Wednesday, March 19, 2014

త్రిశూలం--1982




















సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ  
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::K.Raghavendra Rao
తారాగణం::కృష్ణం రాజు,జయసుధ,శ్రీదేవి.  

పల్లవి:: 

అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా 
అవుతుందనీ..ఏదో మత్తుందనీ మతే పోతుందనీ 
అనుభవమైన ఇప్పటి దాకా అనుకోలేదమ్మా 

నేనూ అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా 
అవుతుందనీ..ఏదో మత్తుందనీ మతే పోతుందనీ 
అనుభవమైన ఇప్పటి దాకా అనుకోలేదమ్మా 

అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీ 

చరణం::1 

ఒక్క క్షణంలో నాకే తెలియక..ఏదో జరిగింది 
సిగ్గు వచ్చి నా చెంప మీటితే..ముద్దని తెలిసింది 

ఒక్క క్షణంలో నాకే తెలియక..ఏదో జరిగింది 
సిగ్గు వచ్చి నా చెంప మీటితే..ముద్దని తెలిసింది 

నిన్ను చూసుకొని అనురాగానికి..వేగం వచ్చింది 
నిన్ను చూసుకొని అనురాగానికి..వేగం వచ్చింది 
కన్నె పెదవిపై ముద్ర వేసి..అది హద్దును చెరిపింది 

సిగ్గు..చెంప..పెదవీ..ముద్దు 
సిగ్గు..చెంప..పెదవీ..ముద్దు 
వలపుల తావులనీ..వావీ వరసలనీ
అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా అవుతుందనీ

చరణం::2

గాలి వీచితే పరవశమంది తీగే ఊగిందో 
తీగ ఊగితే పరువం వచ్చి గాలే వీచిందో 

గాలి వీచితే పరవశమంది తీగే ఊగిందో..ఓ..ఓ
తీగ ఊగితే పరువం వచ్చి గాలే వీచిందో 

తేటి పాపకు ఆకు చాటునా పువ్వే విరిసిందో 
తేటి పాపకు ఆకు చాటునా పువ్వే విరిసిందో 
పువ్వు సొగసుకు తేటి గొంతులో పాటే పలికిందో 

గాలి..తీగ..పువ్వూ..తుమ్మెదా
గాలి..తీగ..పువ్వూ..తుమ్మెదా
కలిసిన జంటలనీ..కలవక ఉండవనీ 
నేను అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా 
అవుతుందనీ..ఏదో మత్తుందనీ మతే పోతుందనీ 
అనుభవమైన ఇప్పటి దాకా అనుకోలేదమ్మా 

నేనూ అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ ఇలా 
అవుతుందనీ..ఏదో మత్తుందనీ మతే పోతుందనీ

Trisoolam--1982
Music::K.V.Mahadevan
Lyrics::Achaarya Atreya  
Singer's::S.P.Baalu,Suseela 
Film Directed By::K.Raghavendra Rao
CAST::Krisham Raaju,Jayasudha,Sreedaevi.  

::::::::::::::::::::::

anukOledamma ilaa uNTuNdanee ilaa 
avutuNdanee..edO mattuNdanee mate pOtuNdanee 
anubhavamaina ippaTi daakaa anukOledammaa 

anukOledamma ilaa uNTuNdanee ilaa 
avutuNdanee..edO mattuNdanee mate pOtuNdanee 
anubhavamaina ippaTi daakaa anukOledammaa

anukOledamma ilaa uNTuNdanee ilaa avutuNdanee 

:::1 

okka kshanamlO naake teliyaka..edO jarigindi 
siggu vachchi naa chempa meeTite..muddani telisindi 

okka kshanamlO naake teliyaka..edO jarigindi 
siggu vachchi naa chempa meeTite..muddani telisindi  

ninnu choosukoni anuraagaaniki..vegam vachchindi 
ninnu choosukoni anuraagaaniki..vegam vachchindi 
kanne pedavipai mudra vesi..adi haddunu cheripindi 

siggu..chempa..pedavee..muddu 
siggu..chempa..pedavee..muddu 
valapula taavulanee vaavee varasalanee
anukOledamma ilaa unTundanee ilaa avutundanee

