సంగీత:: సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు
తారాగణం::చలం, ఆరతి, గుమ్మడి, కృష్ణంరాజు, అంజలీదేవి
పల్లవి::
హేయ్..ఎగిరెగిరి పడబోకె..సిరిసిరిమువ్వా
ఎదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వా
నువ్వెదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వ
ఎగిరెగిరి పడబోకె..సిరిసిరి మువ్వా
ఎదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వా
నువ్వెదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వ
చరణం::1
సిరుగాలి తాకిడికె..సిందూలేస్తుంది వయసు
సీమ సీటుకూమంటె..సెదిరీపోతది మనసు
సిరుగాలి తాకిడికె..సిందూలేస్తుంది వయసు
సీమ సీటుకూమంటె..సెదిరీపోతది మనసు
తల బిరుసుతో..ఒక్క తప్పటడుగేశావో
తల బిరుసుతో..ఒక్క తప్పటడుగేశావో
తస్సదియ్యా..బండి తలకిందులౌతాది
ఎగిరెగిరి పడబోకె..సిరిసిరి మువ్వా
ఎదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వా
నువ్వెదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వ
చరణం::2
ఆవంక ఒక కొండా..ఈవంక ఒక కొండా
ఆవంక ఒక కొండా..ఈవంక ఒక కొండా
రెండు కొండల నడుమ..వున్నాడు గజదొంగ
రెండు కొండల నడుమ..వున్నాడు గజదొంగ
ఆద మరసీ నువ్వు..ఆ పక్క కెళ్ళావో
ఆద మరసీ నువ్వు..ఆ పక్క కెళ్ళావో
ఏటి గట్టుకు నిన్ను..ఎగరేసు కెళ్తాడూ
ఎగిరెగిరి పడబోకె..సిరిసిరి మువ్వా
ఎదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వా
నువ్వెదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వ
చరణం::3
ఉన్నమాటంటేను..ఉలుకెందుకే నీకు
ఉండబట్టక యేదొ..సెపుతుండా ననుకోకు
ఉన్నమాటంటేను..ఉలుకెందుకే నీకు
ఉండబట్టక యేదొ..సెపుతుండా ననుకోకు
నామాట యినకుంటే..పట్టుదల యిడకుంటే
నామాట యినకుంటే..పట్టుదల యిడకుంటే
అపనా తనామనా..మిగిలేదీ నగుబాటే
ఎగిరెగిరి పడబోకె..సిరిసిరి మువ్వా
ఎదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వా
నువ్వెదురుదెబ్బ తింటావె..గడసరి గువ్వ