Tuesday, November 29, 2011

బంగారు తిమ్మరాజు--1964
సంగీతం::SP.కోదండపాణి
రచన::వేటూరి
దర్శకత్వం::G.విశ్వనాథ్
గానం::జమునారాణి
నటీ,నటులు::కాంతారావు,కృష్ణకుమారి


నాగమల్లి కోనలోన..
నక్కింది లేడికూన
నాగమల్లి కోనలోన..
నక్కింది లేడికూన
యరవేసి..హ్హ..గురిచూసి..హ్హా..
పట్టాలి మావా..యరవేసి..గురిచూసి
పట్టాలిమావా..పట్టాలిమావా

చరణం::1

చూపుల్లో కైపుంది..మావ..
సొగసైన రూపుంది మావ..
చూపుల్లో కైపుంది..
సొగసైన రూపుంది
వయ్యారం ఒలికిస్తుంది..
వన్నెలు చిన్నెలు నేర్చింది
హోయ్..ఉడుకు మీద ఉరికావంటే..
దడుసుకొంటదీ దాన్నీ..ఒడుపు చూసి
మచ్చికచేస్తే..వదలనంటది..మావో

నాగమల్లి కోనలోన..
నక్కింది లేడికూన
యరవేసి..హ్హ..గురిచూసి..హ్హా..
పట్టాలిమావా..పట్టాలిమావా

చరణం::2

నడకల్లో హొయలుంది..మావ
నాట్యంలో నేర్పుంది..మావ
నడకల్లో హొయలుంది..నాట్యంలో నేర్పుంది
మలిసందె చీకట్లోన
నీటికి..ఏటికి వస్తుంది
ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది
దాని జాలి చూపు నమ్మావంటే
దగా చేస్తది మావో

నాగమల్లి కోనలోన..
నక్కింది లేడికూన
యరవేసి..హ్హ..గురిచూసి..హ్హా..
పట్టాలిమావా..పట్టాలిమావా

బంగారు తిమ్మరాజు--1964::ఆభేరి::రాగం

చిమ్మటలోని ఈ పాట వినండి
సంగీతం::SP.కోదండపాణి
రచన::ఆరుద్ర
దర్శకత్వం::G.విశ్వనాథ్
గానం::K.J.యేసుదాస్(తొలి పాట)
సంస్థ::గౌరి ప్రొడక్షన్స్
నటీ,నటులు::కాంతారావు,కృష్ణకుమారి

ఆభేరి::రాగం

పల్లవి::


ఓ..నిండుచందమామ..నిగనిగలభామ
ఒంటరిగా సాగలేవు..కలసిమెలసిపోదామా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ..ఓనిండుచందమామ

చరణం::1

నిదురరాని..తీయనిరేయి
నినుపిలిచెను..వలపులహాయి
మధురమైన..కలహాలన్నీ
మనసుపడే..ముచ్చటలాయె
నిదురరాని..తీయనిరేయి
నినుపిలిచెను..వలపులహాయి
మధురమైన..కలహాలన్నీ
మనసుపడే..ముచ్చటలాయె
మేలుకున్న..స్వప్నంలోన
ఏల ఇంత..బిడియపడేవు
మేలుకున్న..స్వప్నంలోన
ఏల ఇంత..బిడియపడేవు
ఏలుకునే..ప్రియుడనుకానా
లాలించగ..సరసకురానా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....
నిండుచందమామ..నిగనిగలభామ
ఒంటరిగా సాగలేవు..కలసిమెలసిపోదామా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ..ఓనిండుచందమామ

చరణం::2

దోరవయసు..ఊహలు..నీలో
దోబూచులు..ఆడసాగె
కోరుకున్న..మురిపాలన్నీ
కొసరికొసరి..చెలరేగె
దోరవయసు..ఊహలు..నీలో
దోబూచులు..ఆడసాగె
కోరుకున్న..మురిపాలన్నీ
కొసరికొసరి..చెలరేగె
నీదుమనసు..నీలోలేదు
నాలోనె..లీనమయె..ఏ..
నీదుమనసు..నీలోలేదు
నాలోనె..లీనమయె..
నేటినుంచి..మేనులు రెండు
నెరజాణ..ఒకటాయే

ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....
నిండుచందమామ..నిగనిగలభామ
ఒంటరిగా సాగలేవు..కలసిమెలసిపోదామా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ..ఓనిండుచందమామ

శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్--1976


సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
దర్శకత్వం::బాపు-రవణ
గానం::S.P.బాలు

నటీ,నటులు::కృష్ణ,జయప్రద,జగ్గయ్య,పద్మనాభం

పల్లవి::

నాపేరు బికారి నాదారి ఎడారి
మనసైనచోట మజిలీ
కాదన్నచాలు బదిలీ..ఈ..
నాదారి ఎడారి నాపేరు బికారి
నాపేరు బికారి నాదారి ఎడారి

చరణం::1

తోటకు తోబుట్టువును..ఏటికి నేబిడ్డను
పాటనాకు సైదోడు..పక్షినాకు తోడు
విసుగురాదు ఖుషీపోదు..వేసటలేనేలేదు
విసుగురాదు ఖుషీపోదు..వేసటలేనేలేదు
అసలునామరోపేరు..ఆనందవిహారి

