Wednesday, December 15, 2010

జయం మనదే--1956




సంగీతం::ఘంటసాల
రచన::జంపన   
గానం::P.లీల

పల్లవి::

కలువలరాజా కథ వినరావా
కదిలే మదిలో రగిలె నిరాశా 
కదిలే మదిలో..ఓఓఓ..కదిలే మదిలో
రగిలె నిరాశా...కలువలరాజా కథ వినరావా

చరణం::1

చూచి చూచి..పూలన్ని రాలె
కలికి కోకిలా..జాలిగాపాడె 
చూచి చూచి..పూలన్ని రాలె
కలికి కోకిలా..జాలిగా పాడె
ప్రియుని జేరి..ఒకసారి పిలువవోయ్‌
ప్రియుని జేరి..ఒకసారి పిలువవోయ్‌
కంటిముత్యాలె..కాన్కసేతునోయ్‌ 

కలువలరాజా కథ వినరావా

చరణం::2

వెదకి వెదకి వేసారినానోయ్ 
హృదయ వేదనా..ఎరిగింప లేనోయ్‌
వెదకి వెదకి వేసారినానోయ్ 
హృదయ వేదనా..ఎరిగింప లేనోయ్‌
చలువరాతి చెరసాల చాలునోయ్‌
చలువరాతి చెరసాల చాలునోయ్‌
సుఖుడే రానిచో నే మనలేనోయ్‌ 
సుఖుడే రానిచో నే మనలేనోయ్‌

కలువలరాజా కథ వినరావా
కలువలరాజా కథ వినరావా
ఓఓఓఓ..రాజా..కథ వినరావా

జయం మనదే--1956




సంగీతం::ఘంటసాల
రచన::కొసరాజు  
గానం::జిక్కి

పల్లవి::

వినవోయీ..ఈ ఈ ఈ..బాటసారి..బాటసారి 
వినవోయీ..బాటసారి..కనవోయీ..ముందుదారి 
వినవోయీ..వినవోయీ..ఈ ఈ..కనవోయీ. 
వినవోయీ..బాటసారి..  
కనవోయీ..ముందు దారి

చరణం::1

కష్టాలు ఎవరికైన..కలకాలం వుండవోయ్‌
కష్టాలు ఎవరికైన..కలకాలం వుండవోయ్‌
ఆనందం అనుభవించు..అవకాశం కలుగునోయ్‌
తగదోయీ పరితాపం..కదలిరావోయ్‌..ఎదురు లేదోయ్‌ 

వినవోయీ..వినవోయీ..కనవోయీ. 
వినవోయీ..బాటసారి..  
కనవోయీ..ముందు దారి

చరణం::2

నిదురబోవులోకాన్ని..చేయితట్టి లేపవోయ్‌
నిదురబోవులోకాన్ని..చేయితట్టి లేపవోయ్‌
అంధకారమంతరించి..వెలుగుజాడ తోచునోయ్‌
కాలం నీకనుకూలం..తలచుకోవోయ్‌..తెలుసుకోవోయ్‌ 

వినవోయీ..వినవోయీ..కనవోయీ. 
వినవోయీ..బాటసారి..  
కనవోయీ..ముందు దారి

చరణం::3


నీరసించు శక్తినంత..చేరదీయ బూనవోయ్‌
నీరసించు శక్తినంత..చేరదీయ బూనవోయ్‌
జీవితమ్ము సార్థకమ్ము..చేయుదారి వెదకవోయ్‌
జనవాక్యం మనదేనోయ్‌..భయము లేదోయ్‌..జయము నీదోయ్‌ 

వినవోయీ..వినవోయీ..కనవోయీ. 
వినవోయీ..బాటసారి..  
కనవోయీ..ముందు దారి

జయం మనదే--1956




సంగీతం::ఘంటసాల
రచన:: కొసరాజు 
గానం::ఘంటసాల

పల్లవి::

దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి

దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి

చరణం::1

దున్నేవాడికి యెక్కడ జూచిన యెన్నో ఈడవలు(?)
అబ్బో యెన్నో..పాడవలు(?)

