Friday, July 11, 2014

అమ్మాయి పెళ్ళి--1974



సంగీతం::P.భానుమతి,సత్యం
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::మాధవపెద్ది సత్యం,పిఠాపురం నాగేశ్వరరావు,చాయాదేవి
తారాగణం::N.T.రామారావు,P.భానుమతి,చంద్రమోహన్,వెన్నెరాడై నిర్మల,లత,పద్మనాభం. 

పల్లవి::

గుడుగుడుగుడు చెడుగుడు
బలె బలె బలె చెడుగుడు
గుడుగుడుగుడు చెడుగుడు
బలె బలె బలె చెడుగుడు 
ఒక చక్కని చుక్కని చూశాను
ఉక్కిరి బిక్కిరి అయ్యానూ
ఒక చక్కని చుక్కని చూశాను
ఉక్కిరి బిక్కిరి అయ్యానూ
గుడుగుడుగుడు చెడుగుడు
బలె బలె బలె చెడుగుడు 

చరణం::1

సా..సా..సా..సా 
ఎంతో బాగున్నదిరా
పిల్ల ఎంతో బాగున్నదిరా
నేనేమని పొగడేదిరా
పిల్ల ఎంతో బాగున్నదిరా
నా జానీ అలివేణీ పూబోణీ బఠాణీ
పిల్ల ఎంతో బాగున్నదిరా

చరణం::2

అరె బ్యూటీరాణీ వున్నదిరా
బొమ్మలాగ నుంచున్నదిరా
అరె బ్యూటీరాణీ వున్నదిరా
బొమ్మలాగ నుంచున్నదిరా
మరబొమ్మలా నడుస్తున్నదిరా
ఆ పిల్లకొసమై తల్లకిందుగా
ఆ పిల్లకొసమై తల్లకిందుగా
తపస్సైన చేస్తానూ
పస్తులైన పడివుంటానూ
నే పస్తులైన పడివుంటానూ

చరణం::3

ఆ పిల్లను నేనూ చంకనేసుకొని 
చంద్రమండలం పోతానోయ్నే
చంద్రమండలం పోతానోయ్
చంద్రమండలం పొయ్యావంటే 
జర్రున జారి పడతావోయ్ను
వ్వు జర్రున జారి పడతావోయ్
నే జర్రున జారి అమ్మయి ఒళ్ళో 
సపుక్కునొచ్చి పడతానోయ్  
గుడుగుడుగుడు చెడుగుడు
బలె బలె బలె చెడుగుడు
హల్లో హల్లో ఓ లేడి
మన యిద్దరికి సరియైన జోడీ
హల్లో హల్లో మై లేడి
నొర్మూసుకొవొయ్ బోడీ
నాన్సెన్స్..ఏమిటే నిరక్షర కుక్షీ
ఏడిసావ్ లేరా పక్షీ
ఏమన్నావే కామాక్షీ
మీనాక్షీ లేపాక్షీ శబలాక్షి   
ఎవరే పక్షి ఎవరే నువ్వన్నావ్ బక్షీ  
నునునునునువ్వే నెనెనెనెనేనా
నునునునునువ్వే నెనెనెనెనేనా
మిమిమిమిమీరే మీ బుడిబుడి 
గుండ్రాలేమిట్రా చెడుకుడులో సత్తా చూపిండ్రా 
మీ బుడిబుడి గుండ్రాలేమిట్రా
చెడుకుడులో సత్తా చూపిండ్రా
గుడుగుడుగుడు చెడుగుడు
బలె బలె బలె చెడుగుడు 
గుడుగుడుగుడు చెడుగుడు
బలె బలె బలె చెడుగుడు 
గుడుగుడు గుడుగుడు 
గుడుగుడు గుడుగుడు

అమ్మాయి పెళ్ళి--1974



సంగీతం::P.భానుమతి,సత్యం
రచన::దాశరథి
గానం::P.భానుమతి
తారాగణం::N.T.రామారావు,P.భానుమతి,చంద్రమోహన్,వెన్నెరాడై నిర్మల,లత,పద్మనాభం. 

