సంగీత::అశ్వద్థామ
రచన::ఉషః శ్రీ
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::శోభన్ బాబు,గుమ్మడి,రాజబాబు,సావిత్రి,విజయనిర్మల,విజయలలిత,మీనాకుమారి
పల్లవి::
నీలాలా నింగిపై...చందమామా
నువు రేయంతా తిరిగావూ చందమామా
నీలాలా నింగిపై...చందమామా
నువు రేయంతా తిరిగావూ చందమామా
చరణం::1
మబ్బులో మాయమై..మనసులో లీనమై
మబ్బులో మాయమై..మనసులో లీనమై
చీకట్లూ చీల్చుతూ..చిరుకాంతి చల్లుతూ
చెంగలువ చెలియతో..చెలియపై ప్రేమతో
వనమంతా తిరిగావూ..వన్నెలే కూర్చావూ
నీలాలా..నీలాలా..నింగిపై చందమామా
నువు రేయంతా..తిరిగావూ చందమామా
నువు రేయంతా..తిరిగావూ చందమామా
చరణం::2
నింగిలోంచి నిలిచి చూస్తూ..చల్లనీ వెన్నెలనూ
నింగిలోంచి నిలిచి చూస్తూ..చల్లనీ వెన్నెలనూ
ఇంపుగా చిలుకుతూ..వింతకాంతులొలుకుతూ
ఒళ్ళంతా పులిమావూ..వలపు వేడి రేపావూ
ఒంటరైన నన్ను చూచి..వంకరగా నవ్వావూ
నీలాలా..ఊయ్ యహా..నీలాలా..నింగిపై చందమామా
నువు రేయంతా తిరిగావూ చందమామా
నువు రేయంతా తిరిగావూ చందమామా
చరణం::3
మనసులో మమత నింపి..వయసులో వలపు జల్లి
మనసులో మమత నింపి..వయసులో వలపు జల్లి
చుక్కల్లో చిక్కావూ...పక్కకైన రాలేవూ
చెలియపై చెలిమితో...చెలిమిలోని చనువుతో
చల్లనైన వెన్నెలనూ...మెల్లగా కురిసావూ
నీలాలా..అహాహా..నీలాలా నింగిపై చందమామా నువు
రేయంతా తిరిగావూ చందమామా
నువు రేయంతా తిరిగావూ చందమామా
No comments:
Post a Comment