సంగీతం::M.S.విశ్వనాధన్ గారు,
రచన::ఆత్రేయ గారు.
గానం::S.P.బాలు గారు,
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై..ఈ..
కనుగొంటిని ఆ దేవిని...
అభినందనం అభినందనం అభినందనం
చరణం::1
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై
ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
అభినందనం అభినందనం అభినందనం
చరణం::2
ఉషోదయాల కాంతి తానై
తుషార బిందువు నేనై
సప్త స్వరాల హరివిల్లునైతి
ఉషోదయాల కాంతి తానై
తుషార బిందువు నేనై
సప్త స్వరాల హరివిల్లునైతి
ఆ కాంతికి నా రాగమాలికలర్పిస్తున్నాను
మీ అందరి కరతాళ ధ్వనులర్దిస్తున్నాను
నేడే అర్చన సమయం
నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం
గుడిలో ఘంటా నాదం
ఇది నా తొలి నైవేద్యం
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై..ఈ..
చరణం::3
వసంత కాల కోకిలమ్మ
జన్మాంతరాల రుణమా
నీ రుణమే రీతి చెల్లింతునమ్మా
నా జీవితమే ఇక నీ ప్రాధ తీర్ధం
నీ దీవనమే నాకు మహా ప్రసాదం
నేడే ఆ స్వర యజ్ఞం
నేడే ఆ శుభ లగ్నం
తొలి నే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం
ఇక నా బ్రతుకే ధన్యం.
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై..ఈ..
కనుగొంటిని ఆ దేవిని...
అభినందనం అభినందనం అభినందనం