Friday, February 03, 2017

చిన్నారి స్నేహం--1989




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::బాలు,శైలజ,సుశీల,రమేష్.
Film Directed By::Muthyala Subbaiah
తారాగణం::చంద్రమోహన్,రఘు,దగ్గుబాటిరాజా,అల్లురామలింగయ్య,నర్రా,రాళ్ళపల్లి,వేలు,సీత,శ్రీదుర్గ,పూజ,అంజలిదేవి,మాలశ్రీ.  

పల్లవి::

లాలలలా లాలలలా లా
లాలలలా లాలలలా లా

చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానె రాసుకో
మనసైతే మళ్ళి..చదువుకో..ఓఓఓఓఓ
మరు జన్మ కైన కలుసుకో..ఓఓఓఓఓ
ఏ నాటి కేమవుతున్నా..ఏ గూడు నీదవుతున్న
హాయి గానే సాగిపో..ఓఓ

చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానె రాసుకో

చరణం::1
:
జీవితం నీకోసం..స్వాగతం పలికింది
ఆశలే వెలిగించి..హారతులు ఇస్తుంది
ఆకాశమంతా ఆలయం..నీకోసం కట్టుకుంది
కళ్యాణ తోరణాలుగా..నీ బ్రతుకే మార్చుతుంది
స్నేహం పెంచుకుంటుంది..ప్రేమే పంచమంటుంది
కాలం కరిగిపొతుంటే..కలగ చెదిరి పోతుంది
మాసిపోని గాయమల్లె..గుండె లోనే ఉంటుంది

చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానె రాసుకో

చరణం::2

లా లలల లా లలల లా లలల లలలలా
లా లలల లా లలల లా లలల లలలలా
ఆశయం కావాలి..ఆశలే తీరాలి
మనిషిలొ దేవున్ని..మనసుతో గెలవాలి
అందాల జీవితానికో..అనుబంధం చూసుకో
అనురాగమైన లోకమే..నీ సొంతం చేసుకో
లోకం చీకటవుతున్న..బ్రతుకే భారమవుతున్న
మనసే జ్యోతి కావాలి..మనిషే వెలుగు చూపాలి
మరో ప్రపంచ మానవుడిగా..ముందు దారి చూడాలి

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథ గానె రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో..ఓఓఓఓ
మరు జన్మ కైన కలుసుకో..ఓఓఓఓ
ఏ నాటి...కేమవుతున్నా 
ఏ గూడు...నీదవుతున్న
హాయి గానే...ఆడుకో
చిన్నారి స్నేహమా..చిరునామా తీసుకో
గతమైన జీవితం..కథ గానె రాసుకో

Maatrudevobhava--1993
Music::Chakrarvathy
Lyrics::Veturisundararaammoorti
Singer::S.P.Baalu,P.Suseela,S.P.Sailaja,Ramesh.
Film Directed By::Muthyala Subbaiah
Cast::ChandraMohan,Raghu,Seetha,Malasri

:::::::::::::::::::::::::::::::::::::

laalalalaa laalalalaa laa
laalalalaa laalalalaa laa

chinnaari snEhamaa..chirunaamaa teesukO
gatamaina jeevitam..katha gaane raasukO
manasaitE maLLi..chaduvukO..OOOOO
maru janma kaina kalusukO..OOOOO
E naaTi kEmavutunnaa..E gooDu needavutunna
haayi gaanE saagipO..OO

chinnaari snEhamaa..chirunaamaa teesukO
gatamaina jeevitam..katha gaane raasukO

::::1

jeevitam neekOsam..svaagatam palikindi
aaSalE veliginchi..haaratulu istundi
aakaaSamantaa aalayam..neekOsam kaTTukundi
kaLyaaNa tOraNaalugaa..nii bratukE maarchutundi
snEham penchukunTundi..prEmE panchamanTundi
kaalam karigipotunTE..kalaga chediri pOtundi
maasipOni gaayamalle..gunDe lOnE unTundi

chinnaari snEhamaa..chirunaamaa teesukO
gatamaina jeevitam..katha gaane raasukO

::::2

laa lalala laa lalala laa lalala lalalalaa
laa lalala laa lalala laa lalala lalalalaa

aaSayam kaavaali..aaSalE teeraali
manishilo dEvunni..manasutO gelavaali
andaala jeevitaanikO..anubandham choosukO
anuraagamaina lOkamE..nee sontam chEsukO
lOkam cheekaTavutunna..bratukE bhaaramavutunna
manasE jyOti kaavaali..manishE velugu choopaali
marO prapancha maanavuDigaa..mundu daari chooDaali

chinnaari snEhamaa chirunaamaa teesukO
gatamaina jeevitam katha gaane raasukO
manasaitE maLLi chaduvukO..OOOO
maru janma kaina kalusukO..OOOO
E naaTi...kEmavutunnaa 
E gooDu...needavutunna
haayi gaanE...saagipO
chinnaari snEhamaa..chirunaamaa teesukO
gatamaina jeevitam..katha gaane raasukO