:::2

gaali veechitae paravaSamaMdi teegae oogiMdO 
teega oogitae paruvaM vachchi gaalae veechiMdO 

gaali veechite paravaSamandi teege oogindO..O..O
teega oogite paruvam vachchi gaale veechindO 

teTi paapaku aaku chaaTunaa puvve virisindO 
teTi paapaku aaku chaaTunaa puvve virisindO 
puvvu sogasuku teTi gontulO paaTe palikindO 

gaali..teega..puvvoo..tummedaa
gaali..teega..puvvoo..tummedaa
kalisina janTalanee..kalavaka unDavanee 
nenu anukOledamma ilaa unTundanee ilaa 
avutundanee..edO mattundanee mate pOtundanee 
anubhavamaina ippaTi daakaa anukOledammaa 

nenoo anukOledamma ilaa unTundanee ilaa 

avutundanee..edO mattundanee mate pOtundanee


పాడిపంటలు--1976






















సంగీతం::K.V.మహదేవన్
రచన::మోదుకూరి జాన్సన్
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,చంద్రమోహన్,గుమ్మడి,జగ్గయ్య,కాంతారావు

పల్లవి::

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మనజన్మ భూమి

చరణం::1

రైతు లేనిదే..రాజ్యం లేదని
రైతు లేనిదే..రాజ్యం లేదని
ఎద్దుల గంటలు మ్రోగినప్పుడే
నీలాకాశం నుదుటిన తిలకం
నిండుగ దిద్దుకుంటుంది

రైతు పాదమే..రామ పాదమని
పిల్లగాలులు పాడినంతనే
హే..హే..ఆ..ఆ..ఆ
రైతు పాదమే..రామ పాదమని
పిల్లగాలులు పాడినంతనే
అణువు అణువు అన్నపూర్ణై
ప్రేమతో పులకరిస్తుంది
మమతల మాగాణి..మనజననీ

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మనజన్మ భూమి..మనజన్మ భూమి

చరణం::2

నాగలితో నమస్కరించి..పారలతో ప్రణమిల్లి
నాగలితో నమస్కరించి..పారలతో ప్రణమిల్లి
భూమి గుప్పెట పట్టి..గుప్పెడు ధాన్యం చల్లితే
గంగ యమున గోదావరి కృష్ణలై
పాలపొంగులై ప్రవహించి
కుప్పతెప్పలుగా పురులు పొర్లగా
ప్రాణం పంటగా ప్రసవించే..జననీ
పచ్చి బాలింతరాలు..మన జననీ

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మనజన్మ భూమి..మనజన్మ భూమి

చరణం::3

నల్లని రాముని..అల్లరి కృష్టుణి
నల్లని రాముని..అల్లరి కృష్టుణి..పాదాలతో
చల్లబడిన నల్లరేగడి భూమి
బోసు..భగత్ సింగ్..బాపు..నెహ్రు..త్యాగాలతో
ఊపిరి పీల్చిన భూమి

అల్లూరి సీతారామరాజు రక్తంతో..వీర రక్తంతో
తడిచి తరించి..రత్నగర్భగా
రాళ్ళకెక్కిన జనని..రతనాలకన్న జననీ

భాష ఏదైనా..వేషమేదైనా
భారతీయులు ఒకటేననుచు
బిడ్డలందరికి ఒకే బావుటా
నీడగ ఇచ్చిన..జననీ
విశ్వ నివాళులందిన..జననీ
మాతకు మాత..మన భరతమాత

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో పసిడిరాశులతో
కళ కళలాడే జననీ
మన జన్మభూమి..మన జన్మభూమి

     