పల్లవి::

నా..ఆ..కనుల ముందరా నువ్వుంటే 
నీ..ఈ..మనసునిండా నేనుంటే
లేనిదేమిటీ లోకంలో..ఉన్నదేమిటా స్వర్గంలో  
నా..ఆ..కనుల ముందరా నువ్వుంటే 
నీ..ఈ..మనసునిండా నేనుంటే
లేనిదేమిటీ లోకంలో..ఉన్నదేమిటా స్వర్గంలో  

చరణం::1

నా మదిలో..ఓ..నా మదిలో నా..ఆ..మదిలో 
కలలన్నీ..ఈ..ఈ..నదిలో అలలైతే 
ఆ అలల నావపై..నీవూ నేనూ..ఊ
తేలిపొదామూ..జతగా సాగిపొదామూ
ఈ నవ్వులతో జీవితమే..కళకళ కళకళ లాడగ
నా..ఆ..కనుల ముందరా నువ్వుంటే 
నీ..ఈ..మనసునిండా నేనుంటే
నా..ఆ..కనుల ముందరా నువ్వుంటే 
నీ..ఈ..మనసునిండా నేనుంటే
లేనిదేమిటీ లోకంలో..ఓ..ఉన్నదేమిటా స్వర్గంలో   

చరణం::2

నీ ప్రేమే..ఏఏఏ..నీ ప్రేమే..నీ..ఈ..ప్రేమే 
పెన్నిధిగా..నీ..ఈ..సేవే నా విధిగా
ఆ..మమతలన్నీ..ఈ..నీవూ నేనూ..ఊ 
పంచుకుందామూ..జతగా పంచుకుందామూ
మన యిల్లంతా పిల్లలతో..కిలకిల కిలకిలలాడగ
నా..ఆ..కనుల ముందరా నువ్వుంటే
నీ..ఈ..మనసునిండా నేనుంటే
లేనిదేమిటీ లోకంలో..ఓ..ఉన్నదేమిటా స్వర్గంలో
ఉన్నదేమిటా స్వర్గంలో..ఉన్నదేమిటా స్వర్గంలో  

అమ్మ మనసు--1974



సంగీతం::K.V.మహాదేవన్
రచన::దేవులపల్లికృష్ణ శాస్త్రి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభK.విజయ,చలపతిరావు 

పల్లవి::

లలలా లలలలలా లలలా లలలలలా లలలలాల
అన్ని బంధాలు తెంచుకొని..ఏ తల్లి కని పారేస్తుంది?
ఏ భరించ లేని బాధ..బంధాలను తెంచేస్తుంది
లేకపోతే నవమాసాలు మోసి..కన్నబిడ్డను ఏ తల్లి దూరం చేసుకొంటుంది

ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు 
ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు
కన్నతల్లికే తెలుసు ఎన్నేళ్ళో..కన్నీళ్ళకే తెలుసు..ఎన్నేళ్ళో 
ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు 

చరణం::1

ఏడుకొండలవాడు..కాపాడుతుంటే 
ఏడేడు కలిసి..నూరేళ్ళు..ఊ ఊ ఊ 
ఏడుకొండలవాడు..కాపాడుతుంటే 
ఏడేడు కలిసి..నూరేళ్ళు..ఊ
విడువని తల్లీ..అలుమేలుతల్లీ 
వేయేళ్ళంటే..వేయేళ్ళు..ఊ 
అమ్మ కడుపు చల్లగా..అత్తకడుపు చల్లగా 
అంతకంతగా..పెరిగి వర్ధిల్లు..ఊ
ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు 

చరణం::2

చిన్నికృష్ణమ్మకు..జిలుగు పట్టు షరాయి
చిలిపి గోపాలునకు..తళుకు నెమలి తురాయి
చిన్నికృష్ణమ్మకు..జిలుగు పట్టు షరాయి
చిలిపి గోపాలునకు..తళుకు నెమలి తురాయి
ఇందరిలో ఈనాడు..అందాల పాపాయి 
యశోదమ్మ కన్నయ్యవు..నీవేనోయీ..ఈ 
కన్న ఆ దేవకీ..కన్నీటి పాపాయి 
ఇదే పట్టు షరాయి..ఇదే నెమలి తురాయి
ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు 

చరణం::3

చిరుబుగ్గల..నీ తల్లీ చెక్కిట ఆనించి
ఏదీ ఒక్కసారి..అమ్మా అను
చిరుబుగ్గల..నీ తల్లీ చెక్కిట ఆనించి
ఏదీ ఒక్కసారి..అమ్మా అను
చిట్టిచేతులు చుట్టూ..గట్టిగ పెనవేసీ 
ఏదీ ఒక్కసారి..అమ్మా అను 
ఏదీ ఒక్కసారి..అమ్మా అను..ఊ

ఏజెంట్ గోపి--1978



సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,జయమాలిని,హలం

పల్లవి::

నువ్వు నేను..ఉన్నాము ఒంటరిగా..ఆఆ
ఏదో..ఏదో..చేయాలి తొందరగా..ఆ
వలచిన చెలి..బిగికౌగిలి
వదలదు నిన్నూ..ఊ ఊ ఊ..హా

చరణం::1

నీ కోసం ఇందాక కాపేసానూ
నీ సామాను భద్రంగ దాచేసానూ
నీ కోసం ఇందాక కాపేసానూ
నీ సామాను భద్రంగ దాచేసానూ
వలపించనా..పులకించనా నీదరి చేరనా..ఆ

నువ్వు నేను..ఉన్నాము ఒంటరిగా..ఆఆ
ఏదో..ఏదో..చేయాలి తొందరగా..ఆ

Agent Gopi--1978 
Music::Satyam
Lyrics::Daasarathi
Singer's::P.Suseela
Cast::Krishna,Jayaprada,Prabhakar reddi,Padmanaabham,Jayamaalini,Halam.

