Sunday, March 23, 2014

బంగారు కానుక--1982
















సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,సుజాత,శ్రీదేవి. 
:::

ఏవిటోగా ఉంది..ఏదో అడగాలని ఉంది
ఏదో కావాలని..తెలియక తికమకగా ఉంది
ఏవిటోగా ఉంది..ఏదో అడగాలని ఉంది
ఏదో కావాలని..తెలియక తికమకగా ఉంది
అది ఏవిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
నీకు తెలుసా మిస్

ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది
ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది
ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది
ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది
అది ఏమిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
నీకు తెలుసా మిస్టర్

:::1

అది ఇదీ అని చెప్పలేనీ..మూగమనసుతో
అది అదే అని చెప్పుకోనీ..కోడెవయసుతో
అది ఇదీ అని చెప్పలేనీ..మూగమనసుతో
అది అదే అని చెప్పుకోనీ..కోడెవయసుతో
మంచుతెరలు తొలగించాలని..మల్లెపూలు నలిపేయ్యాలని
మంచుతెరలు తొలగించాలని..మల్లెపూలు నలిపేయ్యాలని
కసి కసిగా..ఉసి ఉసిగా..రెపరెప తపనల అలజడిగా

ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది
ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది
అది ఏమిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఆఆ 
నీకు తెలుసా మిస్

:::2

శృతి మరీ మించుతున్న కొత్త లయలతో..హాయ్
రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో
శృతి మరీ మించుతున్న కొత్త లయలతో..ఓ..ఓ
రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో
ఎదకు నిన్ను అదిమెయ్యాలని..ఎల్లలన్ని చిదిమెయ్యాలని
ఎదకు నిన్ను అదిమెయ్యాలని..ఎల్లలన్ని చిదిమెయ్యాలని
తడి తడిగా పొడి పొడిగా..తహ తహలాడిన సందడిగా

ఏవిటోగా ఉంది..ఏదో అడగాలని ఉంది
ఏదో కావాలని తెలియక తికమకగా ఉంది
అది ఏవిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
నీకు తెలుసా మిస్

హోయ్..ఏవిటోగా ఉంది..ఎదలో సొదగా ఉంది
ఏదో కావాలని..నిన్నే అడగాలని ఉంది
అది ఏమిటో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
నీకు తెలుసా మిస్టర్

Bangaaru Kaanuka--1982
Music::Satyam
Lyrics::Veturi
Singer's::S.P.Baalu,P.Suseela
Cast:: ANR,Sujatha,Sridevi

:::

eviTOgaa undi..edO aDagaalani undi
edO kaavaalani..teliyaka tikamakagaa undi
eviTOgaa undi..edO aDagaalani undi
edO kaavaalani..teliyaka tikamakagaa undi
adi eviTO..O..O..O..O..O..O
neeku telusaa miss

eviTOgaa undi..edalO sodagaa undi
edO kaavaalani..ninne aDagaalani undi
eviTOgaa undi..edalO sodagaa undi
edO kaavaalani..ninne aDagaalani undi
adi emiTO..O..O..O..O..O..O
neeku telusaa Mister

:::1

adi idee ani cheppalenee..moogamanasutO
adi ade ani cheppukOnee..kODevayasutO
adi idee ani cheppalenee..moogamanasutO
adi ade ani cheppukOnee..kODevayasutO
manchuteralu tolaginchaalani..mallepoolu nalipeyyaalani
manchuteralu tolaginchaalani..mallepoolu nalipeyyaalani
kasi kasigaa..usi usigaa..reparepa tapanala alajaDigaa

eviTOgaa undi..edalO sodagaa undi
edO kaavaalani..ninne aDagaalani undi
adi emiTO..O..O..O..O..aaaa 
neeku telusaa miss

:::2

Sruti maree minchutunna kotta layalatO..haay
ruchulevO kOrutunnaa mattu pedavitO
Sruti maree minchutunna kotta layalatO..O..O
ruchulevO kOrutunnaa mattu pedavitO
edaku ninnu adimeyyaalani..ellalanni chidimeyyaalani
edaku ninnu adimeyyaalani..ellalanni chidimeyyaalani
taDi taDigaa poDi poDigaa..taha tahalaaDina sandaDigaa

eviTOgaa undi..edO aDagaalani undi
edO kaavaalani teliyaka tikamakagaa undi
adi eviTO..O..O..O..O..O..O
neeku telusaa miss

hOy..eviTOgaa undi..edalO sodagaa undi
edO kaavaalani..ninne aDagaalani undi
adi emiTO..O..O..O..O..O..O
neeku telusaa Mister

