
పాలను ముచ్చిలి పరుల చేతిలో
దెబ్బలు తినకురా కన్నయ్యా
ఈ తల్లి హౄదయమూ ఓర్వలేదయా
ఎన్నాళ్ళనినా కన్నులు కాయగ
ఎదురు చూతురా గోపాలా