సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,కృష్ణంరాజు
పల్లవి::
వేణుగానలోలుని గన..వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే
జగము సోలునులే..
వేణుగానలోలుని గన..వేయి కనులు చాలవులే
చరణం::1
చిన్ననాడు గోపెమ్మల చిత్తములలరించి
మన్ను తిన్న ఆ నోటనే మిన్నులన్నీ చూపించి
కాళీయుణి పడగలపై..లీలగా నటియించి
సురలు నరులు మురిసిపొవా..ధరణినేలు గోపాలుణి
వేణుగానలోలుని గన..వేయి కనులు చాలవులే
చరణం::2
అతని పెదవి సోకినంత అమృతము కురిసేను
అతని చేయి తాకినంత బ్రతుకే విరిసేను
సుందర యమునా..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సుందర యమునా తటిలో..సుందర యమునా తటిలో
సుందర యమునా తటిలో..బృందావన సీమలలో
కలసి మెలిసి అలసి సొలసి వలపు తెలుపు వేళలో
వేణుగానలోలుని గన..వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే
జగము సోలునులే
వేణుగానలోలుని గన..వేయి కనులు చాలవులేకో