:::

nuvvu nEnu..unnaamu onTarigaa..AA
EdO..EdO..chEyaali tondaragaa..aa
valachina cheli..bigikougili
vadaladu ninnuu..uu uu uu..haa

:::1

nee kOsam indaaka kaapEsaanuu
nee saamaanu bhadranga daachEsaanuu
nee kOsam indaaka kaapEsaanuu
nee saamaanu bhadranga daachEsaanuu
valapinchanaa..pulakinchanaa needari chEranaa..aa

nuvvu nEnu..unnaamu onTarigaa..AA
EdO..EdO..chEyaali tondaragaa..aa

రాజు రాణి జాకి--1983




సంగీతం::రాజన్-నాగేద్ర
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,రాధిక,రాజేంద్రప్రసాద్,రంగనాథ్,దేవదాస్‌కనకాల,గిరిబాబు,సత్తిబాబు,జయభాస్కర్,జయదేవ.

పల్లవి::

కాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం

ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం

చరణం::1

మందార మకరందాలే కురిసింది సుందరహాసం
మందార మకరందాలే కురిసింది సుందరహాసం
మమతలే పరిమళమై హృదయాలు పరవశమై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

శృంగార సుమభాణాలే విసిరింది సంధ్యారాగం
శృంగార సుమభాణాలే విసిరింది సంధ్యారాగం
ప్రణయమే ప్రణవమనే అందాల అనుభవమే..ఏ 
ఈ చైత్రవేళలలోన ఆలాపనై
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం

చరణం::2

నా లేత యవ్వనమల్లె విరిసింది మల్లెలమాసం
నా లేత యవ్వనమల్లె విరిసింది మల్లెలమాసం
మనసులే తనువులుగా మధుమాస కోకిలలై
ఆ ఆ ఆ ఆ హ్హా ఆ ఆ ఆ ఓ ఓ ఓ
నా కొంటె కోరికలేవొ కొసరింది తుమ్మెద నాదం
నా కొంటె కోరికలేవొ కొసరింది తుమ్మెద నాదం
పరువమే స్వరములుగా సనజాజి సంకెలలై
హేమంత రాత్రులలోన..హిమవీణలై

ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం
ఆ గీతమంతా పలికించే అనురాగాలు మనకోసం
ఆకాశవీధులలోన వినిపించింది ఓ మౌనగీతం

Raaju-Raani-Jaaki--1991
Music::Raajan-Naagaedra
Lyrics::VeeToori
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::ChandramOhan,Raadhika,Raajendraprasaad^,Ranganaath,devadaas Kanakaala,Giribaabu,Sattibaabu,Jayabhaaskar,Jayadeva.

:::

aakaaSaveedhulalOna vinipinchindi O maunageetam
aa geetamantaa palikinche anuraagaalu manakOsam

aakaaSaveedhulalOna vinipinchindi O maunageetam
aa geetamantaa palikinche anuraagaalu manakOsam
aakaaSaveedhulalOna vinipinchindi O maunageetam

:::1

mandaara makarandaale kurisindi sundarahaasam
mandaara makarandaale kurisindi sundarahaasam
mamatale parimaLamai hRdayaalu paravaSamai
aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa 

SRngaara sumabhaaNaale visirindi sandhyaaraagam
SRngaara sumabhaaNaale visirindi sandhyaaraagam
praNayamE praNavamanE andaala anubhavamE..E 
ii chaitraveLalalOna aalaapanai
aakaaSaveedhulalOna vinipinchindi O maunageetam

:::2

naa leta yavvanamallE virisindi mallelamaasam
naa leta yavvanamallE virisiMdi mallelamaasam
manasulE tanuvulugaa madhumaasa kOkilalai
aa aa aa aa hhaa aa aa aa O O O
naa konTe kOrikalEvO kosarindi tummeda naadam
naa konTe kOrikalEvO kosarindi tummeda naadam
paruvamE svaramulugaa sanajaaji sankelalai
hEmanta raatrulalOna..himaveeNalai

aakaaSaveedhulalOna vinipinchindi O maunageetam
aa geetamantaa palikinche anuraagaalu manakOsam
aakaaSaveedhulalOna vinipinchindi O maunageetam