Monday, November 26, 2012

జగత్ కిలాడీలు--1969






సంగీతం::S.P.కోదండపాణి
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::P.సుశీల

పల్లవి::

ఎగిరే పావురమా....
ఎగిరే పావురమా దిగులెరగని పావురమా 
దిగిరావా ఒక్కసారి ప్రతి రాత్రికి పగలుందని 
వెలుగుందని ఎరుగుదువా..ఓ..ఓ..ఓ..ఓ..ఓ ఓ ఓ  
ఎగిరే పావురమా దిగులెరగని పావుర

చరణం::1

మోముపైని ఏ నీడలు ముసరరాదని చంద
మామపైని ఏ మబ్బులు మసలరాదని..ఎరుగుదువా పావురమా
మాకన్నా నీవు నయంనీకు తోచదే భయం 
మాకన్నా నీవు నయంనీకు తోచదే భయం 
మూసే చీకటుల దారిచేసి పోవాలని ఎదుగుదువా

ఎగిరే పావురమా దిగులెరగని పావురమా..ఆ ఆ ఆ

చరణం::2

అటుపచ్చని తోటుందని..అట వెచ్చని గూడుందని
అటుపచ్చని తోటుందని..అట వెచ్చని గూడుందని
అటూ ఇటూ అడుగడుగున చుక్కదీపముంటుందని
ఎగురుదువా పావురమా..ఆ ఆ ఆ ఆ ఆ
ఒక్క గడియగాని..నీ రెక్క ముడవగూడదనీ
ఒక్క గడియగాని..నీ రెక్క ముడవగూడదనీ
దూరాన ధ్రువతారను చేరే తీరాలని ఎరుగుదువా

ఎగిరే పావురమా దిగులెరగని పావురమా 
దిగిరావా ఒక్కసారి ప్రతి రాత్రికి పగలుందని 
వెలుగుందని ఎరుగుదువా..ఓ..ఓ..ఓ..ఓ..ఓ ఓ ఓ  
ఎగిరే పావురమా దిగులెరగని పావుర

వెలుగు నీడలు--1961





సంగీతం::పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన::శ్రీ శ్రీ
గానం:: P.సుశీల , స్వర్ణలత

పల్లవి::

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట

చరణం::1

కళ్ళకి పట్టీ చల్లగా కట్టి వీపుతట్టి పోతాం
తాకినవారి పేరొకసారి చెప్పవోయి చూద్దాం
చురుకుతనం బుద్దిబలం ఉంటేనే చాలు
చూడకనే తెలియు కదా నిజానిజాలు

వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు

చరణం::2

కన్నులుంది చూడలేరు కొంతమంది జనం
దారి తప్పి తిరగడమే తెలివిలేనితనం
కన్నులుంది చూడలేరు కొంతమంది జనం
దారి తప్పి తిరగడమే తెలివిలేనితనం

మెదడు పదును పెట్టాలి అసలు దొంగను పట్టాలి
మెదడు పదును పెట్టాలి అసలు దొంగను పట్టాలి
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు

చరణం::3

అంబా అనే అరుపు విని తల్లిని చేరు లేగ
నేల మెడ పిట్టను పోల్చు నింగినెగురు డేగ
చీకటైన చిటారుకొమ్మ చేరును కోతి
గురి తెలిసి మసలుకొనే నిదానమే నీతి

వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు

వెలుగు నీడలు--1961::కల్యాణి::రాగం






సంగీతం::పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల, P. సుశీల

కల్యాణి::రాగం 

పల్లవి::

హాయి హాయిగా జాబిల్లి
తొలి రేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో
మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో

హాయి హాయిగా జాబిల్లి
తొలి రేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో
మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో

చరణం::1

తళతళ మెరిసిన తారక
తెలి వెలుగుల వెన్నెల దారుల
తళతళ మెరిసిన తారక
తెలి వెలుగుల వెన్నెల దారుల

కోరి పిలిచెనో తన దరిచేరగా
మది కలచేనో తీయని కోరిక

హాయి హాయిగా జాబిల్లి
తొలి రేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో
మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో

చరణం::2

మిలమిల వెలిగే నీటిలో
చెలి కలువల రాణి చూపులో
మిలమిల వెలిగే నీటిలో
చెలి కలువల రాణి చూపులో

సుమదళములు పూచిన తోటలో
తొలి వలపుల తేనెలు రాలేనో

హాయి హాయిగా జాబిల్లి
తొలి రేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో
మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో

చరణం::3

విరిసిన హృదయమే వీణగా
మధు రసముల కొసరిన వేళల
విరిసిన హృదయమే వీణగా
మధు రసముల కొసరిన వేళల

తొలి పరువములొలికెడు సోయగం
కానీ పరవశమొందెనో మానసం

హాయి హాయిగా జాబిల్లి
తొలి రేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో
మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో