Thursday, August 30, 2007

ఆత్మ గౌరవం--1966



రచన: :ఆరుద్ర
సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
గానం::ఘంటసాల.P.సుశీల

తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం,చలం

రానని రాలేనని ఊరకే అంటావు
రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు
రానని రాలేనని ఊరకే అంటావు
రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు !!

కొంటెచూపు చూడకు
గుండెకోత కోయకు
కోపమందు కులుకుచూపి కోర్కెపెంచకు
కొంటెచూపు చూడకు
గుండెకోత కోయకు
కోపమందు కులుకుచూపి కోర్కెపెంచకు
వేశమైనా మోసమైనా అంతా నీకోసం ...
ఆమె: ఉహూ ... అలాగా

!! రానని రాలేనని ఊరకె అంటావు
రావాలని ఆశలేనిదె ఎందుకు వస్తావు !!

ఎదను గాయమున్నది ఊరడించమన్నది

మొదటముద్దు తీర్చమని మూల్గుచున్నది
ఆమె: పాపం
ఎదను గాయమున్నది ఊరడించమన్నది

మొదటముద్దు తీర్చమని మూల్గుచున్నది
గుండెమీద వాలిచూడు గోడువింటావు ..
ఆమె: ష్హ్ ... అబ్బబ్బబ్బా !!

!! రానని రాలేనని ఊరకె అంటావు
రావాలని ఆశలేనిదె ఎందుకు వస్తావు !!

దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమయిన మనసుపడే బాధ అయ్యయ్యో
దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో
దూరమయిన మనసుపడే బాధ అయ్యయ్యోమయిన
కరుణచూపి కరుగకున్న టాటా చీరియో
ఆమె: టాటా చీరియో

!! రానని రాలేనని ఊరకె అంటావు
ఆమె: ఉహూ....
రావాలని ఆశలేనిదె ఎందుకు వస్తావు !!

ఆత్మ గౌరవం--1966::రాగం:::అలహేయ బిలావాల్



సంగీతం::సాలూరిరాజేశ్వర రావ్
గానం::P.సుశీల
రచన::దాశరధి 
రాగం:::అలహేయ బిలావాల్
(రాగం:::శంకరాభరణం )


అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

ఇన్నేళ్ళకు విరిసే వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే

!! అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే !!

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మృఒగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే

!! అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే !!

ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నా మది విహరించెలే
వినువీధిని నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే

!! అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి !!

ఆత్మ గౌరవం--1966



సంగీతం::సాలూరు రాజేశ్వరరావ్
రచన::దాశరధి
గానం::P.సుశీల

తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం,చలం


మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

పట్నాలలో ఉండు పెదబాబుగారు
పల్లెసీమకు నేడు వేంచేసినారు
కొండంత దేవుణ్ని కొలిచేది ఎలాగో
తెలియక మేమంత తికమక పడ్డాము
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

ముద్దపప్పే కలుపుకోండి
కొత్త ఆవకాయే నంచుకోండి
అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ
అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ
మచ్చు చూశారంటే మళ్ళీ తెమ్మంటారు
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

బూరెలే వడ్డించ మంటారా నేతిగారెలే వేయించుకుంటారా
బొబ్బట్లు నేతిలో ముంచి దంచారంటే
బొబ్బట్లు నేతిలో ముంచి దంచారంటే
వైకుంఠమే వచ్చి వాకిట్లో దిగుతుంది
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

ఉన్నంతలో సేవలొనరించినాము
చిన్నారి మనసులే అర్పించినాము
మా ఇల్లు చల్లగా మీరు దీవించాలి
మా ఇల్లు చల్లగా మీరు దీవించాలి
మీ చూపు నీడలో మేము జీవించాలి
మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు

ఆత్మ గౌరవం--1966



సంగీతం::సాలూరు రాజేశ్వరరావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

పరువము పొంగే వేళలో పరదాలవెందుకో..
చెంగున లేచి చేతులుచాచి చెలియ నన్నందుకో..ఓ..చెలియ నన్నందుకో..

