Tuesday, February 06, 2007

జమిందారు గారి అమ్మాయి--1975


సంగీతం::G.K.వెంకటేష్   
రచన::D.C.నారాయణరెడ్డి      
గానం::P.సుశీల  
తారాగణం::శారద,రంగానాద్,రాజబాబు,గుమ్మడి,అల్లు రామలింగయ్య,మమత,గిరిబాబు,కృష్ణకుమారి,మమత.
   
పల్లవి::

ఓఓఓఓ..కొండపల్లి బొమ్మా
కొండపల్లి బొమ్మా..నీ కులుకులు చాలమ్మా
కొండపల్లి బొమ్మా..నీ కులుకులు చాలమ్మా
పరువాలు అందాలూ..పదిలపరచుకోవమ్మా
పదిలపరచుకోవమ్మా
ఓఓఓఓ..కొండపల్లి బొమ్మా

చరణం::1

ఎవరో ఎవరో..వస్తారూ
ఎంతో ఎంతో లాలనగా..చేయి వేస్తారూ
ఎవరో ఎవరో..వస్తారూ
ఎంతో ఎంతో లాలనగా..చేయి వేస్తారూ
వచ్చిన ప్రతివారూ..నీ విలువ లెరుగలెరూ
వచ్చిన ప్రతివారూ..నీ విలువ లెరుగలెరూ 
మెచ్చిన ప్రతిమనసూ..మనసిచ్చుకోలేదూ
మనసిచ్చుకోలేదూ
ఓఓఓఓ..కొండపల్లి బొమ్మా..నీ కులుకులు చాలమ్మా
పరువాలు అందాలూ పదిలపరచుకోవమ్మా పదిలపరచుకోవమ్మా 

చరణం::2

మెరిసే అందంలో లేనిదీ..చల్లగ విరిసే ఆత్మలోనే ఉన్నదీ
అంగడిలో నిలిపిన బొమ్మకు..ఖరీదు కడతారూ
అంగడిలో నిలిపిన బొమ్మకు..ఖరీదు కడతారూ
ఆలయాన వెలసిన..బొమ్మకు 
హారతి పడతారూ..హారతి పడతారూ 
ఓఓఓఓ..కొండపల్లి బొమ్మా నీ కులుకులు చాలమ్మా
పరువాలు అందాలూ పదిలపరచుకోవమ్మా..పదిలపరచుకోవమ్మా