సంగీతం::T.V.రాజు
రచన::దాశరధి
గానం::P. సుశీల
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..
ఎనకజన్మల నా నోములన్నీ..ఇపుడు పండినవమ్మా
ఎనకజన్మల నా నోములన్నీ..ఇపుడు పండినవమ్మా
తనకు తానై నా రాజు నాతో..
తనకు తానై నా రాజు నాతో..మనసుకలిపే నమ్మా...ఆ..
ఆ..ఆ..ఆ..
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..
ముద్దు మోమును అద్దాన చూపి మురిసిపోయాడమ్మా..ఆ
ముద్దు మోమును అద్దాన చూపి మురిసిపోయాడమ్మా
మల్లెపూలా పల్లకిలోనా వళ్ళుమరిచేనమ్మా..
మల్లెపూలా పల్లకిలోనా వళ్ళుమరిచేనమ్మా..
ఆ..ఆ..ఆ..
ముత్యాల జల్లు కురిసె..రతనాల మెరుపు మెరిసె
వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మా..