సంగీతం::TV.రాజు
రచన::Dr.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తొలికోడి కూసింది..తెల తెలవారింది
వెలుగులలొ జగమంతా..జలకాలాడింది
తొలికోడి కూసింది..తెల తెలవారింది
దూరాల ఆకాశ తీరాల
బంగారు హారాలు..వేసెను కిరణాలు
ఈ వేళ విరిసే..భావాల మెరిసే
శ్రీ వేంకటేశుని చరణాలు..శ్రీ వేంకటేశుని చరణాలు
తొలికోడి కూసింది..తెల తెలవారింది
అనురాగవల్లి..ఆతీగవల్లి..అలరారె..తనపూల పాపలతో
తొలిచూరులేగ తలవూపి రాగ..తొలిచూరులేగ తలవూపి రాగ
పులకించె గోమాత చేవులతో..పులకించె గోమాత చేవులతో
తొలికోడి కూసింది..తెల తెలవారింది
వెలుగులలొ జగమంతా..జలకాలాడింది
తొలికోడి కూసింది..తెల తెలవారింది