కృష్ణావతారం--1982




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
గానం::S.P.బాలు,S.P.శైలజ
Film Directed By::Baapu 
నిర్మాణ సంస్థ::బాలమురుగా పిక్చర్స్
తారాగణం::కృష్ణ,శ్రీదేవి,విజయశాంతి,

పల్లవి::

సిన్నారి నవ్వు..ఊ..సిట్టి తామరపువ్వు
సెరువంత చీకటిని..సుక్కంత వెలుగు
సుక్కంత ఎలుగేమొ..సూరీడు గావాల
సిన్నారి సిరునవ్వు..ఊ..బతుకంత పండాల

చరణం::1

పువ్వులో పువ్వుంది..బంగారు తల్లి..ఈ
పువ్వులెంటే ముళ్ళు..పొంచి ఉన్నాయి
మనసున్న మడిసొకడు..ఈడనున్నాడు
ఈడు రాకుండాను..తోడుండగలడు
సిన్నారి నవ్వు..ఊ..సిట్టి తామరపువ్వు

చరణం::2

ఓ కంట కన్నీరు..ఉరికేను చూడు
ఓ కంట పన్నీరు..కురిసేను నేడు
కన్నతల్లి మనసు..మురిపాలవెల్లి
కళ్ళలో మెరిసేను..అనురాగవల్లి 
ఒంటిపైన లేని..మనసంతవోయి
ఒడిలోని పాపాయి..వటపత్ర శాయి..ఈఈఈ 

చరణం::3

హాయి..హాయి..హాయి..ఆపదలూ గాయీ
హాయి..హాయి..హాయి..ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు..మొలక పాపాయి
హాయి..హాయి..హాయి..ఆపదలూగాయీ

హాయి..హాయి..హాయి..ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు..మొలక పాపాయి
హాయి..హాయి..హాయి..ఆపదలూగాయీ
చిలకల్లే కులికేవు..మొలక పాపాయి
అత్తరూ లేదురా..పన్నీరు లేదు
ఉడుకు నీరే చాలు..మనకూ పదివేలు
సాంబ్రాణి పొగమాటు..ఓ సందమామ
నీ అగులు సుక్క..సోగసు అద్దానికీసు
కన్నతల్లికి కంటి..పాపవే గాని
కడవాళ్లకే కంటి..నలుసు వయ్యావు
నేలపై పారాడు..బాల కిట్టమ్మా
నెమలీకన్నేదిరా..నాకూ సూపమ్మా
నేలాపై పారాడు..బాలా కిట్టమ్మా
నెమలీకన్నేదిరా..నాకూ సూపమ్మా

Krishnavataram--1982
Music::K.V.Mahadevan
Lyrics::Indraganti Sreekaant Sarma
Singer's::S.P.Baalu,S.P.Sailaja
Film Directed By::Baapu
Cast::Krshna,Sreedevi,Vijayasaanti.

:::::::::::::

sinnaari navvu..uu..siTTi taamarapuvvu
seruvanta cheekaTini..sukkanta velugu
sukkanta elugEmo..sooreeDu gaavaala
sinnaari sirunavvu..uu..batukanta panDaala

::::1

puvvulO puvvundi..bangaaru talli..ii
puvvulenTE muLLu..ponchi unnaayi
manasunna maDisokaDu..iiDanunnaaDu
iiDu raakunDaanu..tODunDagalaDu
sinnaari navvu..uu..siTTi taamarapuvvu

::::2

O kanTa kanniiru..urikEnu chooDu
O kanTa panniiru..kurisEnu nEDu
kannatalli manasu..muripaalavelli
kaLLalO merisEnu..anuraagavalli 
onTipaina lEni..manasantavOyi
oDilOni paapaayi..vaTapatra Saayi..iiiiii 

