సంగీతం::R.గోవర్ధనం
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::పిఠాపురం నాగేశ్వరరావు
తారాగణం::రామకృష్ణ,చలం,చంద్రమోహన్, ఎS.వరలక్ష్మి,స్నేహప్రభ, వెన్నీరాడై నిర్మల,రమాప్రభ
పల్లవి::
వేసుకుంటా వేసుకుంటా..చెంపలూ వేసుకుంటా
వేసుకుంటా వేసుకుంటా..చెంపలూ వేసుకుంటా
నన్నొదిలీ పోదువటే..నామీదా కోపమటే
నన్నొదిలీ పోదువటే..నామీదా కోపమటే
వేసుకుంటా వేసుకుంటా..చెంపలూ వేసుకుంటా
చరణం::1
అలరఘురాముడు..సీతాదేవియు
అడవులలోబడి..విడిపోయారూ
అలరఘురాముడు..సీతాదేవియు
అడవులలోబడి..విడిపోయారూ
ఆ జత గూర్చను..హనుమాన్ ఉండే
మన జత చేర్చను..ఎవడూ లేడే..ఏఏఏ
ఆ జత గూర్చను..హనుమాన్ ఉండే
మన జత చేర్చను..ఎవడూ లేడే
ఏడ్చీ ఏడ్చీ బేజారైతీ..నా ఉసురు కొట్టేనులే ఆహాహో
వేసుకుంటా వేసుకుంటా..చెంపలూ వేసుకుంటా
నన్నొదిలీ పోదువటే..నామీదా కోపమటే
చరణం::2
అందమైన..నీ ముఖ బింబములో
కోటి చంద్రులను..కనుగొన్నానే..ఏఏఏ
కొరకొరలాడే..నీ కోపంలో
ఉరుములు మెరుపులు..చూచానులేవే..ఏఏఏ
తప్పో ఒప్పో..ఏదో చేశా
దయజూపి..మన్నింపవే
వేసుకుంటా వేసుకుంటా..చెంపలూ వేసుకుంటా
నన్నొదిలీ పోదువటే..నామీదా కోపమటే
చరణం::3
వేసవి వస్తే ఊటీకి వెళతా..పిచ్చి బట్టితే వైజాగుపోతా..ఆ
వేసవి వస్తే ఊటీకి వెళతా..పిచ్చి బట్టితే వైజాగుపోతా
లవ్వు ముదిరితే నీ చెంత కొస్తా..నువు కాదంటే నూతిలో పడతా
లవ్వు ముదిరితే నీ చెంత కొస్తా..నువు కాదంటే నూతిలో పడతా
తళుకూ కులుకూ వేషం మోసం..రూపెత్తి నీవైతివా..మ్మ్