Sunday, June 19, 2011

శ్రీ తిరుపతమ్మ కథ--1963




సంగీతం::పామర్తి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల
రాగం::కల్యాణి:::

మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్

పూవై విరిసిన పున్నమి వేళ..
బిడియము నీకెలా..బేలా..!!పూవై!!
పూవై విరిసిన పున్నమి వేళ..
బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళ..

చల్లని గాలులు సందడి చేసే
తోలి తోలి వలపులు తొందర చేసే
చల్లని గాలులు సందడి చేసే
తోలి తోలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలిముసుగులో
తలను వాల్తువేలా..బేలా..

పూవై విరిసిన పున్నమి వేళ
బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళ


మొదట మూగినవి మొలక నవ్వులు..
పిదప సాగినవి బెదరు చూపులు..ఊ..ఆ..ఆ..ఆ..
మొదట మూగినవి మొలక నవ్వులు..
పిదప సాగినవి బెదరు చూపులు
తెలిసెనులే నీ తలపులేమిటో
తొలగిపోదువేలా...బేలా

పూవై విరిసిన పున్నమి వేళ
బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళ


తీయని వలపుల పాయసమాని
మాయని మమతల ఊయలలూగి
తీయని వలపుల పాయసమాని
మాయని మమతల ఊయలలూగి
ఇరువురమొకటై పరవశించగా..
ఇంకా జాగేలా..బేలా

పూవై విరిసిన పున్నమి వేళ
బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళ