Saturday, June 27, 2009
కాన్నెవయసు --- 1973::రాగం::పీలు
సంగీతం::సత్యం
రచన::దాశరధి
గానం::SP.బాలసుబ్రమణ్యం
రాగం::కాఫీ::పీలు::(హిందుస్తానీ)
(కాఫీ కర్నాటకదేవగాంధారి)
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండి పోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగ
పదము పదములో మధువులూరగ కావ్య కన్యవై రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండి పోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
Labels:
SP.Baalu,
కాన్నెవయసు --- 1973
Subscribe to:
Posts (Atom)