నా ఇల్లు--1953::సారంగ::రాగం























సంగీతం::చిత్తూరు నాగయ్య, అద్దెపల్లి
రచన::దేవులపల్లి
గానం::R.బాలసరస్వతీ దేవి, జిక్కి

(M.L.వసంతకుమారి, T. A. మోతి)
(M.L.వసంతకుమారి, T. A. మోతి )

సారంగ::రాగం
తారాగణం::నాగయ్య, B.జయమ్మ,రాజకుమారి,లింగమూర్తి,వేదవతి,గిరిజ

పల్లవి::

అదిగదిగో గగనసీమ..అందమైన చందమామ ఆడెనోయి
అదిగదిగో గగనసీమ..అందమైన చందమామ ఆడెనోయి
ఇదిగిదిగో తేలి తేలి..చల్లనైన పిల్లగాలి
ఇదిగిదిగో తేలి తేలి..చల్లనైన పిల్లగాలి పాడెనోయి
సారిగమ పదనిసా..సాదాపమ రిగమరిస 
అదిగదిగో గగనసీమ..అందమైన చందమామ ఆడెనోయి

చరణం::1

హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం
హాయి హాయి ఈ లోకం..తీయనైనదీ లోకం
నీ ఇల్లే పూల వనం..నీ సర్వం ప్రేమ ధనం
మరువకోయి..ఈ సత్యం..అదిగదిగో గగనసీమ..

చరణం::2

నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు
నీ కోసమే జగమంతా..నిండెనోయి వెన్నెలలు
తేలెనోయి గాలి పైన..తీయనైన కోరికలు

చరణం::3

ఆ ఆ ఆ ఆ ఆ..
చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం
చెరుపుకోకు నీ సౌఖ్యం..చేతులార ఆనందం
యేనాడును పొరపడకోయ్..యేమైన తొరపడకోయ్
మరల రాదు రమ్మన్నా..మరల రాదు రమ్మన్నా
మాయమైన ప్రేమధనం..చివురింపదు తిరిగీ
వాడి చెడిన పూలవనం..మరువకోయి ఈ సత్యం..మ్మ్ మ్మ్ మ్మ్

నాదీ ఆడజన్మే--1965




















సంగీతం::R.సుదర్శన్
రచన::దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు, సావిత్రి,s.v.రంగారావు, హరనాధ్,జమున

పల్లవి::

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

చరణం::1

ఆహ..హా..ఊహు..హూ
ల.ల.ల.ల.ల.ల.లా.లా
ల.ల.ల.ల.ల.ల.లా.లా

హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ

హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ

పసివాడు పలికేటి మాటా
ముత్యాల రతనాల మూటా

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

చరణం::2

ఆహ..హా..మ్మ్ మ్మ్..మ్మ్
ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా

ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా

కనుమూసి నిదురించు బాబూ
కలలందు దోగాడగలడు 

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

Naadee Adajanme--1965
Music::R.Sudarsan
Lyrics::Dasarathi
Singer's::Ghantasala,P.Suseela
CAST::N.T.RaamaaRao, Saavitri,S.V.RangaaRao, Haranaadh Jamuna

:::

chinnaari ponnaari puvvu
viraboosi viraboosi navvu
mana inTi podarinTi puvvoo
ninu choosi nanu choosi navvoo

chinnaari ponnaari puvvu
viraboosi viraboosi navvu
mana inTi podarinTi puvvoo
ninu choosi nanu choosi navvoo

:::1

aaha..haa..mm hu..hoo
la.la.la.la.la.la.laa.laa
la.la.la.la.la.la.laa.laa

hRdayaana kadalaaDu baaboo
raepu uyyaala jaMpaalaloogoo

hRdayaana kadalaaDu baaboo
raepu uyyaala jaMpaalaloogoo

pasivaaDu palikaeTi maaTaa
mutyaala ratanaala mooTaa

chinnaari ponnaari puvvu
viraboosi viraboosi navvu
mana inTi podarinTi puvvoo
ninu choosi nanu choosi navvoo