మాతృదేవోభవ--1993




సంగీతం::MM.కీరవాణి
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::MM.కీరవాణి
Film Directed By::K.Ajayakumar
తారాగణం::నాజార్,మాధవి,బ్రంహానందం,తణికెళ్ళభరణి,అల్లురామలింగయ్య,నిర్మలమ్మ,    

పల్లవి::

రాలిపోయె పువ్వా..నీకు రాగాలెందుకే
తోటమాలి నీ..ఈఈఈ..తోడులేడులే
వాలిపోయె పొద్దా నీకు..వర్ణాలెందుకే
లోకమెన్నడో..ఓఓ..చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా..ఆఆఆ 
కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ..ఈ..తోడులేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే..ఏఏ
లోకమెన్నడో చీకటాయెలే..ఏఏఏఏఏ

చరణం::1

చెదిరింది నీ గూడు..గాలిగా 
చిలకా గోరింకమ్మ..గాధగా 
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా 
తనవాడు తారల్లో..చేరగా
మనసు మాంగళ్యాలు..జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా..ఆ
తిరిగే భూమాతవు నీవై..వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై..ఆశలకే హరతివై 

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ..ఈ..తోడులేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే 

చరణం::2

అనుబంధమంటేనె అప్పులే
కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగల చేమంతులే వాడిపోయే..ఏఏఏఏ..ఆ
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పొయే..ఏఏఏఏఏ
పగిలే ఆకాశం నీవై..ఈ..జారిపడే జాబిలివై..ఇ
మిగిలే ఆలాపన నీవై..ఈ..తీగ తెగే వీణియవై..ఈ

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ..ఈ..తోడులేడులే..
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో..ఓఓఓఓ..చీకటాయెలే..ఏఏఏఏ

Maatrudevobhava--1993
Music::MM.Keeravaani
Lyrics::Veturisundararaammoorti
Singer::MM.Keeravaani
Film Directed By::K.Ajayakumar
Cast::Nassar,Madhavi,Brahmanandam,Tanikellabharani,Alluraamalingayya,Nirmalamma,Y.Vijaya,Chaaruhaasan,

:::::::::::::::::::::::::::::::::::::

raalipOye puvvaa..neeku raagaalendukE
tOTamaali nii..iiiiii..tODulEDulE
vaalipOye poddaa neeku varNaalendukE
lOkamennaDO..OO..cheekaTaayelE
neekidi telavaarani rEyammaa..aaaaaa 
kalikii maa chilakaa paaDaku ninnaTi nii raagam

raalipOye puvvaa neeku raagaalendukE
tOTamaali nii..ii..tODulEDulE
vaalipOye poddaa neeku varNaalendukE..EE
lOkamennaDO cheekaTaayelE..EEEEE

::::1

chedirindi nii gooDu..gaaligaa 
chilakaa gOrinkamma..gaadhagaa 
chinnaari roopaalu kanneeTi deepaalu kaagaa 
tanavaaDu taarallO..chEragaa
manasu maangaLyaalu..jaaragaa
sindhoora varNaalu tellaari challaari pOgaa..aa
tirigE bhoomaatavu neevai..vEkuvalO vennelavai
karigE karpooramu neevai..aaSalakE harativai 

raalipOye puvvaa neeku raagaalendukE
tOTamaali nii..ii..tODulEDulE
vaalipOye poddaa neeku varNaalendukE 

::::2

anubandhamamTEne appulE
karigE bandhaalannii mabbulE
hEmanta raagala chEmantulE vaaDipOyE..EEEEE..aa
tana rangu maarchindi..raktamE
tanatO raalEnandi..paaSamE
deepaala panDakki deepaale konDekki poyE..EEEEE
pagilE aakaaSam neevai..ii..jaaripaDE jaabilivai..ii
migilE aalaapana neevai..ii..teega tegE veeNiyavai..ii

raalipOye puvvaa neeku raagaalendukE
tOTamaali nii..ii..tODulEDulE..E
vaalipOye poddaa neeku varNaalendukE
lOkamennaDO..OOOO..cheekaTaayelE..EEEEE

అమ్మదొంగా--1995




సంగీతం::కోటి
రచన::వేటూరి సుందరరామ మూర్తి
గానం::మనో,K.S.చిత్ర,S.P.శైలజ
Film Directed By::Saagar
తారాగణం::కృష్ణ,సౌధర్య,ఆమని,         

పల్లవి::

ఏదో మనసు పడ్డాను గానీ
కల్లో కలుసుకున్నాను గానీ
నీపై ప్రేమా..ఆ..ఏమో..ఓ..నాలో..ఓఓ

ఏదో మనసు పడ్డానుగానీ
ఎంతో అలుసు అయ్యాను గానీ
నాపై ప్రేమో..ఓ..ఏమో..ఓ..బోలో..ఓ

రావా..ఆ..పడుచు మది తెలుసుకొనలేవా..ఆ 
తపనపడు తనువు ముడి మనువై
మమతై మనదైపోయె..అనురాగాలు కలనే

చరణం::1

ఒక హృదయం..పలికినది
జతకోరే జతులు..శ్రుతులు కలిపి
ఒక పరువం పిలిచినది..ప్రేమించి 
ఒక అందం మెరిసినది ఎదలోనే చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేధించి..ఈ
తెలుసా తేటిమనసా పూలవయసేమంటుందో
తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో
ఓ భామా రమ్మంటే నీ ప్రేమా బాధే సరి
మెడ ఉరి గడుసరి..సరిసరిలే

ఏదో మనసు పడ్డానుగానీ
ఎంతో అలుసు అయ్యాను గానీ
నాపై ప్రేమో..ఓ..ఏమో..ఓ..బోలో..ఓ

చరణం::2

ఒక మురిపెం..ముదిరినది 
మొగమాటం మరిచి ఎదుట నిలిచి
ఒక అధరం వణికినది ఆశించి..ఈ
ఒక మౌనం తెలిసినది నిదురించి కలలు కనుల నిలిపి
ఒక రూపం..అలిగినది వాదించి
బహుశా బావ సరసాలన్నీ..విర సాలాయెనేమో
ఇక సాగించు జతసాగించు..మనసే ఉన్నదేమో
ఓ పాపా..ఆ..నిందిస్తే..నా పాపం
నాదేమరి విధిమరి విషమని మరి తెలిసే

ఏదో మనసు పడ్డాను గానీ
కల్లో కలుసుకున్నాను గానీ
నీపై ప్రేమా..ఆ..ఏమో..ఓ..నాలో..ఓఓ

ఏదో మనసు పడ్డానుగానీ
ఎంతో అలుసు అయ్యాను గానీ
నాపై ప్రేమో..ఓ..ఏమో..ఓ..బోలో..ఓ

రావా..ఆ..పడుచు మది తెలుసుకొనలేవా..ఆ 
తపనపడు తనువు ముడి మనువై
మమతై మనదైపోయె..అనురాగాలు కలనే

Amma Donga--1995
Music::Koti
Lyricis::Veturi Sundararama Murthy
Singer::Mano,K.S.Chitra,S.P.Sailaja
Film Directed By::Saagar
Cast::Krishna,Sowdharya,Amani.

::::::::::::::::::::::::::::::::::::::::::::

EdO manasu paDDaanu gaanii
kallO kalusukunnaanu gaanii
neepai prEmaa..aa..EmO..O..naalO..OO

EdO manasu paDDaanugaanii
entO alusu ayyaanu gaanii
naapai prEmO..O..EmO..O..bOlO..O

raavaa..aa..paDuchu madi telusukonalEvaa..aa 
tapanapaDu tanuvu muDi manuvai
mamatai manadaipOye..anuraagaalu kalanE

::::1

oka hRudayam..palikinadi
jatakOrE jatulu..Srutulu kalipi
oka paruvam pilichinadi..prEminchi 
oka andam merisinadi edalOnE chilipi valapu chiliki
oka bandham bigisinadi vEdhinchi..ii
telusaa tETimanasaa poolavayasEmanTundO
telisi chanTi manasE kanTi nalusai pOtundO
O bhaamaa rammanTE nii prEmaa baadhE sari
meDa uri gaDusari..sarisarilE

EdO manasu paDDaanugaanii
entO alusu ayyaanu gaanii
naapai prEmO..O..EmO..O..bOlO..O

::::2

oka muripem..mudirinadi 
mogamaaTam marichi eduTa nilichi
oka adharam vaNikinadi aaSinchi..ii
oka maunam telisinadi nidurinchi kalalu kanula nilipi
oka roopam..aliginadi vaadinchi
bahuSaa baava sarasaalannii..vira saalaayenEmO
ika saaginchu jatasaaginchu..manasE unnadEmO
O paapaa..aa..nindistE..naa paapam
naadEmari vidhimari vishamani mari telisE

EdO manasu paDDaanu gaanii
kallO kalusukunnaanu gaanii
neepai prEmaa..aa..EmO..O..naalO..OO

EdO manasu paDDaanugaanii
entO alusu ayyaanu gaanii
naapai prEmO..O..EmO..O..bOlO..O

raavaa..aa..paDuchu madi telusukonalEvaa..aa 
tapanapaDu tanuvu muDi manuvai
mamatai manadaipOye..anuraagaalu kalanE