Wednesday, March 15, 2017

సముద్రాల రాఘవాచార్య 50 వ వర్ధంతి


సముద్రాల రాఘవాచార్య (జూలై 19, 1902 - మార్చి 16, 1968)
నేడు సముద్రాల సీనియర్ గా పిలువబడే శ్రీ సముద్రాల రాఘవాచార్య గారి 50 వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరిస్తూ..
సముద్రాల రాఘవాచార్య తెలుగు సినిమా రంగానికి ‘ ఆదికవి ‘ లాంటి వారు. 1938లో కవిగా ప్రవేశించి 1968లో మరణించేంత వరకూ ‘ సాహిత్య సేవ ‘ చేసి అజరామరమైన పాటలను రచించారు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య. ఈయన కూడా దాదాపు 30 ఏళ్లపాటు సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. ఎన్ టి ఆర్ కు వీరు ఇద్దరూ అత్యంత ప్రీతిపాత్రులు. రామానుజాచార్య కూడా సినిమా రంగం ప్రవేశం చేసిన తరువాత ఇద్దరి మధ్యా తేడా తెలియడానికి పెద్దాయనను సీ.సముద్రాల, చిన్నాయనను జూ.సముద్రాల అని పిలిచేవారు. దానికి పెద్దాయన ” నాపేరులో ఇప్పటికే సముద్రాలు ఉన్నాయి. మీరు మళ్లీ సీ.సముద్రాల అంటే, సముద్రం సముద్రాల అవుతుంది ” అని చమత్కరించేవారు !

తెలుగు సినిమా రంగం, సూర్యచంద్రులు మనినంత కాలం జీవించే పాటలను అందించారు ఆ మహాకవులిద్దరూ.

సముద్రాల రాఘవాచార్య 1902లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మీ తాయారు, వేంకట శేషాచార్యులు గార్లు. భక్త రఘునాధ్ 1960 లో పాట పాడేరు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.

రచయితగా మాటలు, పాటలు వందే మాతరం 1939, సుమంగళి 1940, దేవత 1941, భక్త పోతన్ 1942, స్వర్గ సీమ 1945, త్యాగయ్య 1946, యోగి వేమన 1947, నవ్వితే నవ రత్నాలు 1951, భక్త రఘునాధ్ 1960, సతీ సక్కుబాయి 1965, భక్త పోతన 1966, భక్త ప్రహ్లాద 1967, వీరాంజనేయ 1968, శ్రీ రామ కధ 1968
పల్ణాటి యుద్ధం 1947, బాల రాజు 1947, లైలా మజ్ఞు 1949, దేవదాసు 1953, బ్రతుకు తెరువు 1953, విప్ర నారాయణ 1954, అనార్కలి 1955, దొంగ రాముడు 1955, సువర్ణ సుందరి 1957, బాటసారి 1961,జయదేవ 1961, అమర శిల్పి జక్కన్న 1964, రహస్యం 1967
మన దేశం 1949, షావుకారు 1950, చండీ రాణి 1953, జయ సింహ 1955, సంతోషం 1956, చరణ దాసి 1956, జయం మనదే 1956, తెనాలి రామ కృష్ణ 1956, సొంత ఊరు 1956, సారంగధర 1957, వినాయక చవితి 1957, భూ కైలాస్ 1958, దీపావళి 1960, సీతా రామ కల్యాణం 1961, సతీ సులోచన 1961, స్వర్ణ మంజరి 1961, నర్తనశాల 1963, లవ కుశ 1963, వాల్మీకి 1963, బభ్రువాహన 1964, పాండవ వనవాసం 1965, పరమానందయ్య శిష్యుల కధ 1966, శకుంతల 1967, శ్రీ కృష్ణ పాండవీయం 1967, శ్రీ కృష్ణ తులాభారం 1967, శ్రీ రామ పట్టాభిషేకం 1978.

