Sunday, March 04, 2012

ఆరాధన--1987


సంగీతం::ఇళయ రాజ
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి


తీగనై మల్లెలూ పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసిన మోమాట మేనా
మమత కలబోసిన మాట కరువేనా

తీగనై మల్లెలూ పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల

తెలిసీ తెలియందా..ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా..అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా..అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా పొద్దు కుదిరేదా
ప్రేమ కన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరుపేగా

కలలో మెదిలిందా ఇది కథలో జరిగిందా
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదౌనా
మారమంటే మారుతుందా మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా చేయి చేయి కలిపేనా


తీగనై మల్లెలూ పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసిన మోమాట మేన
మమత కలబోసిన మాట కరువేనా