చిగురులు వేసే వయసుతో చెలగాటమెందుకో
చెంగునలేచి చేతులుసాచి చెలిని నీవందుకో..ఓ..చెలిని నీవందుకో


అందమైన హౄదయం నీది హౄదయమున్న అందం నీది
అందమైన హౄదయం నీది హౄదయమున్న అందం నీది
మధువులొలుకు ఊహలతోనే ఒదిగిచూచుప్రాయం నీది
చిగురులు వేసే వయసుతో చెలగాటమెందుకో
చెంగునలేచి చేతులుసాచి చెలిని నీవందుకో..ఓ..చెలిని నీవందుకో


వేచివున్నా వెలుగే నీవు దాచుకొన్నా కలయే నీవు
వేచివున్నా వెలుగే నీవు దాచుకొన్నా కలయే నీవు
పగలురేయి నామదిలోనే పరిమళించు వలపే నీవు
పరిమళించు వలపే నీవు
పరువము పొంగే వేళలో పరదాలవెందుకో..
చెంగున లేచి చేతులుచాచి చెలియ నన్నందుకో..ఓ..చెలియ నన్నందుకో..


మంచువోలే కనిపించేవు మధురబాధ రగిలించేవు
పొంచిపొంచి నాలో చేరి పూలవానకురిపించేవు
పూలవాన కురిపించేవు
పరువము పొంగే వేళలో..ఓహో..హో..
పరదాలవెందుకో..ఆహా..హా
చెంగున లేచి చేతులుచాచి చెలియ నన్నందుకో..ఓ..చెలిని నీవందుకో..

ఆత్మ గౌరవం--1966



సంగీతం::సాలూరు రాజేశ్వరరావ్
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి,రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం,చలం


::::

వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే
మనసులు కలిసిన చూపులే పులకించి పాడెలే
వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే


:::1

బరువు కనుల నను చూడకు మరులు కొలిపె మది రేపకు
బరువు కనుల నను చూడకుమరులు కొలిపె మది రేపకు
చెలి తలపె తెలిపెనులే సిగలోని లేమల్లెలు
వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే!!

::::2


ఉరిమిన జడిసె నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
ఉరిమిన జడిసె నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
నీ హృదయములో ఒదిగినచో బెదురింక ఏమున్నది
వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే!!
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుసగుసలు
పెదవులపై మధురిమలే చిలికించమన్నాయిలే
వలపులు విరిసిన పూవులే కురిపించె తేనియలే
మనసులు కలిసిన చూపులే పులకించి పాడెలే!!

ఆత్మ గౌరవం--1966



సంగీతం::సాలూరు రాజేశ్వరరావ్
రచన::దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల


ఆ...హా...ఆ..ఆ...
ఓ...ఒహో...ఒ...ఒ..
ఒక పూలబాణం తగిలింది మదిలో
తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే

ఒక పూలబాణం తగిలింది మదిలో
తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే


అలనాటి కలలే ఫలియించే నేడే
అలనాటి కలలే ఫలియించే నేడే
మనసైన వాడే మనసిచ్చినాడే
ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి
ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి
వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి

ఒక పూలబాణం తగిలింది మదిలో
తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే!!


ఏ పూర్వబంధమో అనుబంధమాయే
ఏ పూర్వబంధమో అనుబంధమాయే
అపురూపమైన అనురాగమాయె
నీ కౌగిట హాయిగా సోలిపోయి
నీ కౌగిట హాయిగా సోలిపోయి
సరాగాల ఉయ్యాల ఉల్లాసంగా ఊగాలో
యి
ఒక పూలబాణం తగిలింది మదిలో
తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో 
వెలిగిందిలే..నాలో వెలిగిందిలే..

ఆత్మ గౌరవం--1966





సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
నిర్మాత::D.మధుసూధనరావు
దర్శకత్వం::K.విశ్వనాథ్


రాగం:::

ఓ సోదర సోదరీమణులారా
ఆదరించి నా మాట వింటారా
వింటాం చెప్పుప్రేమించి పెళ్ళి చేసుకో
నీ మనసంత హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో

వరుణి వలపేమిటో వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా
వరుణి వలపేమిటో వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా
తెలిసి కట్నాలకై బ్రతుకు బలి చేసినా
కడకు మిగిలేది ఎడమోము పేడమోములె
ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంత హాయి నింపుకో !!

మనిషి తెలియాలిలే మనసు కలవాలిలే
మరచి పోలేని స్నేహాన కరగాలిలే
మనిషి తెలియాలిలే మనసు కలవాలిలే
మరచి పోలేని స్నేహాన కరగాలిలే
మరచి పోలేని స్నేహాన కరగాలిలె
మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే
మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే
ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంత హాయి నింపుకో !!
నలుడు ప్రేమించి పెళ్ళాడే దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీక్రిష్ణుని
నలుడు ప్రేమించి పెళ్ళాడే దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీక్రిష్ణుని
తొలుత మనసిచ్చి మనువాడే దుష్యంతుడు
పాత వరవళ్ళు దిద్దాలి మీరందరు
ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంత హాయి నింపుకో !!