దున్నేవాడికి చారెడు నేలయు దొరకగ పోదండి 
కష్టం విరగడ కాదండి 

హోయ్..దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి

చరణం::2

రెక్కలు విరుచుక శ్రమ పడువానికి
బొక్కెడు మెతుకులు కరువండి
గుక్కెడు గంజి కరువండి
నిక్కుతు తిరిగే సోమరిపోతుకు ఉక్కిరి బిక్కిరి తిండండి
డొక్కకు మించిన బరువండి 

దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి

చరణం::3

పచ్చని వన్నెల పైరు జొన్న బల్‍ పంట బండి తల వంచింది
బంగారం వలె మెరిసింది 
పచ్చని వన్నెల పైరు జొన్న బల్‍ పంట బండి తల వంచింది
బంగారం వలె మెరిసింది
కాకుల దరిమే కావలి వాడు ఊత బియ్యముకు నోచక ఉసూరుమంటూ
చూస్తూ ఉండే

దేశభక్తిగల అయ్యల్లారా..జాలిగుండెగల అమ్మల్లార! 
ఆలోచించండి న్యాయం ఆలోచించండి..ధర్మం ఆలోచించండి..హేయ్..

జయం మనదే--1956




సంగీతం::ఘంటసాల
రచన::కోసరాజు
గానం::ఘంటసాల,జిక్కి

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్..
అందాల చందమామ..అందాల చందమామ
ఆడదాననోయి..ఆడదాననోయి 
యెందుకో నిన్ను చూతే..యెంతో సిగ్గవుతుందోయి
ఎంతో సిగ్గవుతుందోయి నాకెంతో సిగ్గవుతుందోయి

చరణం::1 

ముందు వెనుకలెందుకే..నీ మూతి ముడుపులెందుకే
మూతి ముడుపులెందుకే..  
ముందు వెనుకలెందుకే..నీ మూతి ముడుపులెందుకే
మూతి ముడుపులెందుకే
సందె పొద్దు పోయే మనకి తందనాలతోనే
సందె పొద్దు పోయే మనకి తందనాలతోనే
చూడ చక్కని చుక్క..ఆఆ..

చరణం::2

ఆఅందరిలోన నీవె అందగాడవోయి..బల్‍ వన్నెకాడవోయి
ఆఅందరిలోన నీవె అందగాడవోయి..బల్‍ వన్నెకాడవోయి
అందచందాలు నీవె..తొందరెందుకోయి
నా అందచందాలు..నీవె తొందరెందుకోయి

అందాల చందమామ
హో హో హో చూడ చక్కని చుక్క!
మ్మ్..అందాల చందమామ ఆడదాననోయి
ఆడదాననోయి..ఆడదాననోయి 
యెందుకో నిన్ను చూతే..యెంతో సిగ్గవుతుందోయి
నా కెంతో సిగ్గవుతుందోయి.. 

జయం మనదే--1956























సంగీతం::ఘంటసాల
రచన::సదాశివబ్రహ్మం 
గానం::ఘంటసాల,జిక్కి,బృందం 

పల్లవి::

హేయ్య..
ఓ ఓ ఓ ఓ ఓ ..ఓ ఓ ఓ ఓ ఓ 
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ 
వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది
కారే పేదల చెమట యేరులై కబళించే రోజొస్తుందోయ్ వస్తుంది
వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది

చరణం::1

ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడ రానంత తీవ్రమై 
ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడ రానంత తీవ్రమై
తుఫాను రూపై ధూము ధాములతో 
తుఫాను రూపై ధూము ధాములతో
ప్రపంచాన్నికదలించే..రోజు వస్తుందోయ్ వస్తుంది
వస్తుందోయ్ వస్తుంది..

చరణం::2

కూటికి గుడ్డకు కుమిలేవాళ్ళను పూరిగుడిసెలను పొర్లేవాళ్ళను 
కూటికి గుడ్డకు కుమిలేవాళ్ళను పూరిగుడిసెలను పొర్లేవాళ్ళను
గర్భదరిద్రుల నుద్ధరించుటకు..గర్భదరిద్రుల నుద్ధరించుటకు
దేవుడు తానై దిగి వచ్చే..రోజొస్తుందోయ్ వస్తుంది  
వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది

చరణం::3

ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో యన్నా లేదు   
ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో యన్నా లేదు 
కొంపలు భగభగ మండేటప్పుడు నూతులు తవ్వి ఫలితం లేదు
వస్తుందోయ్ వస్తుంది..వస్తుందోయ్ వస్తుంది

చరణం::4

అందరు దేవుని బిడ్డలె యంటూ అందరు అన్నలు తంములె యంటూ 
అందరు దేవుని బిడ్డలె యంటూ అందరు అన్నలు తంములె యంటూ
అనురాగం చూపించకపోతే అసూయ పెరిగి విశము గ్రక్కె రోజు
వస్తుందోయ్ వస్తుంది

కారే పేదల చెమట యేరులై కబళించే రోజొస్తుందోయ్ వస్తుంది
చక చక చక వస్తుందోయ్
గబ గబ గబ వస్తుందోయ్ వస్తుంది
ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