:::2

aaha..haa..mm..mm..mm
la.la.la.la.la.la.laa.laa
la.la.la.la.la.la.laa.laa

oDilOna pavaLinchu veLaa
nenu paaDenu oka jOla paaTaa

oDilOna pavaLinchu veLaa
nenu paaDenu oka jOla paaTaa

kanumoosi nidurinchu baaboo
kalalandu dOgaaDagalaDu

chinnaari ponnaari puvvu
viraboosi viraboosi navvu
mana inTi podarinTi puvvoo
ninu choosi nanu choosi navvoo
aa haa ha aa haa ha aahaa mm mm mm 

మంగమ్మ శపధం--1965















సంగీతం::T.V.రాజు
రచన::సినారె
గానం::P.సుశీల
తారాగణం:N.T.రామారావు, జమున,రేలంగి, గిరిజ,రాజనాల, ఎల్.విజయలక్ష్మి

పల్లవి::

అందాల నా రాజ అలుకేలరా 
ఔనని కాదని అనవేలరా..ఆ..ఆ
అందాల నా రాజ అలుకేలరా 
ఔననీ..కాదని అనవేలరా..ఆ..ఆ
అందాల నా రాజ అలుకేలరా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::1

చందురుడాపైన సందడి చేసేను 
డెందములోలోన తొందర చేసేను
అందని వలపులు గంధము పూసేను
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అందని వలపులు గంధము పూసేను 
సుందరి జాలిగ చూసేనురా..ఆ
అందాల నా రాజ అలుకేలరా..ఆ

చరణం::2

మరులను చిలికించు చిరునవ్వులేమాయే
మనసును కవ్వించు కనుసన్నలేమాయే
మదనుని తూపులు మరి మరి పదునాయే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మదనుని తూపులు మరి మరి పదునాయే 
మౌనము చాలించి నన్నేలరా..ఆ
అందాల నా రాజ అలుకేలరా
ఔననీ..కాదని అనవేలరా
అందాల నా రాజ అలుకేలరా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

మంగమ్మగారి మనవడు--1984




















సంగీతం::K.V.మహదేవన్
రచన::సినారె
డైరెక్టర్::కోడి రామకృష్ణ 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::బాలకృష్ణ,సుహాసిని,భానుమతి రామకృష్ణ 

పల్లవి:

దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
హ..హ..హహ..హ..హ

దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు
అరె దంచు దంచు బాగా దంచు
దప్పి పుట్టినా..కాస్త నొప్పి పెట్టినా
ఆగకుండ..ఆపకుండ
అందకుండ..కందకుండ
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా

చరణం::1

పోటు మీద పోటు వెయ్యి
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు
కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు
కుడి చేత కుదిపి కొట్టు 

ఏ చెయ్యి ఎత్తితేమి
మరి ఏ చెయ్యి దించితేమి
హ..ఏ చెయ్యి ఎత్తితేమి
మరి ఏ చెయ్యి దించితేమి
అ..హ..హ..హ..హ..

కొట్టినా నువ్వే..పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే
హా..దంచుతా మంగమ్మ మనవడా
ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ
హా..హా..హా..హా..హా..హా
దంచుతా మంగమ్మ మనవడా..హోయ్
నేను దంచితే నీ గుండె దడ దడ

చరణం::2

కోరమీసం దువ్వబోకు
కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు 
ఇరుగు చూస్తే టముకు టముకు
కోరమీసం దువ్వబోకు
కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు
ఇరుగు చూస్తే టముకు టముకు 

ఏ కంట పడితేమి..ఎవ్వరేమంటే మనకేమి
ఏ కంట పడితేమి..ఎవ్వరేమంటే మనకేమి
నువ్వు పుట్టంగానే..బట్ట కట్టంగానే
నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను

దంచవే మేనత్త కూతురోయ్
వడ్లు దంచవే నీ గుండెలదరదరదర
హా..దంచుతా మంగమ్మ మనవడా
నేను దంచితే నీ గుండె దడ దడ
హా..హా..హా..హా..హాహాహాహా
హా..హా..హా..హా..హాహాహాహా