సముద్రాల రాఘవాచార్య గారు రచించిన ఎన్నో మధుర గీతాలు… వాటిలో కొన్ని

అన్నానా భామిని - సారంగధర
అందములు విందులయే అవని ఇదేగా - భూ కైలాస్
అశ్వ మేధ యాగానికి - లవకుశ
భూమికి ప్రదక్షిణము చేసి - సీతా రామ కల్యాణం
చిరు నగవు చిందు మోము - సీతా రామ కల్యాణం
దేవా దీన బాంధవా - పాండవ వనవాసం
దేవ దేవ ధవళాచల - భూకైలాస్
దానవ కుల వైరి - సీతా రామ కల్యాణం
దినకరా శుభకరా - వినాయక చవితి
ఈ మేను మూడు నాళ్ల - భూ కైలాస్
హే పార్వతీ నాథ - సీతా రామ కల్యాణం
హిమగిరి సొగసులు - పాండవ వనవాసం
ఇనుప కచ్చడాల్ గట్టిన - సీతా రామ కల్యాణం
జగదభి రాముడు - లవకుశ
జగదేక మాత గౌరీ - సీతా రామ కల్యాణం
జగములనేలే - శ్రీ కృష్ణావతారం
జనకుండు సుతుడు - సీతా రామ కల్యాణం
జననీ శివ కామినీ - నర్తనశాల
జయ గణ నాయక - నర్తనశాల
జయ గోవింద మాధవ - సీతా రామ కల్యాణం
జయ జయ రామా శ్రీ రామ - లవకుశ
కానరార కైలాస నివాస - సీతా రామ కల్యాణం
కొలుపుగ బ్రహ్మ వంశమున పుట్టి - సీతా రామ కల్యాణం
మదిలోని - జయ సిం హ
నా చందమామ - పాండవ వనవాసం
నల్లని వాడైనా ఓ చెలీ - శ్రీ కృష్ణ పాండవీయం
నరవరా ఓ కురువరా - నర్తనశాల
నీల కంధరా దేవా - భూకైలాస్
నెలతా ఇటువంటి నీ మాట - సీతా రామ కల్యాణం
ఓ సుకుమార నిను గని - సీతా రామ కల్యాణం
నీ సరి మనోహరి - బబ్రువాహన 
పద్మాసనే పద్మిని- సీతా రామ కల్యాణం
పరమ శివాచారులలో - సీతా రామ కల్యాణం
పూని బొమ్మకు ప్రాణము - సీతా రామ కల్యాణం
ప్రీతి నార్తుల నాదరించు - శ్రీ కృష్ణ పాండవీయం
ప్రేలితివెన్నొమార్లు - నర్తనశాల
రాముని అవతారం - భూ కైలాస్
రామ కథను వినరయ్యా -లవకుశ
సైకత లింగంబు - భూకైలాస్
సఖియా వివరించవే - నర్తనశాల
సందేహింపకుమమ్మా - లవకుశ 
సరసాల జవరాలను - సీతా రామ కల్యాణం
షష్టిర్యోజన - సీతా రామ కల్యాణం 
శీలవతీ నీ గతి - నర్తనశాల
శ్రీ సీతా రాముల కల్యాణము - సీతా రామ కల్యాణం
శ్రీ రామ పరంధామ - లవకుశ
శ్రీ రాముని చరితమును -లవకుశ
సుందరాంగా అందుకోరా - భూకైలాస్
తగునా వరమీయ - భూ కైలాస్
యదు మౌళీ - దీపావళి
వీణా పాడవే - సీతా రామ కల్యాణం
వేయి కన్నులు - సీతా రామ కల్యాణం
విధి వంచితులై - పాండవ వన వాసం
వినుడు వినుడు - లవకుశ
విరిసే చల్లని వెన్నెల - లవకుశ
వూరకే కన్నీరు నింప -లవకుశ
(rachaitulu::Kameswara Rao Annapindi)