Saturday, July 09, 2011

పుణ్యవతి--1967::కల్యాణి:::రాగం















ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి


సంగీతం::S.హేమాంబరధరావు
రచన::C.నారాయణరెడ్డి,ఘంటసాల

గానం::ఘంటసాల,P.సుశీల

రాగం::కల్యాణి::
:
(బేహాగ్ రాగంలో ఉందని విన్నాను)

మనసు పాడింది సన్నాయి పాట

మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ..తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా
మనసు పాడింది సన్నాయి పాట

జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
తొలిసిగ్గు చిగురించగా..నా అలివేణి తలమాసిరాగ
మనసు పాడింది సన్నాయి పాట

చిలికే పన్నీటి వెన్నెలలోనా..పిలిచే విరజాజి పానుపుపైనా
చిలికే పన్నీటి వెన్నెలలోనా..పిలిచే విరజాజి పానుపుపైనా
వలపులు పెనవేసుకోగా..ఆ..వలపులు పెనవేసుకోగా
నా వనరాజు ననుచేర రాగా
మనసు పాడింది సన్నాయి పాట

మదిలో దాచిన మమతలతేనెలు..పెదవులపైనే కదలాడగా
మదిలో దాచిన మమతలతేనెలు..పెదవులపైనే కదలాడగా
ఎదవులకందనీ మధురిమలేవోప్..ఓ..ఆ..
ఎదవులకందనీ మధురిమలేవోప్
హృదయాలు చవిచూడగా..
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ..తనువు పులకించగా