సంగీతం::T.చలపతి రావ్
రచన::దాసరి నారాయణ రావ్
గానం::S.P.బాలు,P.సుశీల
ఓ....హో...ఆ...ఓ..హో....ఆ...
ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ
నీదేలే ఈ జీవితమూ..నీకేలే అంకితమూ
నీకే..నీకే..అంకితమూ..
ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ
నీతీయని పిలుపులలో..నీ వెచ్చని వలపులలో
నన్ను నేను మరిచానూ..నిన్నే నాలో చూసానూ
నా హౄదయపు కోవెలలో..నిన్నే నిన్నే నిలిపాను
ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ
ప్రేమించే ప్రతి హౄదయం..పాడుతుంది ఒక రాగం
వికసించే ప్రతి కుసుమం..కోరుతుంది అనురాగం
నువు కోరుకొనే అనురాగం..నీకు నాకు సమభాగం
ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ
కంటికీ కనుపాప తోడు..చుక్కకూ జాబిల్లి జోడు
కంటికీ కనుపాప తోడు..చుక్కకూ జాబిల్లి జోడు
కడలికి కెరటాలు తోడు..చెలియకు చెలికాడు తోడు
కలిసిందీ ఈడుజోడూ..నీవు నేను సరిజోడు
ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ
నీదేలే ఈ జీవితమూ..నీకేలే అంకితమూ
నీకే..నీకే..అంకితమూ..
ప్రేమకు నీవే దేవుడవూ..రామును మించిన రాముడవూ