::::3

haayi..haayi..haayi..aapadaloo gaayii
haayi..haayi..haayi..aapadaloogaayii
chilakallae kulikaevu..molaka paapaayi
haayi..haayi..haayi..aapadaloogaayii

haayi..haayi..haayi..aapadaloogaayii
chilakallae kulikaevu..molaka paapaayi
haayi..haayi..haayi..aapadaloogaayii
chilakallE kulikEvu..molaka paapaayi
attaroo lEduraa..panneeru lEdu
uDuku neerE chaalu..manakoo padivElu
saambraaNi pogamaaTu..O sandamaama
nee agulu sukka..sOgasu addaanikeesu
kannatalliki kanTi..paapavE gaani
kaDavaaLlakae kanTi..nalusu vayyaavu
nElapai paaraaDu..baala kiTTammaa
nemaleekannEdiraa..naakuu soopammaa
nElaapai paaraaDu..baalaa kiTTammaa
nemaleekannEdiraa..naakoo soopammaa

లంకేశ్వరుడు--1989
















సంగీతం::రాజ్-కోటి 
రచన::దాసరి నారాయణ రావు   
గానం::S.P.బాలు,S.జానకి 

పల్లవి::

క్లాప్..క్లాప్..క్లాప్..టు..క్లాప్ 
క్లాప్..టు..క్లాప్..హాండ్ టు హాండ్ 
క్లాప్..క్లాప్..క్లాప్..క్లాప్..క్లాప్..క్లాప్
క్లాప్..క్లాప్..క్లాప్.....
డడ్డడాడడ డడ్డడాడడ డడ్డడాడడాహా

పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు 
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు 
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో 
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో 

పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు 
ఎవరీ బడి..పదహారేళ్ళ వయసు 
థట్స్ గుడ్ పడిపడి లేచే మనసు 
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో 
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో 

చరణం::1

రెండు రెండు కళ్ళు చూడ చూడ ఒళ్ళు 
వేడి వేడి సెగలు..హ్హా..ప్రేమ కోరు పొగలు..అహ్హా 
చూడ గుండె ఝల్లు లోన వానజల్లు 
లేనిపోని దిగులు రేయిపగలు రగులు 
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
తురుతుతు తురుతుతు తురుతుతు 
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
తురుతుతు తురుతుతు తురుతుతు 
హ్హా..ఆడ పిల్ల సబ్బు బిళ్ళ..కన్నె పిల్ల అగ్గి పుల్ల 
రాసుకుంటే రాజుకుంటే..ఎహేయ్ ఏహేయ్ ఏహేయ్.. 
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో 
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో 
పదహారేళ్ళ వయసు..పడిపడి లేచే మనసు
Come on girls..  
పదహారేళ్ళ వయసు..పడిపడి లేచే మనసు
హ్హా..

చరణం::2

డడ్డడాడడ డడ్డడాడడ డడ్డడాడడాహా
డడ్డడాడడ డడ్డడాడడ డడ్డడాడడాహా

పిల్లదాని ఊపు..కుర్రకారు ఆపు 
పైన చూడ పొగరు..ఆహాలోన చూడ వగరు..ఏహేహే 
పిల్ల కాదు పిడుగు..గుండె కోసి అడుగు 
దాచలేని ఉడుకు..దోచుకోని సరుకు 
అందమైన ఆడపిల్ల..పట్టుకుంటే
తురుతుతు తురుతుతు తురుతుతు 
చూడలేక చందమామ..తప్పుకుంటే
తురుతుతు తురుతుతు తురుతుతు 
ఓ..అందమైన ఆడపిల్ల..చూడలేక చందమామ 
ఏయ్..ఏహేయ్ ఏహేయ్ ఏహేయ్ ఏహేయ్..ఈ..
పట్టుకుంటే తప్పుకుంటే 
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో 
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో 
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు 
Come on girls..  
పదహారేళ్ళ వయసు..య్యా..పడిపడి లేచే మనసు 
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో 
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో 

డడ్డడాడడ డడ్డడాడడ డడ్డడాడడాహా
డడ్డడాడడ డడ్డడాడడ డడ్డడాడడాహా
డడ్డడాడడ..హే..ఏ.....య్యా....