Tuesday, May 31, 2011

నేరం నాదికాదు ఆకలిది--1976


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్,గుమ్మడి,జయమాలిని,ప్రభ,గిరిబాబు.

పల్లవి::

హేయ్‌ పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా
పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  
అహ అసలూ తెలుసు అరె నకిల్లీ తెలుసు
అసలూ తెలుసు నకిల్లీ తెలుసు..అందరి గోత్రం తెలుసూ     
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  

చరణం::1

మచ్చిక చేస్తే గంగిగోవులా పాలందిస్తుంది
మచ్చిక చేస్తే గంగిగోవులా పాలందిస్తుంది 
ఇది రెచ్చిపోతే కోడెతాచులా ప్రాణం తీస్తుంది
నమ్మితె జే కొడుతుంది నచ్చితె జో కొడుతుంది
జే కొడుతుంది జో కొడుతుంది..మనసు విరిగితే మసిచేస్తుంది       
పబ్లిక్‌ రా.పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా 

చరణం::2

కబుర్లు చెప్పీ కడుపులు నింపే కాలంపోయిందీ
కబుర్లు చెప్పీ కడుపులు నింపే కాలంపోయిందీ
సందేశాలూ దిగుమతిచేసే సమయం దాటిందీ
అరె మాటలకన్న చేతలు మిన్న
మాటలకన్న చేతులు మిన్న..కాదంటే మీ బ్రతుకులు సున్న    
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  

చరణం::3

అహ దాచుకోండిరా పెట్టెల నిండా వెండీ బంగారం
దాచుకోండిరా పెట్టెల నిండా వెండీ బంగారం
దాచేస్తారా తిండిగింజలను ఎక్కడిదీ న్యాయం
మా ఆకలిముందు మా అలజడి ముందు
ఆకలి ముందు అలజడి ముందు..దోపిడి దొరల ఆటల బందు        
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా  
అహ అసలూ తెలుసు అరె నకిలి తెలుసు
అసలూ తెలుసు నకిలి తెలుసు..అందరి గోత్రం తెలుసూ     
పబ్లిక్‌ రా..పబ్లిక్‌ రా..ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా