Sunday, June 03, 2007

మనోరమ--1959::హంసనాదం::రాగం
సంగీతం::రమేష్ నాయుడు
రచన::సముద్రాల రామానుజాచార్య(జునియర్) 
గానం::తలత్ మహమద్


రాగం::హంసనాదం
{హిందుస్తానీ శుద్ధసారంగ్} చూడండి

అందాల సీమా సుధా నిలయం

ఈ లోకమే దివ్య ప్రేమ మయం
అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమ మయం

వలపేమొ తెలియకా తెలవారు బ్రతుకేలా
తొలినాటి ప్రేమలు ఫలమైన కలయినా
మాయనీ గాయమై మిగిలినా అభినయం
మాయనీ గాయమై మిగిలినా అభినయం
అందాల
అందాల వెలుగులో అలరారు ఆనందం
అలరించు సొగసునా ఆనందమున తేలే
తీయనీ అనుభవం దేవుని పరిచయం
తీయనీ అనుభవం దేవుని పరిచయం
అందాల

పూజాఫలం--1964::హిందోళం :: రాగం

 రాగం::హిందోళం 

సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::
D.C.నారాయణరెడ్డి
గానం::P సుశీల


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.......
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే......
పగలె వెన్నెల
నింగిలోన చందమామ తోంగి చూచే
నీటిలోన కలువభామ పోంగి పూచే.....
యీ అనురాగమే జీవనరాగమై
యీ అనురాగమే జీవనరాగమై
యెదలొ తేనేజల్లు కురిసిపోగా
పగలె వెన్నెల
కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళిపాట విన్ననాగు సిరసునూపే.....
యీ అనుబంధమే మధురానందమై
యీ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిచిపోగా
పగలె వెన్నెల
నీలి మబ్బు నీడలెచి నెమలి ఆడె
పూలరుతువు సైగ జూసి శిఖము పాడె....
నీలి మబ్బు నీడలెచి నెమలి ఆడె
పూలరుతువు సైగ జూసి శిఖము పాడె
మనసే వీణగా ఝుం ఝుమ్మున మ్రోయగా 2
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా.....

పగలె వెన్నెల