నాదారి ఎడారి నాపేరు బికారి
నాదారి ఎడారి నాపేరు బికారి

చరణం::2

మేలుకొని కలలుగని..మేఘాలమేడపై
మెరుపుతీగలాంటి..నా ప్రేయసినూహించుకుని
ఇంద్రధనసు..పల్లకి ఎక్కికలుసుకోవాలని..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇంద్రధనసు..పల్లకి ఎక్కికలుసుకోవాలని
ఆకాశవీథిలో..పయనించు బాటసారి

నాదారి ఎడారి నాపేరు బికారి
నాదారి ఎడారి నాపేరు బికారి

చరణం::3

కూటికినేపేదను..గుణములలో..పెద్దను
సంకల్పం నాకు ధనం..సాహసమే నాకు బలం
ఏనాటికొ ఈగరీబు..కాకపోడు నవాబు
ఏనాటికొ ఈగరీబు..కాకపోడు నవాబు
అంతవరకు నేనొక..నిరంతర సంచారి

నాదారి ఎడారి నాపేరు బికారి
నాదారి ఎడారి నాపేరు బికారి

అమరదీపం--1977::శుభపంతువరాళి::రాగంచిమ్మలోని ఒక ఆణిముత్యం వినండి

సంగీతం::మాధవపెద్ది సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల
దర్శకత్వం::కే.రాఘవేంద్రరావు బీ.ఎ.
నటీ,నటులు::కృష్ణంరాజు,జయసుథ,మురళీమోహన్


శుభపంతువరాళి::రాగం 


జయసుధ::

ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతికలిపినాము
ఆహా..ఊహూ..ఆహా..ఉహూ

మురళీమోహన్::
ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
మనకళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో..ఇది ఏ తాళమో

చరణం::1

మురళీమోహన్::
ఎదలో మెదిలే సంగతులన్నీ
పలికెను సంగీతమై..పలికెను సంగీతమై

జయసుధ::
కలిసిన కన్నుల మెరిసేకలలే
వెలిసెను గమకములై వెలిసెను గమకములై

మురళీమోహన్::
హోయలైన నడకలే లయలైనవవవి

జయసుధ::
చతురాడు నవ్వులే గతులైనవి

మురళీమోహన్::
సరిసరి అనగానె మరిమరి కొసరాడు

ఇద్దరు::
మురిపాలె మనజంట స్వరమైనది

జయసుధ::
ఏ రాగమో ఇది ఏ తాళమో

మురళీమోహన్::
మనకళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో..

జయసుధ::
ఇది ఏ తాళమో

చరణం::2

జయసుధ::
విరికన్నె తనకు పరువమెకాదు
పరువూ కలదన్నది పరువు కలదన్నది

మురళీమోహన్::
భ్రమరము తనకు అనుభవమెకాదు
అనుబంధమున్నది అనుబంధమున్నది

జయసుధ::
కోకిలమ్మ గుండెకు గొంతున్నది

మురళీమోహన్::
కొమ్మలో..లో..దానికి గూడున్నది

జయసుధ::
సరిమగవానికి సగమని తలపోయు

ఇద్దరు::మనజంటకే జంటసరి ఉన్నది

మురళీమోహన్::
ఏ రాగమో ఇది ఏ తాళమో

జయసుధ::
అనురాగాని కనువైన శృతికలిపినాము..ఏ రాగమో

మురళీమోహన్::
ఇది ఏ తాళమో..

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్--1976::శహన::రాగంసంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::దాశరథి 
గానం::P.సుశీల
దర్శకత్వం::బాపు 
తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,జగ్గయ్య,G.వరలక్ష్మి,రమాప్రభ,కాంతారావు,
అల్లు రామలింగయ్య
పల్లవి::
ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా
అప్సరలే పేరంటాళ్ళు దేవతలే పురోహితులంటా
దీవనలు ఇస్తారంటా
ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా
అప్సరలే పేరంటాళ్ళు దేవతలే పురోహితులంటా

చరణం::1

తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంటా
తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంటా
మెరుపు తీగ తోరణాలు మెరిసి మురిసి పోయేనంటా
మరపు రాని..వేడుకలంటా..ఆ
ఆకాశ పందిరిలో..నీకు నాకు పెళ్ళంటా

చరణం::2

పిల్ల గాలి మేళ గాళ్ళు పెళ్ళి పాట పాడేరంటా
పిల్ల గాలి మేళ గాళ్ళు పెళ్ళి పాట పాడేరంటా
రాజహంస జంట చేరీ రత్న హారతిచ్చేరంటా
రాసకేళి..జరిపేరంటా..ఆ
ఆకాశ పందిరిలో..నీకు నాకు పెళ్ళంటా
అప్సరలే పేరంటాళ్ళు దేవతలే పురోహితులంటా 

చరణం::3

వన్నె చిన్నెలా ఇంధ్ర ధనసు పై వెన్నెల పానుపు వేసేనంట
వన్నె చిన్నెలా ఇంధ్ర ధనసు పై వెన్నెల పానుపు వేసేనంట
మబ్బులు తలుపులు మూసేనంటా..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మబ్బులు తలుపులు మూసేనంటా..
మగువలు తొంగి చూసేరంటా

మనలను..గేలి..చేసేరంటా..హా హా హా హా హా